Meghasandesam Serial Today Episode: భోజనం చేస్తున్న శరత్ చంద్రతో అపూర్వ.. ఇక భూమిని ఎలాగైనా క్షమించమని నాటకం ఆడుతుంది. దీంతో శరత్ చంద్ర కోపంగా తింటున్న ప్లేట్‌ను విసిరికొడతాడు..
శరత్: ఏం మాట్లాడుతున్నావు అపూర్వ..
అపూర్వ: ఆవేశపడకు బావ నేను చెప్పేది కాస్త విను. మనకు ఇష్టం లేకపోయినా గగన్‌తో భూమి పెళ్లి జరిగిపోయింది. కానీ భూమి చచ్చిపోలేదు కదా..? ఈ లోకం కూడా రేపంతా నన్ను అంటారు. సవతి తల్లి కనుక భూమి చచ్చిపోయిందని సంబరాలు చేసుకుంటున్నారు అని అందరూ నన్ను అనుకుంటారు.
చెర్రి: నాన్న అత్తయ్య ఈ కొత్త నాటకం ఏంటి..?
కేపీ: నాకు అదే అర్థం కావడం లేదురా..
అపూర్వ: అయినా నింద కోసం నేను బయపడుతున్నాను అనుకోలేదు. సమాజంలో నీ గౌరవం పెరుగుతుంది అంటే ఎన్ని నిందలు పడ్డానికైనా నేను సిద్దం బావ. మీ మర్యాద మసక బారుతుంది అంటే చావడానికైనా నేను వెనకాడను బావ. భూమి ఎవరు బావ. నా శోభాచంద్ర అక్కకు నీకు పుట్టిన అపూర్వ సంపద. అందుకే బావ వాళ్ల పెళ్లిని మనం ఆమోదిద్దాం. పెళ్లి తర్వాత జరగాల్సిన అచ్చట ముచ్చట జరిపించేద్దాం. ఆ గౌరవం మనకు మిగులుతుంది.
శరత్: అపూర్వ నువ్వు నాకు ఎంత నచ్చజెప్పినా నీ ప్రయత్నం ఫలించదు. చచ్చిన వాళ్ల మీద చావనంత ప్రేమ ఉంటే.. పాలరాతి సమాధి కట్టిస్తా
అంటూ శరత్ చంద్ర మాట్లాడతాడు. అయితే అపూర్వ తన మాటలతో శరత్ చంద్రను కన్వీన్స్ చేస్తుంది. భూమిని ఇంటికి పిలిపిస్తుంది. ఇంటికి వెళ్లిన భూమి.. అందరూ హడావిడిగా ఉండటం చూసి ఏమైందని అపూర్వను అడుగుతుంది. దీంతో అపూర్వ వెటకారంగా మాట్లాడుతుంది. అయినా మళ్లీ ఎందుకు వచ్చావు ఇంటికి అంటూ తిడుతుంది. అయినా చెప్తున్నాను విను..
అపూర్వ: ప్రతి పన్నెండు సంవత్సరాలకు వచ్చే మన ఊరి నదీ పుష్కరాలకు మీ అమ్మ నాట్య నివేదన చేసి ఆగ్నిని ప్రజ్వలింప చేస్తే.. వర్షాలు పడతాయని మీ అమ్మ నిరూపించి చూపించింది. మీ అమ్మ స్థానంలో నా కూతురే నాట్య దేవత.
అంటూ అపూర్వ చెప్పగానే.. భూమి షాక్ అవుతుంది. ఎలాగైనా శోభా చంద్ర స్థానంలో తానే నాట్య నివేదన చేయాలని డిసైడ్ అవుతుంది. అందుకోసం భూమి కూడా వాళ్ల ఊరికి వెళ్తుంది. నాట్యం చేయడానికి రెడీ అయి గుడికి వెళ్తుంది. గుడికి వచ్చిన భూమిని చూసిన శరత్ చంద్ర కోపంగా తిడతాడు.
శరత్: మళ్లీ ఎందుకు వచ్చావు.. అసలు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడకు వచ్చావు.. వెళ్లు ఇక్కడి నుంచి..
భూమి: ఎందుకు నాన్నా అలా మాట్లాడుతున్నారు. అమ్మ స్థానంలో అమ్మ కూతురుగా నాట్య నివేదన చేయాల్సింది నేను కదా నాన్నా..?
శరత్: నువ్వు ఆ హక్కు ఎప్పుడో కోల్పోయావు.. ఆ గగన్‌గాడితో తాళి కట్టించుకున్నప్పుడే నీకు మా ఇంటికి బంధం తెగిపోయింది. ఇప్పుడు నా శోభ స్థానంలో నక్షత్రే నాట్య నివేదన చేస్తుంది. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లు..
భూమి: నాన్నా నేను చెప్పేది వినండి..
అంటూ భూమి బతిమాలుతుంటే.. శరత్ చంద్ర వినకుండా భూమిని బలవంతంగా లాక్కెళ్లి గుడి స్టోర్ రూంలో వేసి బయట లాక్ చేస్తాడు. శరత్ చంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రూంలో భూమి అరుస్తుంది. నాన్నా అంటూ పిలుస్తుంది. ఎవ్వరూ పట్టించుకోరు. మరోవైపు నక్షత్ర తల మీద రెండు చేతులలో దీపాలు పెట్టుకుని నాట్యం చేసుకుంటూ గుడిలోకి వెళ్తుంది. ఇంతలో నక్షత్ర తల మీద ఉన్న దీపం కింద పడబోతుంది. వెంటనే అక్కడికి వచ్చిన నక్షత్ర దీపం కింద పడకుండా పట్టుకుంటుంది. నక్షత్ర చేతుల్లో ఉన్న దీపాలు తీసుకుని నాట్యం చేస్తూ నివేదన చేయడానికి వెళ్తుంది. ఇంతలో ఎవరో భూమి వెళ్తున్న దారిలో గాజు పెంకులు వేస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!