గుండె నిండా గుడి గంటలు నవంబర్ 19 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 November 19th Episode

Continues below advertisement

గిల్ట్ నగల  రచ్చ సత్యం ఇంట్లో జరుగుతూనే ఉంది. ఆ నగలన్నీ తీసుకొచ్చి..నేను అందరి ముందూ బంగారం తీసి ఇస్తే  వాటిని మార్చేసి గిల్ట్ నగలు ఇచ్చారని మీనా అంటుంది.  మీ అందరి ముందే ఆ నగలు తీసుకెళ్లి బీరువాలో పెట్టాను..అందరి ముందే తీసుకొచ్చి ఇచ్చాను అని దబాయిస్తుంది ప్రభావతి. అంత పౌరుషంగా నగలన్నీ వలిచి ఇచ్చిందంటే అవి నిజంగానే గిల్ట్ నగలు అయి ఉంటాయని...మీనా చాలాసార్లు పుట్టింటికి వెళ్లింది..వాళ్లకు బంగారు నగలు కట్టబెట్టి ఆ ప్లేస్ లో గిల్డ్ నగలు తెచ్చి ఉంటుందని నింద వేస్తుంది. అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా ప్రభావతి మొత్తం మీనాపైకి నెట్టేసి తప్పించుకుంటుంది. నా పుట్టింటివాళ్లను అంటే ఊరుకునేది లేదంటూ గట్టిగా ఇచ్చిపడేస్తుంది మీనా. తనకేం సంబంధం లేదు..అది ఏ నగలు ఇచ్చిందో వాటినే నేను ఇచ్చానని తేల్చి చెప్పేస్తుంది ప్రభావతి.

రోహిణి కూడా మీనానే అనుమానిస్తుంది... బాలుకి కారు కొనిచ్చావ్ కదా పూలమ్మిన డబ్బులతోనే కొన్నావా? బంగారం అమ్మి కొని ఉండొచ్చు కదా అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ రోహిణి... మీనా కారు కొన్నప్పుడు నువ్వు మలేషియాలో ఉన్నావా ఏంటి? ఎంత కష్టపడిందో చూడలేదా? ఎన్ని పూలమాలలు కట్టిందో చూడలేదా అని గట్టిగా ఇచ్చిపడేస్తుంది శ్రుతి. అయినా నువ్వు మాట్లాడుతున్నావా పార్లలమ్మా అని రోహిణి మోసాల చిట్టా చెబుతాడు బాలు. ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదని వెళ్లిపోతుంది ప్రభావతి. ఈ గండం నుంచి బయటపడ్డాను అనుకుంటూ మనోజ్ అక్కడి నుంచి జారుకుంటాడు. రోహిణిలోనూ అనుమానం మొదలవుతుంది. ఎలాగోలా బయటపడ్డాను అని చేతులు దులిపేసుకుంటుంది ప్రభావతి. 

Continues below advertisement

మీనా సామాన్లు అన్నీ విసిరికొడుతుంటుంది.. ఇంతలో బాలు వెళ్లి ఏం జరిగిందని అడిగితే..  మధ్యలో మా పుట్టింటివాళ్లు ఏం చేశారు అని అడుగుతుంది. అవును బామ్మను కూడా అన్నారు ఎలా వదిలిపెడతాను అంటాడు బాలు. గిల్ట్ నగల సంగతి తెలిసినప్పటి నుంచి ఊగిపోయి..ఇప్పుడు సైలెంట్ అయిపోయారేంటి అని నిలదీస్తుంది. దొంగతనం చేసినవాళ్లు బాగానే ఉన్నారు ఏ సంబంధం లేనివాళ్లు అయిన నా పుట్టింటివారు, అమ్మమ్మగారు ఏం చేశారు. ఏం చేసినా నిజం తేల్చాలి అంటుంది మీనా.  ఆ కవరింగ్ నగలు ఏదో షాప్ లో కొని ఉంటారుగా..అందుకే ఆ షాప్ నుంచి కాల్ చేశాం అని చెబుతూ శ్రుతితో కాల్ చేయిద్దాం అనుకుంటారు.  

శ్రుతి కూడా రవి రెస్టారెంట్ కి వస్తుంది. ఆ తర్వాత బాలు, మీనా కూడా వస్తారు. నలుగురు కూర్చుని డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. 

బాలు: ఇంట్లో మోసం జరిగింది , దగా జరిగింది, కుట్ర జరిగింది

రవి: ఏం జరిగింది వదినా?

మీనా: మీ అన్నయ్య కొనేవరకూ బంగారం వేసుకోని అని శపథం చేసి అందరి ముందూ నా బంగారు నగలు తీసిచ్చాను..ఇప్పుడు నాకు ఇచ్చివని గోల్డ్ కవరింగ నగలు. నేను బంగారం ఇస్తే అవన్నీ గిల్ట్ నగలుగా ఎలా మారిపోతాయ్ రవి?

రవి: అంటే అవి నువ్వు ఇచ్చినప్పటి నుంచి తిరిగి నీ చేతికి వచ్చేలోగా ఈ మధ్యలో ఏదో జరిగింది 

బాలు: నాకైతే మనోజ్ గాడి ప్రవర్తనపై డౌట్ ఉంది

శ్రుతి: ఆ రోజు వీళ్ల అన్నయ్య 4lac ఫర్నిచర్ అమ్మితే లాభం వచ్చిందన్నారు.. ఆ రోజే ఏదో జరిగింది 

బాలు: నాకు అమ్మ మీదే డౌట్..మనోజ్ గాడికోసం ఎంతదూరం అయినా వెళుతుంది.

సేమ్ డౌట్ శ్రుతికి కూడా వస్తుంది.. మనోజ్-ప్రభావతి ఇద్దరూ ఆదివారం రోజు బయటకు వెళ్లొచ్చారు..గుసగుసలాడుకున్నారు..ఆ రోజే ఏదో జరిగి ఉంటుంది అనుకుంటారు

బాలు: గిల్ట్ నగలు ఏదో ఒక షాప్ నుంచి కొని తీసుకొచ్చి ఉంటారు..అవి ఎక్కడ నుంచి కొన్నారో తెలుసుకుంటే అసలు విషయం బయటపడుతుంది

మనోజ్ పైనే అనుమానం ఉందికాబట్టి..తనకి కాల్ చేసి ట్రాప్ చేస్తే నిజం తెలుస్తుందని ఫిక్సవుతారు. వెంటనే శ్రుతి తన డబ్బింగ్ తెలివితేటలు ఉపయోగించి మనోజ్ కి కాల్ చేయాలని ఫిక్సవుతుంది

షాప్ లో కస్టమర్స్ ని పట్టించుకోకుండా..రిలాక్స్ గా నిద్రపోతాడు మనోజ్.  ఇంతలో రోహిణి వచ్చి నిద్రలేపి క్లాస్ వేస్తుంది. ఇంట్లో గొడవకి నీకెందుకు నీ పని నువ్వు చూసుకో అని చెబుతుంది.. ఇంతలో రోహిణికి కొడుకు కాల్ చేయడంతో పక్కకు వెళుతుంది... అమ్మా నువ్వు రాత్రి కలలోకి వచ్చావని అమ్మా అని పిలవొద్దు అన్నావని చెబుతాడు. అత్తా అని కూడా పిలవొద్దన్నావ్...అని చెప్పి ఏడుస్తాడు... రోహిణి కన్నీళ్లు పెట్టుకుంటుంది... ఇక్కడకు ఎప్పుడొస్తావ్ అని అడుగుతాడు.. వస్తా నాన్నా అంటుంది. ఆ తర్వాత తల్లితో మాట్లాడుతూ క్లాస్ వేస్తుంది...నా పరిస్థితి నీకు తెలుసుకదా అంటుంది. 

వారణాసి నుంచి శివుడి ప్రపంచ సంచారం, SSMB29 లో మహేష్ క్యారెక్టర్ పై క్లారిటీ! 'సంచారి' పాటలో శివతత్వం!

 'వారణాసి' ఈ పేరెలా వచ్చింది? అక్కడ ప్రత్యేకతలు , వింతలు ఏంటి? రాజమౌళి - మహేష్ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు?

 'వారణాసి' సినిమా టీజర్లో కనిపించిన 'చినమస్తా దేవి' ఎవరు? రాజమౌళి ఆమె గురించి ఏం చెప్పబోతున్నారు?