Meghasandesam Serial Today Episode: చెర్రి హాస్పిటల్‌ కు ఫోన్‌ చేసి భూమిని నీకు రూం ఎలా ఉండాలని అడుగుతాడు. దీంతో భూమి తను శారద వాళ్ల ఇంటికి వెళ్తానంటుంది. చెర్రి డిస్సపాయింట్‌ అవుతాడు. ఏమైందని బిందు అడగ్గానే భూమి ఇక్కడకు రాదంట.. అని చెప్తాడు చెర్రి ఇక్కడకు రాకుండా ఎక్కడికి వెళ్తుందట అని బిందు అడగ్గానే పెద్దమ్మ వాళ్ల ఇంటకి వెళ్తుందట అని చెప్తాడు చెర్రి. మరోవైపు ఆఫీసులో అపూర్వతో ఆటాడుకుంటుంది భూమి. ఇది కావాలి అది కావాలి అంటూ ఇరిటేట్‌ చేస్తుంది. దీంతో అపూర్వ కోపంగా చూస్తుంటే అలా చూడకు మమ్మీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ అని చెప్తుంది. దీంతో అపూర్వ నవ్వుతున్నట్లు నటిస్తుంది. పూరి, కీర్తికి ఫోన్‌ చేసి భూమికి ఫోన్‌ ఇవ్వమని చెప్తుంది. కీర్తి ఫోన్‌ భూమికి ఇస్తుంది.


పూరి: ఎలా ఉన్నావు భూమి


భూమి: పర్వాలేదు. బాగానే ఉన్నాను.


పూరి: నువ్వు డిశ్చార్జ్‌ అయ్యాక నిన్ను ఇక్కడకు తీసుకురావాలనుకున్నాం.


భూమి: ఎవరి ఐడియా ఇది..


పూరి: నేను అన్నయ్యా అనుకున్నాం.


భూమి: ఓ అలాగా..?


పూరి: నీకోసం ఒక రూం రెడీ చేస్తున్నాము ఎలా ఉండాలో చెప్పు..


భూమి: నాకు నేచర్‌ అంటే ఇష్టం. చుట్టు అడవి.. కొండలు.. అక్కడ కట్టుకున్న చిన్న చిన్న ఇళ్లు..


పూరి: అర్థమైంది.. గోడలకు గ్రీన్‌ పెయింట్‌ వేయించాలి అంతేగా..?


భూమి: పచ్చగా ఉన్న ప్రతి గోడ అడవి అయిపోదు కదా పూరి


పూరి: అర్థం కాలేదు ఎలా చేయాలి.


భూమి: ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. కానీ చూడగానే అడవిలా ఉండాలి.


అని భూమి చెప్పగానే సరేనని ఇద్దరూ మాట్లాడుకుంటారు. కింద పూరికి భూమి ఎలా చెప్తుందో పైన గగన్‌ రూం అలాగే రెడీ చేస్తుంటాడు. పూరి మాత్రం ఇదంతా కష్టమేమో అంటుంది. ఫోన్‌ కట్‌ చేసి పైకి వచ్చిన పూరి గగన్‌ డిజైన్‌ చేసిన రూం చూసి ఆశ్చర్యపోతుంది.



గగన్‌: పూరి ఏంటలా చూస్తున్నావు. బాగుందా..?


పూరి: బాగుందా..? అంటావేంటి అన్నయ్యా భూమి ఎలా కావాలి అందో అలాగే యాజ్‌ టీజ్‌ గా ఉంది అన్నయ్య


అని పూరి చెప్పగానే గగన్‌ హ్యాపీగా ఫీలవుతాడు. మరోవైపు రమేష్‌, సౌందర్య కాఫీ తాగుతూ వంశీ ఇందుల శోబనం జరగకూడదు అనుకున్నాం కదా.. జరిగిపోయిందా.? ఏంటి వెళ్లి చూద్దాం పద అని వంశీ రూం దగ్గరకు వెళ్లి వాళ్లను పిలుస్తారు. వంశీ కంగారుగా లేచి మన మధ్య జరిగింది ఏదీ వాళ్లకు చెప్పొద్దు అంటూ ఇందు నోరు మూస్తాడు. ఇందు వెళ్లి డోర్‌ తెరుస్తుంది. వంశీ ఏమీ తెలియనట్టు పడుకుంటాడు. ఏం జరగలేదని కన్‌ఫం చేసుకుని రమేష్‌, సౌందర్య అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు  గగన్‌కు భూమి గుర్తుకు వస్తుంది. నిద్ర పట్టదు. మనసులో మాట చెబితే కానీ నిద్ర పట్టదు అనుకుని రెడీ అవుతాడు.


Also Read: దీపకి మల్లెపూలు ఇచ్చిన కార్తీక్.. దీపని చంపడానికి జ్యోత్స్న ప్లాన్!


పూరి: అమ్మా ఈ నెక్లెస్‌ చాలా బాగుంది. నాకోసం ఇంత స్పెషల్‌ గా చేయించినందుకు థాంక్స్‌ అమ్మా..


శారద: నీ ముఖం ఇది నీ కోసం కాదు.


పూరి: మరి నీ కోసమా..?


శారద: కాదు..


పూరి: నీకు కాకా నాకు కాకా.. ఇంకెవరికి..?


శారద: నాకు కాబోయే కోడలు కోసం.. అవును మీ వదిన కోసం


పూరి: వదినా.. వదిన ఎవరో తెలియకుండా అప్పుడే నెక్లెస్‌ చేయించావా..?


శారద: నాకు కాబోయే కోడలి కోసం నేను ఇవ్వబోయే మొదటి గిఫ్ట్‌


అంటూ శారద చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి అదే నెక్లెస్‌ తీసుకుని భూమికి గిఫ్ట్‌ ఇవ్వడానికి వెళ్తుంటే శారద వచ్చి పిలుస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. చాలా ఇంపార్టెంట్‌ పని మీద వెళ్తున్నాను అని చెప్తాడు గగన్‌. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


Also Read: సత్య ఉచ్చులో మహదేవయ్య పడతాడా.. డీఎన్‌ఏ టెస్ట్‌కి ఒప్పుకుంటాడా!