Meghasandesam Serial Today Episode:

  ఎవడో వచ్చి ఇందు పెళ్లి చెడగొట్టి పోయాడని చెర్రి చెప్పగానే తనకు ఎవరో కాల్ చేసి ఎవరో చెప్పారని అది ఎవరిదో తెలుసుకుంటే ఆ పెళ్లి చెడగొట్టిన వాణ్ని పట్టుకోవచ్చని గగన్‌ చెర్రికి చెప్పి తనకు తెలిసిన పోలీసుకు ఫోన్‌ చేసి రమ్మంటాడు. గగన్‌ దగ్గరకు వచ్చిన పోలీసు వివరాలు తీసుకుని నేను కనుక్కుని వెంటనే నీకు చెప్తానని వెళ్లిపోతాడు. మరోవైపు భూమి ఏడుస్తూ ఇంటికి వస్తుంది.


పూరి: అమ్మా భూమి..


శారద: ఏమ్మా భూమి ఒకప్పుడు ఆ ఇంటికి వెళ్లాలి అంటేనే భయపడేదానివి ఇప్పుడు మన ఇంట్లో ఉండటం కంటే ఆ ఇంట్లోనే ఎక్కువగా ఉంటున్నావు. భూమి ఏమైంది.. ఆ కన్నీళ్లు ఏంటి.. ఏమైంది భూమి.


భూమి: ఇందు పెళ్లి ఆగిపోయింది ఆంటీ.


శారద: శుభమా అని పెళ్లి జరుగుతుంది అనుకుంటే ఆగిపోవడం ఏంటమ్మా..?


భూమి: ఆగిపోయింది ఆంటీ.. ఎవడో వచ్చి..


అంటూ భూమి జరిగింది మొత్తం చెప్తుంది.


శారద: ఎవడమ్మా వాడు.. గడప దాటి బయటకు కూడా రాని పిల్ల మీద అన్ని అబాండాలు వేశాడా..? వాడి మాటలు నమ్మి పెళ్లి వాళ్లు ఎలా వెళ్లిపోతారు.


భూమి: పెళ్లి ఆగిపోయిందని వాళ్లు బాధపడ్డం కన్నా ఆ పెళ్లిని గగన్ గారే చెడగొట్టారని అతన్ని గగన్‌ గారే పంపించారని అందరూ ఆయన్ని తిడుతున్నారు ఆంటీ. మీరా ఆంటీ అయితే శాపనార్థాలు పెట్టాడు.


శారద: పెళ్లి ఆగిపోవడానికి గగన్‌ కు సంబంధం ఏంటి అమ్మా వాడు ఆఫీసుకు వెళ్లాడు కదా..?


భూమి: లేదు ఆంటీ గగన్‌ అక్కడికి వచ్చాడు. ఆయనతో పాటు వాడు వచ్చాడని వీడియోలో క్లియర్‌ గా కనిపిస్తుంది. ఆయనతో వచ్చాడు కాబట్టి ఆయనే ఈ పెళ్లి ఆపడానికి అతన్ని పంపించాడని అందరూ అనుకుంటున్నారు.


శారద: అయ్యో ఓరి భగవంతుడా..? అసలు పెళ్లి జరగడమే ఆ పెళ్లికి ఎందుకు వచ్చాడు. నా బిడ్డ మీద ఈ నిందలు ఏంటి..?


 అంటూ ఏడుస్తూ శారద కుప్పకూలిపోతుంది. భూమి వచ్చి శారదను ఓదారుస్తుంది. ఇంతలో ఇద్దరూ కలిసి ఏడుస్తుంటారు. మరోవైపు హాస్పిటల్‌ లో ఇందుకు డాక్టర్లు ట్రీట్ మెంట్‌ చేస్తుంటారు. బయట అందరూ కూర్చుని ఏడుస్తుంటారు.  


అపూర్వ: పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన మన ఇందును హాస్పిటల్ పాలు చేసింది ఆ గగన్‌ గాడే. పచ్చని పందిట్లోకి వాణ్ని ఎవడినో పంపించి ఇందు ఇలా చచ్చి బతికేలా చేసింది వాడే.


మీరా: ఆ గగన్‌ కు నేను ఏం ద్రోహం చేశానండి. నా బిడ్డేం చేసింది.


అపూర్వ: వాడు మన ఇంటికి వచ్చి నన్ను చంపాలని చూశాడు. పెళ్లి పందిట్లోకి వచ్చి మన పరువు తీయాలని చూశాడు. మన ఇంటి ఆడపిల్ల ప్రాణం తీయాలని చూశాడు. వాడు ఎన్ని చేసినా చేతకాని వారిలా ఉండాల్సిందేనా..?


శరత్: అంత చేతకాని వాళ్లు ఎవరూ లేరు అపూర్వ.


అపూర్వ: మనం ఏం చేయగలం బావ ఏడవడం తప్పా..


శరత్‌: తప్పు చేశాను. వాడు మన ఇంటికి వచ్చి నిన్ను చంపాలని చూసినప్పుడే వాణ్ని చంపేయాల్సింది. చంపేస్తాను.


  అని శరత్‌ చంద్ర వెళ్లబోతుంతో ప్రసాద్‌ ఆపాలని చూస్తాడు. వినకుండా వెళ్లిపోతాడు శరత్‌చంద్ర. ఆయన వెనకాలే ప్రసాద్‌ వెళ్లిపోతాడు. ఇంటికి డల్లుగా వచ్చిన గగన్‌ చూసి శారద ఏడుస్తూ.. ఇందు పెళ్లి ఆగిపోయిందట. దానికి నువ్వు కారణం అంటున్నారట అసలు ఏం జరిగింది వాడు నీకెలా పరిచయం నీతో వాడు ఎందుకు వచ్చాడు అని అడుగుతుంది. దీంతో గగన్‌ నాకేం తెలియదని జరిగిన విషయం చెప్తాడు గగన్‌. ఇంతలో అపూర్వ ఫోన్‌ చేసి భూమితో మాట్లాడాలి రమ్మని పిలుస్తుంది.  ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!