Ammayi garu Serial Today Episode కోమలికి కావాలనే రాజు, విరూపాక్షి, రూప అందరూ కలిసి చింతపండు, మామిడి కాయలు బలవంతంగా తినిపిస్తారు. ప్రెగ్నెంట్ నాటకం ఆడుతున్నందుకు తప్పక కోమలి తింటుంది. రూప కోమలితో ఎవరు అయినా గోతులు తీస్తే అందులో పడకుండా జాగ్రత్త పడాలి కానీ వాళ్లే పడేలా ఉండకూడదు అని అంటుంది.
కోమలి పులుపు తినలేక ఏడుస్తుంది. అది చూసి రూప ఏంటి అక్కా ఇబ్బంది పెడుతున్నామా అని అంటే ఆనందభాష్పాలు అని చంద్ర అంటాడు. ఇక చాల్లే అమ్మా అని సూర్యప్రతాప్ అంటాడు. రూప కోమలితో ప్రస్తుతానికి వదిలేస్తున్నా రేపు ఇదే రిపీట్ అవుతుంది జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. సుమ కోమలికి గదిలోకి తీసుకెళ్తుంది. కోమలి పులుపు పిచ్చెక్కిపోతుంది. గదిలో వాంతులు చేసుకుంటుంది. అయితే కోమలి దగ్గరకు రూప అందర్ని తీసుకొస్తుంది. సూర్యప్రతాప్ వాళ్లని చూసి కోమలి షాక్ అయిపోతుంది. సూర్యప్రతాప్ కోమలి దగ్గరకు వచ్చే ఏమైంది అమ్మా కింద పులుపే లేదు అని చెప్పావ్,, ఇప్పుడేంటి ఇంత పులుపు ఎప్పుడూ తినలేదు అన్నావ్.. పైగా వాంతి కూడా చేసుకున్నావ్ ఏం జరుగుతుంది అని అడుగుతాడు.
రూప సూర్యప్రతాప్‌తో నాయనా అక్కని ఏమైనా అంటే కోప్పడతావు.. అందరూ ప్రేమగా పులుపు తినిపిస్తే వాంతి చేసుకొని అందరి ప్రేమని బయటకు పంపేసింది.. ఇది చూసి ఎవరికైనా ఒకటే అనుమానం వస్తుంది అక్క ప్రెగ్నెంట్ కాదేమో అని.. నువ్వు కోప్పడినా నా అనుమానం మాత్రం ఇదే నాయనా అని రుక్మిణి అంటుంది. డాక్టర్ నీ చేయి పట్టుకొని మాత్రమే చెప్పింది కదా అక్కా.. డాక్టర్ నిన్ను మెట్లు ఎక్కొద్దు దిగొద్దూ అన్నా నువ్వు అదే చేస్తున్నావ్.. అసలు ఏం జరుగుతుంది అక్క.. మాకు చెప్పకపోయినా పర్లేదు నిన్ను గట్టిగా నమ్ముతున్న నాయనకైనా చెప్పు అని రూప అంటుంది.
విజయాంబిక కోమలిని కాపాడటానికి వచ్చి డాక్టర్ చెప్పిన తర్వాత కూడా నీకు డౌటా.. అయినా నీకు రూప ప్రెగ్నెంట్ అవ్వడం ఇష్టం లేదు అనుకుంటా.. అందరూ కలిసి అతిగా పులుపు తినిపించేశారు కదా.. అయినా ప్రెగ్నెంట్ టైంలో ఈ వాంతులు సహజమే అని అంటుంది. రూప ప్రశాంతంగా ఉండాలి తమ్ముడు తనని ఎవరూ ఇబ్బంది పెట్టొద్దు అని అంటుంది. కోమలి సూర్యప్రతాప్‌తో ఏం తింటున్నా నాకు వాంతులు అవుతున్నాయి.. దయచేసి తిండి విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటుంది. సూర్యప్రతాప్ ఇక నుంచి నిన్ను ఎవరూ ఇబ్బంది పెట్టరు నీకు ఏం తినాలి అనిపిస్తే అదే తిను అని అంటాడు.
కోమలి విజయాంబిక వాళ్లతో అందరి కళ్లు నా మీదే ఉంటున్నాయి.. ఎవరు ఎలా దొరకబెట్టేస్తారో అని భయంగా ఉంది అని అంటుంది. మామయ్య అందరికీ లాక్ వేసేశారు కదా ఇక ఏ ప్రాబ్లమ్ ఉండదు అని దీపక్ అంటాడు. నీకేం కాకుండా నేను చూసుకుంటా అని విజయాంబిక అంటుంది. రాజుకి డాక్టర్ కాల్ చేసి రాఘవ కోసం ఫారెన్ నుంచి ఇంజెక్షన్ వస్తుందని అది వేయగానే రాఘవ కోమా నుంచి బయటకు వస్తాడని అంటాడు. రాజు చాలా హ్యాపీగా ఫీలై రూప, విరూపాక్షిలకు ఇంజక్షన్ గురించి చెప్తాడు. తల్లీకూతుళ్లు చాలా సంతోషపడతారు. ఇంతలో బంటీ వచ్చి తనని బయటకు తీసుకెళ్లమని అడుగుతాడు.
రాజు బంటీతో ఈ ఒక్క రోజు ఉండు నాన్న రేపు తీసుకెళ్తా అని అంటే బంటీ అలిగిపోతాడు. దాంతో విరూపాక్షి ఇంజక్షన్ రావడానికి టైం పడుతుంది కదా ఈలోపు మీరు బంటీని తీసుకెళ్లండి అని అంటుంది. సూర్యప్రతాప్ విని హాస్పిటల్, ఇంజక్షన్ అంటున్నారు ఏమైంది అని అనుకుంటాడు. రాజు వాళ్ల దగ్గరకు వచ్చి విషయం అడుగుతాడు. దాంతో రాజు రాఘవ కోసం తెప్పించబోయే ఇంజక్షన్ గురించి చెప్తారు. రాజు సూర్యప్రతాప్‌ని హాస్పిటల్కి రమ్మని పిలుస్తాడు. మీటింగ్ ఉందని సూర్యప్రతాప్ చెప్తాడు. ఇక బంటీ రెడీ అయి వచ్చి బయటకు తీసుకెళ్లమని అనడంతో రాజు, రూపలు తీసుకెళ్తారు. రాజు, రూపలు మాట్లాడుకున్న విషయం మొత్తం దీపక్ వినేస్తాడు. పరుగున విజయాంబిక దగ్గరకు వెళ్లి ఇంజక్షన్ గురించి చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.