Meghasandesam Serial Today Episode: ఇంటి ముందు సుజాత ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. లోపలి నుంచి ఒక గిన్నె తీసుకుని బయటకు వస్తుంది అపూర్వ. పిన్ని అంటూ సుజాతను పిలవగానే సుజాత భయతో లేచి దూరంగా వెళ్తుంది.
అపూర్వ: పిన్ని భయ పడకు ఇది నెయ్యి గిన్నె.. కమిలిన నీ బుగ్గలకు రాద్దామని తీసుకొచ్చాను.
సుజాత: నేను నమ్మను ఇన్‌ఫర్మేషన్ లేకుండా నువ్వు ఇరగదీస్తున్నావు. ఇప్పుడు నెయ్యి గిన్నే అని చెప్పి ఏ నుయ్యిలోనో పడేసి కాళ్లతో నన్ను కసాబిసా తొక్కేశావనుకో.. నేను నమ్మను అమ్మాయి..
అపూర్వ: నిజంగానే ఇది నెయ్యి గిన్నే పిన్ని..
సుజాత: నేను నిన్ను నమ్మను ..
అపూర్వ: ఇది నిజంగానే నెయ్యి గిన్నే కావాలంటే చూడు
అంటూ అపూర్వ గిన్నె చూపించగానే దూరం నుంచే చూసిన సుజాత నిజంగానే నెయ్యి గిన్నే అమ్మాయి అంటుంది. అవును పిన్ని నువ్వు ఇలా రా అంటూ దగ్గరకు పిలుస్తుంది. సుజాత దగ్గరకు వెళ్లగానే నెయ్యి బుగ్గలకు రాస్తుంది అపూర్వ.
అపూర్వ: సారీ పిన్ని చాలా గట్టిగా కొట్టేసినట్టు ఉన్నాను. నొప్పిగా ఉందా..?
సుజాత: కొడితే నొప్పి రాదా అమ్మాయి.. బలమైన ప్రశ్నే అడిగావు సమాధానం కూడా బలంగానే ఇస్తాను అన్నప్పుడైనా నువ్వు కొడతావని నేను ఊహించాల్సింది. కొంతలో కొంత అయినా తప్పించుకునే దాన్ని..
అపూర్వ: సారీ చెప్తున్నాను కదా అలా ఏడవకు..
సుజాత: ఏడుపు నొప్పి నుంచి రావడం లేదు అమ్మాయి. చెప్పకుండా కొట్టినందుకు వస్తుంది.
అపూర్వ: ఈసారి ఏదీ చెప్పకుండా కొట్టనులే..? ఏడవకు..
సుజాత: అయితే ఈ ఏడుపులో చిన్న ఆనందం కూడా ఉంది అమ్మాయి..
అపూర్వ: ఏంటి అది..?
సుజాత: నువ్వు నాతో ఉండి ఉండి.. నువ్వు నాలా తెలివి తక్కువ దానివి అయిపోతున్నావు..
అపూర్వ: అదేంటి పిన్న అలా అనేశావు..?
సుజాత: ఇలా కాక మరి ఎలా అనాలి. ప్రేమ పెళ్లి అంటూ భూమి ఆ గగన్ గాడి ఇంటికి వెల్లి దాని బతుకు అది బతుకుతుంది. ఇక్కడ మనం పంట చేలు కొట్టుకు తింటున్న పందికొక్కుల్లా హాయిగా తింటూ బతుకుతున్నాము. ఇలాంటి టైంలో ఆ భూమిని దాని బాబును కలపాలనుకోవడం తెలివి తక్కువ తనం కాకపోతే ఇంకేం అంటారు అమ్మాయి..
అపూర్వ: నీ చిన్న మెదడుకి ఇంతే అర్తం అయిందా పిన్ని..
సుజాత: గున్న ఏనుగు లాంటి మెదడుకైనా ఇంతే అర్తం అవుతుంది అమ్మాయి. ఇంతకు మించి ఏముంటుంది..?
అపూర్వ: ఉంది పిన్ని ఇప్పుడు నేను వేసిన స్కెచ్ భూమికి బావకి అంటే అదే దాని బాబుకు దూరం పెరుగుతుంది పిన్ని.
సుజాత: ఆ అదెలా..?
అపూర్వ: కేపీ బతికే ఉన్నాడని భూమికి తెలుసు.. బతికున్న కేపీకి భూమి పిండం పెట్టమని గగన్‌ను అడగలేదు. నేను అడిగినా పిండం పెట్టించలేదని భూమి మీద బావకు కోపం వస్తుంది. ధ్వేషం పెరుగుతుంది. దాంతో దూరం పెరుగుతుంది.
సుజాత: అమ్మో ఇదా నీ స్కెచ్..
అపూర్వ: ఇదే అయితే నేను అపూర్వను ఎందుకు అవుతాను పిన్ని.. భూమికి ఆ గగన్ గాడు ఎంత ఇంపార్టెంటో దానికి దాని నాన్న కూడా అంతే ఇంపార్టెంట్
అంటూ అపూర్వ తన ప్లాన్ మొత్తం చెప్తుంది. దీంతో సుజాత అమ్మో నీ స్కెచ్ మామూలుగా లేదు అమ్మాయి అంటుంది. తర్వాత శరత్ చంద్ర, గగన్ ఇంటికి వెల్తాడు. కేపీకి పిండం పెట్టమని అడుగుతాడు. దీంతో గగన్ కోపంగా శరత్ చంద్రను తిడతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!