Nindu Noorella Saavasam Serial Today March 18th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: భాగీకి సీక్రెట్ ఫైల్ ఇచ్చిన సదాశివం – ఫైల్ లో సీక్రెట్ చూసి షాకైన భాగీ
Nindu Noorella Saavasam Today Episode: సదాశివం ఇచ్చిన ఫైల్‌లో ఉన్న సీక్రెట్ తెలుసుకుంటుంది భాగీ. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు రూంని క్లీన్ చేయిస్తాడు సదాశివం. అలాగే కప్‌బోర్డును సర్దాలనుకుని అనామిక హెల్ప్ చేయమని అడుగుతాడు. అనామిక సరే అంటూ హెల్ప్ చేస్తుంది. ఇంతలో అక్కడే ఉన్న ఆరు చీరలను తీసి కప్‌బోర్డులో పెట్టమని సదాశివం, అనామికకు ఇవ్వబోతుంటే దూరం నుంచి అంతా గమనిస్తున్న మనోహరి కంగారుగా పరుగెత్తుకు వస్తుంది.
మను: ఏయ్.. ఆగు..
సదాశివం: ఏమైందమ్మా ఎందుకు అలా అరుస్తున్నావు
మను: ఏయ్ ఏం చేస్తున్నావు. ఆరు వస్తువులు ముట్టుకోవద్దని నీకు చెప్పాను కదా..?
అనామిక: అంకుల్ చెప్తే వచ్చానండి
మను: ఎవరు చెప్పినా ఏం చెప్పినా ముట్టుకోవద్దని నీకు మరీ మరీ చెప్పినా ఇంకా ముట్టుకుంటుంటే ఏమనాలి..?
సదాశివం: ఇప్పుడు ఏమైందని అమ్మా ఆ అమ్మాయి మీద అలా అరుస్తున్నావు.
నిర్మల: అయినా ఈ అమ్మాయి మా అరుంధతి వస్తువులు ఎందుకు ముట్టుకోకూడదు..?
అనామిక: ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అండి ఎందుకు మీరు నన్ను అరుంధతి మేడం వస్తువులు ముట్టుకోనివ్వడం లేదు.
మను: అమర్‌కు ఆరు వస్తువులు ఎవ్వరూ ముట్టుకోవడం ఇష్టం ఉండదు కదా అంకుల్. అమర్ వాటిని ఎంత ప్రేమగా చూసుకుంటాడో మీకు తెలుసు కదా..? ఈ అమ్మాయి తెలిసో తెలియకో వాటిని పాడు చేస్తే అమర్ మనసు బాధపడుతుంది. ఈ అమ్మాయి మీద అరుస్తాడు అందుకే ముట్టుకోవద్దు అన్నాను
సదాశివం: నువ్వు చెప్పింది కూడా కరెక్టే అమ్మా.. అమ్మా అనామిక ఇవన్నీ మేము చూసుకుంటాము కానీ నువ్వు వెళ్లు
అనామిక: సరే అంకుల్
అంటూ అనామిక అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
సదాశివం: అన్ని తీసి బయట పెట్టాను ఇప్పుడు ఇవన్నీ ఎవరు సర్దాలి.
మను: నేను ఉన్నాను కదా అంకుల్ నేను సర్దుతాను.
అంటూ కప్‌బోర్డు సర్దుతూ ఉంటే కొన్ని ఫైల్స్ కింద పడతాయి. అందులో అంజు దత్తత తీసుకున్న సర్టిఫికెట్ ఉంటుంది. అది చూసిన నిర్మల, సదాశివం.. వెంటనే మనోహరి రూంలోంచి వెళ్లిపోమ్మని ఆ ఫైల్‌ను తీసుకుని తమ రూంలోకి వెళ్లిపోతారు. మనోహరి అంతా గమనిస్తుంది.
మను: ఆ ఫైల్ చూడగానే వాళ్ల బిహేవియరే మారిపోయింది. ఆ ఫైల్ లో ఎవ్వరూ చూడకూడనంత ఏముంది. అసలు ఈ ముసలోళ్లు ఎందుకు ఇంత కంగారు పడ్డారు. అదేదో అంజుకు సంబంధించింది అని అర్థం అయింది. అంజు గురించి వీళ్లు ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది.
సదాశివం: అసలు ఈ ఫైల్ అక్కడికి ఎలా వచ్చింది.
నిర్మల: మీరే అక్కడ పెట్టారండి.. అమర్ జాగ్రత్తగా సీక్రెట్‌గా దాచి ఉంచమంటే మీరేమో అందరికీ తెలిసేలా చేసేలా ఉన్నారు.
సదాశివం: సరే ఇక ఎవ్వరి కంట పడకుండా దాచేయాలి.
అని సదాశివం చెప్పగానే సరే అంటుంది నిర్మల. తర్వాత పిల్లలందరూ తమ స్కూల్ లో జరిగే యానివల్ డే గేమ్స్ లో పాల్గొనడానికి పర్మిషన్ కావాలని అడగ్గానే పర్మిషన్ ఇవ్వనని సదాశివం చెప్తాడు. దీంతో అంజు డాడీ వచ్చాక డాడీతో పర్మిషన్ తీసుకుంటాను అంటూ అలిగి వెళ్లిపోతుంది. తర్వాత తన రూంలో ఉన్న ఫైల్‌ను అమర్ రూంలో పెట్టాలని భాగీని పిలిచి ఫైల్ ఇస్తాడు సదాశివం. ఆ ఫైల్ తీసుకెళ్లి అమర్ రూంలో పెడుతున్న భాగీ అంజును దత్తత తీసుకున్న సర్టిఫికెట్ చూసి షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!