Brahmamudi Serial Today Episode: కావ్య దగ్గరకు ఇందిరాదేవి వెళ్లి రాజ్‌ ఎందుకు అలా చేస్తున్నాడో త్వరగా కనుక్కోమని చెప్తుంది. కనుకుంటానని కావ్య చెప్తుంది. ఇంతలో రాజ్‌ రావడం చూసి ఇందిరాదేవి వెళ్లిపోతుంది. రాజ్‌, కళ్యాణ్‌ రూంలోకి వస్తారు.

Continues below advertisement

రాజ్: ఏంటిది ఎందుకు ఇలా అంటిస్తున్నావు..?

కావ్య: అప్పుడే మర్చిపోయారా..?

Continues below advertisement

రాజ్: గుర్తుంది కానీ ఇక్కడ ఎందుకు అతికిస్తున్నావు అని అడుగుతున్నా

కావ్య: ఏం చేద్దాం అంతా నా కర్మ.. కొంతమంది ఇచ్చిన మాటని చేసిన వాగ్దానాలను మర్చిపోయి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు కనీసం వీటిని చూసైనా మార్పు వస్తుందని చిన్న ఆశ.. ఏంటి కవి గారు అలా చూస్తున్నారు.. ఓ అర్థమైంది.. ఇలాంటి పనులు మగవాళ్లు చేయాలి.. నేను చేస్తున్నాను.. ఏంటా అనా..? ఏం చేద్దాం చెప్పండి కడుపుతో ఉన్నాను కదా..? కాళ్లు కింద పెట్టకుండా చూసుకునే మొగుడు వస్తాడనుకున్నా కానీ చెప్పకుండానే హాస్పిటల్‌కు తీసుకెళ్లి అబార్షన్‌ చేయించేవాడు దొరికాడు.. అన్నట్టు ఆయన మాత్రమే అలా ఉన్నారా..? లేకపోతే మీరు కూడా అలా తయారయ్యారా..?

కళ్యాణ్‌: అదేంటి వదిన అలా అంటున్నారు..

కావ్య: ఆయన బుద్దులేవైనా వచ్చి నాచెల్లిని మీరు కూడా ఇబ్బంది పెడుతున్నారేమోనని అడుగుతున్నాను. కవి గారు మీరు అలాంటి పిచ్చిపనులు ఏమైనా చేశారు అనుకో..

కళ్యాణ్‌: అయ్యో అలా ఏం లేదు వదిన తను సంతోషంగానే ఉంది.

కావ్య: ఉంటుంది లేండి కవిగారు దాన్ని మాత్రమే కాకుండా తన కడుపులో పెరుగుతున్న బిడ్డను ప్రేమించే వాడు దొరికాడు కదా అందుకే సంతోషంగా ఉంటుంది.

అంటూ పని మనిషిని పిలిచి జ్యూస్‌ ఇవ్వమని అడుగుతుంది. రత్తాలు సరే అంటూ కిచెన్‌ లోకి వెళ్లి జ్యూస్ చేస్తుంటే.. వెనకే రాజ్‌ వెళ్తాడు. తాను జ్యూస్‌ చేస్తానని రత్తాలును బయటకు వెళ్లమని చెప్తాడు. రత్తాలు వెళ్లగానే ఆ జ్యూస్‌లో అబార్షన్‌ టాబ్లెట్‌ కలిపి తీసుకెళ్లి కావ్యకు ఇస్తాడు. కావ్య అనుమానంగానే జ్యూస్‌ తీసుకుని తాగుతుంటుంది. పైన కళ్యాణ్‌ బాధపడుతుంటాడు.

కళ్యాణ్: అన్నయ్య ఏంటి.. ఇలా చేస్తున్నారు.. వదినను కాపాడటానికి తను చేస్తుంది మంచి పనే కావచ్చు కానీ ఇలా చేయడం కరెక్టు కాదు. వదినకు ఏమాత్రం డౌటు వచ్చినా అన్నయ్యకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. లేదు వదిన కడుపులో ఉన్న బిడ్డను తీయించేయడానికి ఈ పద్దతి కరెక్టు కాదు.. వదిన ఆ జ్యూస్‌ తాగకూడదు..

రాజ్‌ రూంలోకి పరుగెత్తకుంటూ వెళ్తాడు కళ్యాణ్‌. కళ్యాణ్‌ వెళ్లే సరికే కావ్య జ్యూస్‌ మొత్తం తాగేసి ఉంటుంది. దీంతో కళ్యాణ్‌ కోపంగా రాజ్‌ను పక్కకు తీసుకెళ్తాడు.

రాజ్‌: అరేయ్‌ ఏంట్రా..? ఇది.. ఏం కావాలి నీకు

కళ్యాణ్: ఇంకా ఏం కావాలి అన్నయ్య చేయాల్సిందంతా చేశావు కదా..? నేను అప్పటికీ వద్దు వద్దు అంటూ మొత్తుకుంటూనే ఉన్నాను. కానీ నువ్వు నా మాట వినకపోగా ఎమోషనల్‌ గా బ్లాక్‌ మెయిల్‌ చేశావు.. వదినేమో గుడ్డిగా నమ్మేసి ఆ జ్యూస్‌ తాగేసింది. ఇప్పుడు వదినకు ఏమైనా అయితే ఎవరన్నయ్యా రెస్పాన్స్‌బులిటీ.. ఇలాంటి  పనులు చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలి.. ఇంత స్వార్థ పరుడివి అయ్యావేంటి అన్నయ్య నువ్వు ఉండు ఆంబులెన్స్‌కు ఫోన్ చేస్తాను

రాజ్‌ ఫోన్‌ లాక్కుంటాడు.

రాజ్‌:  ఏమీ వద్దు.. నువ్వేం కంగారు పడకు.. మీ వదినకు  ఏమీ కాదురా..? నువ్వన్నట్టు కళావతి జ్యూస్‌ తాగిన మాట వాస్తవమే.. కానీ ఆ జ్యూస్‌లో నేను టాబ్లెట్‌ కలపలేదు..

అంటూ చెప్పగానే.. కళ్యాణ్‌ రిలాక్స్‌ గా వెళ్లిపోతాడు. కావ్య కిచెన్‌లోకి వెళ్లి టాబ్లెట్‌ కలిపిన జ్యూస్‌ గ్లాస్‌ చూస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!