Meghasandesam Serial Today Episode : శరత్‌చంద్ర, చెర్రి పిలిచి భూమి ఎవరినో ప్రేమిస్తుందని నేను అడిగితే బాగుండదని అది ఎవరో నువ్వు తెలుసుకుని చెప్పాలని అనగానే.. చెర్రి సరే అంటాడు. ఇంతలో అక్కడికి అపూర్వ వస్తుంది. భూమి ఎవరిని ప్రేమిస్తుందో తనకు తెలుసు అంటుంది. ఎవరో చెప్పమని శరత్ చంద్ర అడగ్గానే.. చెర్రిని బయటకు వెళ్లమని చెప్తుంది అపూర్వ.
శరత్: భూమి అంటే నీకు ఇష్టం ఉండదు కదా తను ప్రేమించిన అబ్బాయి గురించి ఎలా తెలుసు..?
అపూర్వ: ఇప్పుడే తెలుసుకున్నాను బావ. అది కూడా అనుకోకుండా తెలుసుకున్నాను. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలిశాకే భూమి నిన్ను ఎంత అందంగా మోసం చేసిందో తెలుసుకున్నాను.
శరత్: మళ్లీ నువ్వు భూమి మీద విషం కక్కడం మొదలు పెట్టావా..?
అపూర్వ: అంత పెద్ద మాటలు అనకు బావ. నువ్వంటే నాకు ప్రాణం. నాకంటే ఎక్కువగా మన నక్షత్ర మీద పిసరంత ఎక్కువ ప్రేమ చూపిస్తేనే తట్టుకోలేను. నాకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఆ భూమికి ఇచ్చినప్పుడు. తట్టుకున్నాను. కానీ విషం కక్కేంత అక్కసు నాకు ఆ దేవుడు ఇవ్వలేదు బావ.
శరత్: సరే భూమి నన్ను మోసం చేస్తుంది అన్నావు కదా..? ఏం చేస్తుందో చెప్పు..
అపూర్వ: డాన్స్ క్లాస్ అని వెళ్తుంది కదా..? ఇంతకీ ఎక్కడికి వెళ్తుందో తెలుసా..? ఆ గగన్ గాడి ఆఫీసుకు
అని అపూర్వ చెప్పగానే.. శరత్ చంద్ర కోప్పడతాడు. నా మీద ఒట్టు బావ ఇదంతా నిజం. డాన్స్ క్లాస్‌కు వెళ్తున్నానని చెప్పి నిన్ను మోసం చేసి ఆ గగన్ గాడి ఆఫీసుకు వెళ్తుందంటే.. అది ఆ గగన్ గాడిని ప్రేమిస్తుందని నేను నీకు వేరే చెప్పక్కర్లేదు. అంటూ అపూర్వ తన మాటలతో శరత్ చంద్రను కన్వీన్స్ చేస్తుంది. ఇప్పుడే ఫోన్ చేసి భూమి ఎక్కడుందో అడుగు అని చెప్తుంది. శరత్ చంద్ర, భూమికి ఫోన్ చేస్తే.. హాస్పిటల్ లో ఉన్న భూమి లిఫ్ట్ చేయదు. ట్రీట్‌మెంట్ కంప్లీట్ అయ్యాక భూమి తనలో తానే మాట్లాడుకుంటుంది. తన ఎదురుగా గగన్ ఉన్నట్టు తనతో ప్రేమ విషయం చెప్తున్నట్టు మాట్లాడటంతో డాక్టర్, నర్స్ షాక్ అవుతారు. ఇంతలో గగన్ లోపలికి రాగానే గగన్‌ను హగ్ చేసుకుంటుంది భూమి.
గగన్: ఏంటిది..?
భూమి: అది మీరు నిజంగా.. ఇంతకీ మీరు ఎప్పుడొచ్చారు..?
డాక్టర్: నీ మాటలు పూర్తి అయ్యి యాక్షన్‌లోకి దిగావు చూడు అప్పుడు వచ్చాడమ్మా..
గగన్: వెళ్దామా..?
అంటూ భూమిని తీసుకుని గగన్ వెళ్తుంది. మరోవైపు ప్రసాద్‌ను కలిసిన శారద.. అపూర్వ ఇంటికి వచ్చి నక్షత్రను కోడలిగా చేసుకోమని అడిగిన విషయం చెప్తుంది. దీంతో ప్రసాద్ నేను చూస్తూ ఊరుకోను ఏదో ఒకటి చేస్తాను నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తాడు. ఇంటికి వెళ్లి శరత్ చంద్రన ప్రశ్నిస్తాడు.
ప్రసాద్: మిమ్మల్ని భూమి మోసం చేస్తుందని మీకు ఎవరు చెప్పారు..?
శరత్: నా అపూర్వ చెప్పింది.
ప్రసాద్: ఇదేనండి మీతో ప్రాబ్లం. అపూర్వ గారు చెప్తే మీరు ఎందుకు నమ్మాలో ఆలోచించారా..? ఆ మహా తల్లి శోభాచంద్ర చనిపోతూ తన కూతురును బతికించుకుంది. ఆ కూతురు పెరిగి పెద్దదై మీ చుట్టూ తిరుగుతున్నా మీరు తెలుసుకోకుండా చేసింది ఎవరో తెలుసా…? అపూర్వ గారు. తన చేతిలో మీరో కీలుబొమ్మగా మారారు. ఇప్పటికైనా మీరు కళ్లు తెరవండి.
అంటూ ప్రసాద్ చెప్పగానే.. శరత్ చంద్ర కోపంగా ప్రసాద్‌ను కొట్టి.. ఇంట్లోంచి వెళ్లిపోమ్మని ఇక నా కళ్లకు కనిపించొద్దని వార్నింగ్ ఇస్తాడు. ప్రసాద్ ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాక శరద్ చంద్ర, భూమికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!