Nuvvunte Naa Jathaga Serial Today Episode నేత్ర అర్ధరాత్రి తన ఇంట్లో ఎవరో ఉన్నారని భయంగా ఉందని దేవాని ఇంటికి పిలిపిస్తుంది. దేవా రాగానే ఇళ్లంతా తిప్పి హగ్ చేసుకొని నువ్వుంటే నాకు ఇష్టం దేవా.. నిన్ను ప్రేమిస్తున్నాను.. నీతో జీవితాంతం కలిసి ఉండాలి అనుకుంటున్నా.. అని అంటుంది. 


దేవా కోపంగా నీకు ఏమైనా పిచ్చా నాకు పెళ్లి అయింది అని తెలీదా అని అడుగుతాడు. దానికి నేత్ర దేవా చేయి పట్టుకొని నీకు పెళ్లి అయిందని తెలుసు. నీకు మిథునకు పడదు అని తెలుసు.. మీ ఇద్దరూ దూరంగా ఉన్నారని తెలుసు. అందుకే నేను నీకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నా.. నువ్వు నాకు కావాలి దేవా అని అంటుంది. దేవా నేత్రిని తిట్టడంతో నేత్ర దేవాని తన దగ్గరే ఉంచుకోవాలని చాలా ప్రయత్నిస్తుంది. మూడో కంటికి తెలీకుండా మనం సహజీవనం చేద్దాం అంటుంది. దేవా నేత్రని ఒక్కటి పీకి.. నీది ఒక క్యారెక్టరేనా.. నాకు మిథునకు మధ్య వంద ఉండొచ్చు కానీ ఈ జన్మకి మిథుననే నా భార్య.. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఈ ఊరిలోనే ఉండవు అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో నేత్ర దేవాని నెట్టేస్తుంది. దేవా తలకు గోడ తగిలి పడిపోతాడు. 


నేత్ర తర్వాత నన్నేం చేయొద్దు దేవా అని జుట్టు పీక్కొన్ని జాకెట్ చింపేసి.. డోర్ వేసేస్తుంది. ఏం చేస్తున్నావ్ నువ్వు అని దేవా అరుస్తాడు. నేత్ర బయటకు వెళ్లి నన్ను కాపాడండి అని అరుస్తుంది. మిథునతో పాటు దేవా ఫ్యామిలీ మొత్తం బయటకు వస్తారు. మిథున నేత్రని పట్టుకొని ఏమైందని అడుగుతుంది. దేవా తనని పాడు చేయడానికి ప్రయత్నించాడని నేత్ర చెప్పడంతో అందరూ షాక్ అయిపోతారు. దేవా అలా చేయడు అని శారద అంటుంది. దేవా మా ఇంట్లోనే ఉన్నాడు. తాగి వచ్చి అఘాయిత్యం చేయబోయాడని పారిపోయి బయటకు వచ్చానని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు.


అదిత్య ఎస్‌ఐకి కాల్ చేసి ఎంట్రీ ఇవ్వమని అంటాడు. ఎస్‌ఐ వచ్చి డోర్ తీయగానే దేవా బయటకు వస్తాడు. దేవా తనేం తప్పు చేయలేదు అంటాడు. మిథున దేవా  చెప్పింది వినమని అంటే ఎస్‌ఐ వినకుండా దేవాని ఈడ్చుకొని పోలీస్‌ స్టేషన్‌కి వెళ్తాడు. దేవా రౌడీ అయినా మంచోడు అనుకున్నాం ఇప్పుడు రేపిస్ట్ అయ్యాడా అని అందరూ నానా మాటలు అనడంతో సత్యమూర్తి తల కొట్టిసినట్లు అయిపోతాడు. నేత్ర ఆదిత్యను కలిసి నువ్వు చెప్పినట్లే చేశా నా డబ్బు నాకు ఇచ్చేయ్ అని అడుగుతుంది. నేత్రకు ఆదిత్య ముఖం చూపించడు.. ఎప్పుడూ ఇలా చీకట్లోనే ఉంటావా అని ఆదిత్య ఎవరో తెలుసుకోవాలని నేత్ర అనుకుంటుంది. నీకు ముఖం చూపించే ధైర్యం లేదని నేత్ర రెచ్చగొట్టడంతో ఆదిత్య తన ముఖం చూపిస్తాడు. 


శారద భర్తతో పోలీస్‌ స్టేషన్‌కి వెళ్దాం దేవాని విడదల చేయమని చెప్దాం అని అంటే ఆనంద్ ఇదేం చిన్న గొడవ కాదమ్మా మనం అడగ్గానే వదిలేయడానికి అని అంటాడు. దేవాని పోలీసులు  వదలడం కష్టం అని అందరూ అంటారు. దేవా అమ్మాయి మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని సూర్యకాంతం తిట్టడంతో శ్రీరంగం తన ముద్దుల భార్యని పచ్చడి చేస్తాడు. సత్యమూర్తి ఆపి భార్య మీద చేయి వేయకు అంటాడు. శ్రీరంగం భార్యతో దేవా రౌడీ కావొచ్చు వాళ్లతో వీళ్లతో గొడవ పడొచ్చు కానీ దేవా ఇంత వరకు ఏ అమ్మాయితో అసహ్యంగా ప్రవర్తించలేదు అని అంటాడు. దానికి ఆనంద్‌ నువ్వు అన్నది నిజమేరా కానీ దేవా ఫుల్లుగా తాగేసున్నాడు ఈ టైంలో ఏమైనా విచక్షణ కోల్పోయి అంటే ప్రమోదిని దేవా అలా ఎప్పటికీ తప్పు చేయడు.. అతని చూపులో కూడా తప్పు ఉండదు. తాగేసి ఉన్నాడు అన్న ఒక్క కారణంతో దేవా తప్పు చేశాడని అనడం తప్పు   అని అంటుంది. సత్యమూర్తి కూడా దేవా అలా ఎప్పటికీ చేయడు.. కానీ వాడు అలా చేశాడని అమ్మాయి చెప్పగానే అందరూ నమ్మారు అంటే వాడి చుట్టూ ఉన్న చెడు ప్రపంచమే అందుకు కారణం అంటాడు.


మిథున  మామయ్యతో దేవా మంచి వాడు కాదు వదిలి వెళ్లిపో అని మీరు నాకు చాలా సార్లు చెప్పారు కానీ నేను ఎందుకు వెళ్లలేదో తెలుసా దేవాలో గొప్ప వ్యక్తిత్వం ఉంది.. అందుకే మరోసారి చెప్తున్నా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే దేవా చేయి వదిలి పెట్టను.. ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు నా భర్తని విడిపించుకోవడానికి నాకు ధైర్యం మరింత వచ్చింది.. నా భర్త మీద కుట్ర చేసిన వాళ్ల మీద యుద్ధం చేసి అయినా నేను నా భర్తని కాపాడుకుంటా అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.