Lakshimi Raave Maa Intiki Serial Today Episode: మ్యాడీని కట్టిపడేసి ఫోన్ లాక్కున్న బుల్లిరాజు బాగా మందు తాగి పడిపోతాడు. వాడి అనుచరులు కూడా మందుకొట్టి మత్తులోకి జారుకుంటారు. వారు మాట్లాడుకున్న మాటలన్నీ విన్న మ్యాడీ....అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు.ఇంతలో కోర్టుకు సమయం అవుతుండటంతో శ్రీలక్ష్మీని పోలీసులు కోర్టుకు తీసుకెళ్తారు.
ఇంట్లో నుంచి సూర్యనారాయణ కూడా తన కొడుకుతో కలిసి కోర్టుకు బయలుదేరతాడు. ఇంట్లో వాళ్ల అమ్మపై ప్రియంవద కేకలువేస్తుంది. నిన్నటి నుంచి మ్యాడీ ఇంటికి రాకపోతే ఇంట్లో ఎవరూ పట్టనట్లు ఉన్నారని మండిపడుతుంది.ఆ శ్రీలక్ష్మీ కోసం మాత్రం నానా హైరానా పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో ఇందిర కూతురిని గట్టిగా మందలిస్తుంది.ఆయన మనవడు కనిపించకపోతే ఆయనకు మాత్రం ఆందోళన ఉండదా అని అంటుంది.మ్యాడీని పంపించిందే ఆయన అని అంటుంది.వాడికి ఏం కాదని నువ్వు అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దది చేయవద్దని మందలించి వెళ్లిపోతుంది.
కోర్టు బయట శ్రీలక్ష్మీ కోసం నారాయణ,వాళ్ల చిన్న మామయ్య ఎదురు చూస్తుంటారు.ఇంతలో పోలీసులు శ్రీలక్ష్మీని తీసుకురాగా....లాయర్ అజయ్ గజపతి ఆమెకు ధైర్యం చెబుతాడు. నువ్వు ఏం భయపడవద్దని నేను అన్ని చూసుకుంటానని చెబుతాడు.కోర్టులో వాదోపవాదనలు సాగుతుంటాయి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డుపైకి కారు తీసుకొచ్చి ఓ మనిషి ప్రాణం తీసిన శ్రీలక్ష్మీని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వ న్యాయవాది కోరతాడు. వెంటనే అజయ్ అందుకుని అసలు ఎవరైనా కేసు పెట్టారా అని నిలదీస్తాడు. పోనీ గాయపడిన వ్యక్తి చనిపోయినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అంటాడు.
అసలు ఎవరూ కేసుపెట్టలేదు. యాక్సిడెంట్‌లో గాయపడిన వాడు చనిపోయినట్లు ఎక్కడా నిర్థారణ కాలేదని వాదిస్తాడు.ఇంతలో కలుగజేసుకున్న ప్రభుత్వ న్యాయవాది....తానే ఈ యాక్సిడెంట్ చేశానని నిందితురాలు ఒప్పుకుందని అంటాడు.పైగా తాను యాక్సిడెంట్ చేసినట్లు వీడియో కూడా ఉందని చూపుతాడు. అన్నిఆధారాలు పరిశీలించిన న్యాయమూర్తి శిక్ష విధించడానికి సిద్ధమవుతాడు.
అప్పుడే కోర్టు హాల్‌లోకి వచ్చిన మ్యాడీ...తనతో పాటు బుల్లిరాజు,అతని అనుచరులను పట్టుకొస్తాడు. అసలు ఇదంతా చేసింది వీళ్లేనని...కావాలని నన్ను ఈకేసులో ఇరికించాలని చూశారని చెబుతాడు. వారి వేషాలు తీసి బుల్లిరాజును న్యాయమూర్తి ముందు నిలబెడతాడు. సీసీ కెమెరా ఫుటేజీని కూడా న్యాయమూర్తికి అందజేస్తాడు.
ఇప్పటి వరకు మీరు అనుకుంటున్నట్లు ఆ యాక్సిడెంట్‌లో చనిపోయింది కూడా బుల్లిరాజేనని మ్యాడీ చెబుతాడు. పక్క పథకం ప్రకారం ఇదంతా చేశాడని కావాలనే నన్ను ఈ కేసులో ఇరికించాలని చూశాడని చెబుతాడు. ఆధారాలన్నీ పరిశీలించిన న్యాయమూర్తి....శ్రీలక్ష్మీ ఎలాంటి తప్పు చేయలేదని నిర్థారణకు వస్తాడు.ఆమెను వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశిస్తారు. పోలీసులను, న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన బుల్లిరాజుకు, అతని అనుచరులకు మూడేళ్లు కఠిన కారాగారా శిక్ష విధిస్తూ...న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తాడు.
