Chinni Serial Today Episode ఏసీపీ విజయ్‌ తనని కావేరి అని నిరూపించలేకపోయాడనే సంతోషంతో కావేరి అలియాస్ ఉష చాలా సంతోషంగా ఇంటికి వస్తుంది. ఇంటి దగ్గర చిన్ని వాళ్లు క్రికెట్ ఆడుతుంటే తాను కూడా వెళ్లి ఆడుతుంది. టీచర్ చాలా హుషారుగా ఉన్నారని చందు అంటాడు. మా టీచరమ్మకి దిష్టి పెట్టకు అని చిన్ని అంటుంది. మేడ మీద నుంచి భారతి ఉష(కావేరి) సంతోషంగా పిల్లలతో ఆడుకోవడం చూస్తుంది. 

Continues below advertisement


కావేరి అలా నువ్వుతుందీ అంటే ఫింగర్ ఫ్రింట్స్ మ్యాచ్ అవ్వలేదు అనుకుంటుంది. విషయం అడిగితే కావేరి లేదని తలూపుతుంది. సంతోషంగా నవ్వుకుంటారు. ఏసీపీ విజయ్ వచ్చిన దారినే హైదరాబాద్ వెళ్లిపోతాడని అనుకుంటారు. విజయ్ కావేరి గురించే ఆలోచిస్తుంటాడు. కుందన విజయ్ దగ్గరకు కావేరి ఫైల్ తీసుకొస్తుంది. విజయ్‌ని కుందన  లైన్ వేస్తే విజయ్ కోప్పడి చెప్పింది చేయ్ అలా చూడుకు అని బోర్ట్ తీసుకురమ్మని చెప్తాడు. కావేరి, ఉష అని పేర్లు రాస్తాడు. కావేరి జైలుకి వచ్చింది ఓ  బిడ్డని కనింది.. ఫైర్ యాక్సిడెంట్‌లో చనిపోతే 25 లక్షలు తన ఫ్యామిలీకి దక్కాయని.. ఇక ఉష డెహ్రాడూన్‌లో నుంచి స్పోర్ట్స్‌ టీచర్‌గా రాజమండ్రి వచ్చిందని ఇప్పుడు కావేరి ఉష ఒక్కరే అని నిరూపించాలని అంటాడు. కావేరి జైలులో మొదటి నుంచి చివరి రోజు వరకు ప్రతీ డిటైల్ కావాలని అంటాడు. ఎందుకు మీరు ఇంకా ఉషని అనుమానిస్తున్నారని కుందన అడుగుతుంది. 


విజయ్: కావేరికి ఇచ్చిన 25 లక్షల చెక్ ఇప్పటి వరకు విత్‌డ్రా చేయలేదు. ఎక్స్‌గ్రేషియా కింద పాతిక లక్షలు వస్తే ఎవరూ వదులుకోరు. కావేరి ఫ్యామిలీ ఎందుకు వదులుకుంది. సో ఇక్కడే ఏదో మతలబు ఉంది. కావేరి చనిపోలేదని తన ఫ్యామిలీకి తెలిసుంటుంది. అందుకే వాళ్లు డబ్బు డ్రా చేయలేదు.
కుందన: గ్రేట్ సార్ మీరు.
విజయ్: మన ఇంటి దగ్గరలో బాబా గుడి ఉందా. 


విజయ్ ఉదయం గుడికి వస్తాడు. చిన్ని, చందు అక్కడ అందరికీ బన్ పంచుతూ ఉంటుంది. అది చూసిన విజయ్ నా కూతురు కూడా ఇలాగే గుడి దగ్గర బన్‌లు పంచుతూ ఉండేది అని తన కూతుర్ని గుర్తు చేసుకుంటాడు. చిన్ని రోజూ బన్‌లో సరిగా పంచేది ఈ రోజు సరిపోకపోవడంతో బాధ పడుతుంది. ఇంతలో విజయ్ బన్‌లు తీసుకొచ్చి ఇస్తాడు. థ్యాంక్యూ విజ్జూ అని చిన్ని చెప్తుంది. పంతులు వచ్చి ప్రతీ గురువారం చిన్ని ఇలా బన్‌లు పంచుతుంది. చాలా మంచి పాప అని చెప్తారు. విజయ్ చిన్నిని పొడుగుతాడు. ఇక చిన్ని హోళీ ఆడటానికి తన ఫ్రెండ్ విజ్జుని పిలుస్తుంది. 


ఉష ఇంటి దగ్గర అందరూ హోళీ ఆడుతుంటారు. ఉష కూడా రెడీ అవుతుంది. చిన్ని, చందు ఉష అందరూ రంగులు పూసుకొని హోళీ ఆడుతారు. కావేరి పిల్లలతో సంతోషంగా హోళీ ఆడటం చూసి రాజు చాలా సంతోష పడతాడు. ఉష పరుగులు తీస్తూ రాజుని ఢీ కొడుతుంది. రాజు ఉషని పట్టుకుంటాడు. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుంటారు. ఏంటి అలా చూస్తున్నావ్ నేను నీకు పడను అంటే నేను పడేసే రకం అని అంటాడు. ఇద్దరూ తిట్టుకుంటారు. పడేయ్ అని ఉష అంటే సెకనులో పడేస్తా అని కింద వదిలేస్తాడు. ఉష కాలు బెనుకుతుంది. హాస్పిటల్‌కి వెళ్దామని చిన్ని అంటే అవసరం లేదు కాలు సరిచేస్తే సరిపోతుందని అంటాడు.


చిన్ని చేయమంటే మీ టీచర్ తనే నన్ను గుద్ది తిట్టింది ఇప్పుడు తను అడిగే వరకు నేను సాయం చేయను అంటాడు. కాసేపు నోరు మూసుకొంటే సరి చేస్తా అంటాడు. ఏదో ఏడవ మను అని ఉష అంటే రాజు కావేరి కాలు పట్టుకొని సెట్ చేస్తాడు. కావేరిని చూసి తన ప్రేమ పెళ్లి అన్నీ గుర్తు చేసుకుంటాడు. కావేరి కాలు సెట్ అయిపోతుంది. కావేరి వెళ్లిపోతూ ఉంటే థ్యాంక్స్ చెప్పడం లేదు అంటే నీ బోడి ముఖానికి ఎవరూ థ్యాంక్స్ చెప్పరు అంటుంది. మీ రాక్షసి టీచర్ ఎలా అంటుంది చూడు అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీకి ఓ అవకాశం.. మనీషాకి తెలీకుండా HCG టెస్ట్ చేసేదెలా?