Meghasandesam Serial Today Episode: పూరిని దీవించడానికి ఇంటికి వచ్చిన కేపీని గగన్‌ బయటకు గెంటేస్తాడు. నా ఇంట్లో నిలబడటానికి నీక అర్హత లేదు జస్ట్‌ గెట్‌ లాస్ట్‌ అంటూ తిడతాడు. దీంతో కేపీ బాధపడతాడు. కానీ కోపంగా గగన్‌ ను చూస్తూ.. దగ్గరకు వెళ్తాడు. 

Continues below advertisement

కేపీ: ఏమన్నావురా..? గెట్‌ లాస్టా..? ఇప్పుడు వెళ్లిపోతాను కానీ కళ్యాణ మండపానికి వస్తాము.. నా కూతురు పెళ్లిరా..? నేను దానికి తండ్రిని నన్ను ఆపే హక్కు ఎవ్వడికి లేదు. నువ్వెలా ఆపుతావో అది కూడా చూస్తాను. పదరా చెర్రి అంటూ చెర్రిని తీసుకుని వెళ్లిపోతాడు కేపీ. శారద ఏడుస్తుంది. భూమి బాధపడుతుంది. కట్‌ చేస్తే అపూర్వ, బిందు రూంలో ఉంటుంది. కోపంగా బిందును చూస్తుంటుంది. 

బిందు: ఎందుకు అత్తయ్య అలా చూస్తున్నారు ఏంటో చెప్పండి అత్తయ్య..

Continues below advertisement

అపూర్వ: ఫోన్‌ లో కానీ టెర్రస్‌ మీద కానీ సీక్రెట్‌ గా కానీ నీకు శివ టచ్‌లోకి రాలేదా..? 

బిందు: శివ నాకు టచ్‌లోకి రావడం ఏంటి..? 

అపూర్వ: నటించకు బిందు. నేనేం అంత సీరియస్‌గా మాట్లాడటానికి పిలవలేదు.. శివ నువ్వు ప్రేమించుకుంటున్నారని నాకు తెలసని చెప్పడానికి వచ్చాను. 

బిందు: అంటే అత్తయ్యా మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడటం నిజమే కానీ తర్వాత మీరు నన్ను ఇంట్లో బంధించాక శివకు టచ్‌లోకి వెళ్లడం లేదు. 

అపూర్వ: శివ నీతో చెప్పడం నాకు తెలియదు కానీ నేను శివను కలిసి మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తానని నేను అతనికి మాట ఇచ్చాను. 

బిందు: నిజంగానా అత్తయ్యా..? 

అపూర్వ: నిజంగానే.. 

బిందు: థాంక్స్‌ అత్తయ్యా..థాంక్యూ సోమచ్‌.. 

అపూర్వ: నిజానికి ఆ శివ భూమి తమ్ముడు కాబట్టి శివతో నీ పెళ్లికి ఒప్పుకోకూడదు. కానీ భూమి కంటే ఆ గగన్‌ గాడు వాడి ఫ్యామిలీ శోక సంద్రంలో మునగడం నాకు చాలా ముఖ్యం. పీటల మీదకు వచ్చిన పూరి పెళ్లి ఆగిపోవడంతో వాడు అవమానంతో కుంగిపోవాలి. ఆ శారద ఆయ్యో అని ఏడుస్తుంటే.. ఆ ఏడుపు మన ఇంటి వరకు వినబడాలి. ఇష్టపడిన వాడిని జారవిడుచుకున్నానని ఆ పూరి బాధతో విలవిలలాడుతుంటే.. అటు చెల్లిని ఇటు తల్లిని ఎలా ఓదార్చాలో తెలియక ఆ గగన్‌ గాడు తల పట్టుకోవాలి. ఇప్పటి వరకు ఆ ఇంటికి దేవత అయిపోయిన భూమి అవమానంతో తల ఎక్కడ పెట్టుకుంటుందో.. ఆ ఇంట్లో వాళ్లకు సమాధానం ఏం చెప్తుందో.. నేను ఈ రెండు కళ్లతో చూడాలి. అందుకే నేను శివతో నీ పెళ్లి జరిపిస్తున్నాను. 

బిందు: థాంక్స్‌ అత్తయ్యా మీ ప్రేమను మీరైనా అర్థం చేసుకున్నందుకు..  అంటూ బిందు, అపూర్వను హగ్‌ చేసుకుంటుంది. అపూర్వ మాత్రం కోపంగా చూస్తుంటుంది. తర్వాత వికారాబాద్‌ దగ్గర ఉన్న పల్లెటూరు నుంచి జనాలు వచ్చి తమ ఊరిలో పురాతన శివాలయం ఉందని అది ఎప్పుడో శిథిలావస్థకు చేరితే ఈ మధ్యనే పునరుద్దరించామని ఆ ఊరి ప్రజలు గగన్‌ ఇంటికి వచ్చి భూమికి చెప్తారు.  ప్రతి సంవత్సరం ఆ ఊరి గుడిలో శోభా చంద్ర నాట్యం చేసేదని ఇప్పుడు గుడి పునరుద్దరించినందుకు ఈ శివరాత్రికి మీరు వచ్చి నాట్యం చేయాలని కోరుతారు. దీంతో గగన్‌, భూమి ఓకే అంటారు. గుడిలో నాట్యం చేస్తామని ఆ ఊరి వాళ్లకు మాటిచ్చి పంపిస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.