Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode జడ్జి కార్మికుల కేసులో విహారి, లక్ష్మీ, చారుకేశవలకు జీవిత ఖైదు విధించే టైంకి తలకు గాయాలతో ఎంట్రీ ఇస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. లక్ష్మీ జడ్జిని ఆగమని సాక్ష్యాలు తీసుకొచ్చానని చెప్తుంది. లక్ష్మీ తల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. జడ్జి ట్రీట్మెంట్ చేసుకోమని అంటే లక్ష్మీ ముందు సాక్ష్యాలు చూడమని అంటుంది.
లక్ష్మీ వీడియో జడ్జికి ఇవ్వడంతో కార్మికులు చనిపోలేదా బతికే ఉన్నారా అని జడ్జి షాక్ అయిపోతుంది. ఇప్పుడే వీడియో తీసుకొచ్చానని లక్ష్మీ అంటే అది ఏఐ జనరేటెడ్ వీడియో అని పీపీ అంటాడు. ఇంతలో ఎస్‌ఐ సంధ్య కార్మికులు చనిపోలేదని అందర్ని తీసుకొని వచ్చి జడ్జికి చూపిస్తుంది. దాంతో జడ్జి విహారి కంపెనీల మీద కేసు కొట్టేస్తుంది. ఈ కుట్రకు కారణమైన వాళ్లని ఎంక్వైరీ చేసి పట్టుకోమని పోలీసులకు ఆదేశిస్తారు. లక్ష్మీ ధైర్యసాహసాలను మెచ్చుకుంటారు.
లక్ష్మీ కళ్లు తిరిగి పడిపోవడంతో విహారి, చారుకేశవలు హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. తర్వాత ఇంటికి వస్తారు. నీ వల్లే మేం సేవ్ అయ్యాం అని చారుకేశవ అంటే ఇదంతా విహారి గారి గొప్పతనం అని లక్ష్మీ అంటుంది. నీ ప్రాణాల మీదకు వచ్చినా పేరు తీసుకోవమ్మా ఇదే నీ గొప్పతనం అని అంటారు. చారుకేశవ ఇంట్లో అందరికీ లక్ష్మీ తన ప్రాణాలకు తెగించి కాపాడిందని అంటే తన ఎండీ పదవి కోసమే ఇదంతా చేసింది అని పద్మాక్షి అంటుంది. నా పేరును మన ఇంటి పరువును కాపాడింది లక్ష్మీనే. ఈ రోజు లక్ష్మీ లేకపోతే మనకు ఏమీ మిగిలేది కాదు.. మేం జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చేది. మీరు తనని మెచ్చుకోకపోయినా పర్లేదు తన సాయం గుర్తించండి అంటాడు.
ప్రకాశ్ అందరితో నా భార్య ఎండీ పదవి పోయింది అనుకున్నా కానీ తను పదవి పోలేదు అంటాడు. ఇక పద్మాక్షి ఇదంతా ఎవరు చేశారు అని అంటే అదే తెలీదు అని విహారి అంటాడు. వాళ్లు ఎవరైనా వదలొద్దని సహస్ర అంటుంది. అందరూ దీని వెనక ఎవరు ఉన్నా అంతకు అంత శిక్ష వేయాలి అని అనుకుంటారు. విహారి మేనేజర్ మూర్తి కాల్ చేసి కొత్తగా వచ్చిన బోర్డు డైరెక్టర్లను వెనక ఉండి ఇదంతా చేయించింది అంబికా మేడం సార్.. మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు.. ఎప్పటికీ అంబిక మేడం ఛైర్మన్‌గా ఉండటానికి తనకు అనుకూలంగా ఉన్నవారిని బోర్డు మెంబర్స్‌గా తీసుకున్నారు. వాళ్లతో ఎక్కువ డబ్బులకు షేర్లు కొనిపించారు అని అంటాడు.
విహారి నమ్మలేకపోతున్నా అని అంటాడు. ఒకటికి రెండు సార్లు ఎంక్వైరీ చేశానని అంటాడు. ఇంతలో లక్ష్మీ ఫోన్‌కి విహారి కాల్ చేయడం విహారి లిఫ్ట్ చేస్తాడు. సంధ్య విహారితో ఇందాక లక్ష్మీ ఫుల్ వీడియో చూపించలేదు.. అందులో సుభాష్ అనే వాడు ఉన్నాడని చెప్తుంది. వాడా వాడిని ఇంత ముందు అరెస్ట్ చేయించినా బుద్ధి రాలేదా అంటాడు. సంధ్య విహారితో ఇంకో షాకింగ్ న్యూస్ ఉంది. నేనే నమ్మలేదు మీరు నమ్మరేమో.. ఆ సుభాష్ మీద అనుమానంతో వాడి ఫోన్ కాల్ లిస్ట్ తెప్పించి రికార్డ్స్ అన్నీ విన్నాను. ఇదంతా చేసింది లక్ష్మీ వెనక ఉంది మీ చిన్న మేనత్త అంబిక. వాడి వెనక ఉండి మొత్తం చేయించింది మీ చిన్నత్త అంబికనే అని అంటుంది.
విహారి మరోసారి షాక్ అయి ఎవరితో ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్లి రివాల్వర్ తీసుకొస్తాడు. సహస్ర, యమున విహారిని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఏమైంది ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతారు. మన వెనక ఉండి కుట్ర చేసిన వాళ్లు ఎవరో తెలిసింది అని ఇదంతా చేసింది మన ఇంట్లో ఉంటూ మన మనిషిలా నటిస్తూ మన వెనక గోతులు తీసింది అంబిక అత్తయ్య అని చెప్తాడు. అందరూ బిత్తరపోతారు.
లక్ష్మీ ఆపడానికి అంబిక అలా చేయదు అని అంటుంది. విహారి మనసులో నిన్ను చంపాలి అని చూసినా ఆపాలి అనుకుంటున్నావా అని అనుకుంటాడు. అందరూ విహారి మనం మాట్లాడుదాం అంబికని ఇంటికి రానివ్వు అని అంటే నేను అత్తయ్యతోనే తేల్చుకుంటా అని విహారి గన్‌తో వెళ్తాడు. వెనకాలే లక్ష్మీ వెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తుంది. విహారి ఆవేశంగా వెళ్తాడు. అంబికకు సహస్ర కాల్ చేసి పిన్ని నువ్వు బావకి ఇంత అన్యాయం చేస్తావని అస్సలు అనుకోలేదు అని అంటుంది. నేనేం చేశా అని అంబిక అంటే నువ్వు ఎంత కవర్ చేసినా లాభం లేదు పిన్ని ఇక్కడ అందరికీ నీ నిజస్వరూపం బావకి తెలిసిపోయింది. పిన్ని నువ్వు మన రిలేషన్ మర్చిపోయినా నేను నువ్వు పిన్ని కదా అని నీకు హెచ్చరిస్తున్న బావకి నీ గురించి మొత్తం తెలిసిపోయింది. గన్ తీసుకొని ఆవేశంగా వస్తున్నాడు. నువ్వు మాత్రం బావకి కనిపించకు అని అంటాడు.
అంబిక రోడ్డు మీద ఆగుంటే విహారి వెళ్లి గన్ గురి పెట్టి లక్ష్మీ ప్రాణాలే తీయాలని అనుకుంటావా అని అంటాడు. విహారి అంబికకు గన్ గురి పెట్టడం.. లక్ష్మీ ఆపడం జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో విహారి అంబికను కాల్చేస్తాడు. అంబిక రక్తం మడుగులో పడిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.