Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అమ్మిరాజుని విహారి చెట్టుకి కట్టేసి వీర్రాజుకి కాల్ చేసి కావేరిని తీసుకురమ్మని చెప్తాడు. చేతి వరకు వచ్చిన ఆస్తి పోయిందని వీర్రాజు అనుకుంటాడు. అంబిక ఆస్తి పోకుండా ఉండాలి అంటే ఓ మంచి ప్లాన్ ఉంది అని చెప్పి వీర్రాజుకి చెప్తుంది. నేను నా మనుషుల్ని తెస్తా.. నువ్వు నీ మనుషుల్ని తీసుకురా అని అంటుంది.
వీర్రాజు కావేరి దగ్గరకు వెళ్లి మీ అమ్మ దొరికిందమ్మా.. నేను మీ అమ్మ దగ్గరకు తీసుకెళ్తా నువ్వు మీ అమ్మని చూసి అటో ఇటో పారిపోవాలి అని అంటాడు. ఎందుకు అని కావేరి అడిగితే మీ అమ్మ ప్రాణాలతో బతకాలి అంటే నేను చెప్పింది నువ్వు చేయాలి అంటాడు. కావేరి సరే అంటుంది. విహారి చెప్పిన లొకేషన్‌కి వీర్రాజు కావేరిని తీసుకొని వెళ్తాడు. కాస్త దూరంలో సుభాష్ దాక్కుంటాడు. అంబిక కూడా అక్కడికి వెళ్తుంది. నువ్వు ఎందుకు వచ్చావ్ అత్త అని విహారి అడిగితే మీరు ఇక్కడికి వచ్చారు అని ఊరి వాళ్లు చెప్తే వచ్చానని అంబిక అంటుంది.
రుక్మిణి కావేరిని చూసి ఎమోషనల్ అయిపోతుంది. సుభాష్ కావేరికి గన్ గురి పెడతాడు. వీర్రాజు కావేరిని విడిచి పెట్టి తను చెప్పినట్లు చేయమని అంటాడు. కావేరి వెళ్తూ వీర్రాజు చెప్పినట్లు కావేరి పారిపోతుంది. విహారి, రుక్మిణి కావేరి వెనక పరుగెడితే రౌడీలు విహారి చుట్టు ముడతారు. విహారి రౌడీలను చితక్కొడతాడు. అమ్మిరాజు కత్తి తీసుకొని విహారిని పొడవడానికి వెళ్తాడు. అది చూసిన రుక్మిణి అడ్డంగా వెళ్తుంది. దాంతో అమ్మిరాజు రుక్మిణిని పొడిచేస్తాడు. రుక్మిణికి పెద్ద గాయం కావడంతో అమ్మిరాజుని తీసుకొని వీర్రాజు వెళ్లిపోతాడు. కావేరి చాలా ఏడుస్తుంది. రుక్మిణి ఏడుస్తూ విహారితో నేను బతకను అని నాకు అర్థమైపోయింది బాబు అంటుంది. ఇన్ని రోజులు నీకు దూరం అయ్యాను ఇప్పుడు నీ దగ్గరకు వస్తే నీకు దూరం అయిపోతున్నా అని ఏడుస్తుంది.
రుక్మిణి ఏడుస్తూ కావేరి చేతిని విహారి చేతిలో పెట్టి ఇక నుంచి కావేరి మీ బాధ్యత అని అంటుంది. ఇక నుంచి కావేరి నా చెల్లి కావేరి బాధ్యత నాది అని విహారి అంటాడు. రుక్మిణి చావు బతుకుల మధ్య ఉంటూ విహారితో మీ నాన్న ఆరోజు యాక్సిడెంట్‌లో చనిపోలేదు.. మీ నాన్నని ఎవరో చంపి యాక్సిడెంట్‌గా చిత్రీకరించారు.. మీ నాన్నని చంపింది ఒక ఆడ మనిషి.. ఆవిడ చేతి మీద ఒక లవ్ సింబల్ ఉంటుంది అని ట్యాటూ గురించి చెప్తుంది. అది విన్న అంబిక షాక్ అయిపోతుంది. వెంటనే తన చేతి ముద్ర మీద రక్తం రాసుకుంటుంది.
రుక్మిణి తాను చనిపోతే తన కళ్లు లక్ష్మీకి ఇవ్వమని చెప్తుంది. లక్ష్మీ తనకళ్లతో చూస్తే నా కూతుర్ని నేను చూసుకున్నట్లే అని అంటుంది. ఇక రుక్మిణి చివరి నిమిషంలో అంబక చేతిమీద ఉన్న గుర్తు చూసి చెప్పబోయి చనిపోతుంది. రుక్మిణి కళ్లు లక్ష్మీకి పెట్టి లక్ష్మీ, కావేరిని తీసుకొని విహారి ఇంటికి వస్తాడు. యమున లక్ష్మీకి దిష్టి తీస్తుంది. పద్మాక్షి కోపంగా పని మనిషికి ఇలాంటి మర్యాదలు బహుశా మన ఇంట్లోనే జరుగుతాయి అని అంటుంది. అప్పుడు ఆ లక్ష్మీని ఇలాగే తీసుకొచ్చారు.. అది ఇక్కడే పాతుకుపోయింది.. ఇప్పుడు ఈ పిల్ల అని అంబిక అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.