Meghasandesam Serial Today Episode: కిచెన్‌లో ఉన్న రత్నం దగ్గరకు శారద వెళ్తుంది. భూమిని ఇంటికి తీసుకొచ్చిని ఆనందంలో నీ గురించే పట్టించుకోలేదు.. ఆరోజు అన్ని మాటలు అని మళ్లీ ఎందుకు వచ్చావే అంటూ నిలదీస్తుంది.
రత్న: ఒక్కోసారి మంచితనాన్ని చూసి కూడా ఓర్చుకోలేని కళ్లు ఉంటాయి అమ్మ. ఇంత మంచి తనాన్ని చూసిన నా కళ్లు ఆ క్షణంలో నా మనసులో ఉన్న కుళ్లును బయట పెట్టేశాయి. తప్పు అయిపోయింది అంటేను పూరి గారే ఇంటికి తీసుకొచ్చారు.
శారద: పూర్ణి.. మళ్లీ ఎందుకే దీన్ని ఇంటికి తీసుకొచ్చావు.
పూర్ణి: నువ్వు ఒక్కదానివే పని చేసుకోలేకపోతున్నావు కదమ్మా..? అందుకే తీసుకొచ్చాను.
శారద: నేను చేసుకోలేకపోతున్నాను అంటే నువ్వు సహాయం చేయాలి. అంతే కానీ ఎవరూ లేనట్టు దీన్ని ఎందుకు తీసుకొచ్చావు. చిన్నపిల్ల అదేదో తెలియక తీసుకొచ్చింది. నువ్వు నడు
పూర్ణి: అమ్మ వయసులో తను చిన్నదే కదా పైగా పిల్లలు ఉన్నారు. ఈ ఒక్కసారికి క్షమించకూడదు..
శారద: నువ్వు ఎంత బతిమిలాడినా వినేది లేదు.
అంటూ చెప్తుండగానే.. భూమి వస్తుంది. తాను ఆఫీసుకు వెళ్తున్నానని చెప్తుంది. దీంతో భూమితో మాట్లాడుతుంటే.. భూమికి మంచి జరగాలంటే ఈ దసరా నవరాత్రుల్లో భూమి గారితో అమ్మవారికి పూజ చేయించండి అని రత్న చెప్తుంది. దీంతో శారద ఇందుకోసమైనా నిన్ను ఇంట్లో ఉండనివ్వాలి అంటుంది. తర్వాత ఇంట్లో గగన్ రూంను సర్దుతూ ఉంటుంది శారద. ఇంతలో బట్టల కింద నుంచి కెమెరా కింద పడుతుంది. ఏంటి కెమెరా ఇక్కడ దాచిపెట్టాడు. ఇందులో ఏమైనా వీడియోలు ఉన్నాయా..? ఓపెన్ చేసి చూద్దాం అనుకుని కెమెరా ఆన్ చేస్తుంది శారద. అందులో అపూర్వ, శోభాచంద్రను చంపిన వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసిన శారద షాక్ అవుతుంది. వెంటనే భూమికి ఫోన్ చేస్తుంది. అకాడమీలో డాన్స్ నేర్పిస్తున్న భూమి కాల్ లిఫ్ట్ చేస్తుంది.
భూమి: చెప్పండి అత్తయ్యా ఈ టైంలో ఫోన్ చేశారు.
శారద: అమ్మా భూమి ఎక్కడున్నావు..
భూమి: అకాడమీలో ఉన్నాను అత్తయ్య.. పిల్లలకు డాన్స్ నేర్పిస్తున్నాను..
శారద: భూమి నీకు ఒక నిజం చెప్తాను.. గుండె నిబ్బరం చేసుకుని విను తల్లి..
భూమి: ఏంటత్తయ్యా అది.. చెప్పండి..
శారద: మీ అమ్మ ప్రమాదంలో చనిపోలేదమ్మా..?
భూమి: ఏంటి అత్తయ్యా మీరు చెప్పేది.. మా అమ్మ ప్రమాదంలో చనిపోలేదా..?
శారద: అవును భూమి.. మీ అమ్మను ఆ అపూర్వనే చంపేసింది. దారుణంగా గొంతు పిసికి చంపేసింది.
భూమి: అత్తయ్యా ఏం చెప్తున్నారు.. అయినా ఇన్ని రోజులుకు మీరు ఈ విషయం ఎందుకు చెప్తున్నారు..
శారద: ఇప్పడే ఇంట్లో ఒక పాత కెమెరా దొరికింది భూమి. అందులో మీ అమ్మను ఆ అపూర్వ చంపడం ఉంది.
అంటూ చెప్పగానే.. భూమి ఏడుస్తూ అత్తయ్యా ఇప్పుడే నేను ఇంటికి వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసి ఇంటికి బయలుదేరుతుంది. ఇంట్లో శారద వెనక నిలబడి అంతా వింటున్న రత్నం దగ్గరకు వెళ్లి శారదను బెదిరిస్తుంది.
రత్న: అమ్మగారు ఆ కెమెరా నాకు ఇవ్వండి..
శారద: ఏయ్ రత్న ఏం మాట్లాడుతున్నావు.. నీకెందుకు ఈ కెమెరా..?
రత్న: అమ్మగారు మంచిగా మర్యాదగా అడుగుతున్నాను.. ఆ కెమెరా నాకు కావాలి..
శారద: ఏయ్ ఎవతివే నువ్వు.. ఆ అపూర్వ మనిషివా..?
రత్న: నేను ఎవరి మనిషినైతే నీకెందుకు ఆ కెమెరా ఇవ్వు..
అంటూ బెదిరిస్తూ అడగుతుంది రత్న. శారద కెమెరా ఇవ్వనని వెళ్లబోతుంటే రత్న బలవంతంగా లాక్కుంటుంది. శారద ఇవ్వనని రత్నను తోసేస్తుంది. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతుంది. ఇంతలో భూమి అత్తయ్యా అంటూ పిలుస్తూ వస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!