Nindu Noorella Saavasam Serial Today Episode: రణవీర్‌ లాయరుతో మందు తాగుతూ ఎలాగైనా తన బిడ్డ ఆచూకీ తెలుసుకోవాలనుకుంటాడు. అందుకోసం అంజును కిడ్నాప్‌ చేసి అమర్‌ను బ్లాక్‌ మెయిల్ చేస్తే తన బిడ్డ ఆచూకి చెప్తాడని ప్లాన్‌ చేస్తాడు. వెంటనే మనోహరికి కాల్‌ చేస్తాడు. భోజనం చేస్తున్న మనోహరి మధ్యలోనే బయటకు లాన్‌లోకి వెళ్లి ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తుంది. 

మనోహరి: ఏంటి ఈ టైంలో ఫోన్‌ చేశావు.. ప్రశాంతంగా భోజనం కూడా చేయనియ్యవా..? నెల రోజుల టైం ఇచ్చావు కదా..? అప్పుడే తొందరెందుకు 

రణవీర్‌: మనోహరి ఫోన్‌ ఎత్తగానే గ్యాప్‌ ఇవ్వకుండా వాగుతున్నావేంటి..? నన్ను మాట్లాడనివ్వవా..? 

మనోహరి: నీ కూతురు నీకు కావాలి, నన్ను కాస్త ఆలోచించుకోనివ్వు 

రణవీర్‌: నువ్వు ఏమీ ఆలోచించాల్సిన పనిలేదు.. ఆల్రెడీ నేను లాయరు కలిసి ఒక ప్లాన్‌ చేశాం 

మనోహరి: ఏంటా ప్లాన్‌ 

రణవీర్‌: అంజు పాపను కిడ్నాప్ చేసి అమరేంద్రను బెదిరించి నా కూతురు ఎక్కడుందో తెలుసుకోవడం అదే నా ప్లాన్‌.. 

మనోహరి: మంచి ప్లాన్‌ ఆలోచించారు. ఎలాగూ నేను అడుగుతుంటే అమర్ చెప్పడం లేదు.. భాగీ, రాథోడ్‌ చెప్పనివ్వడం లేదు.. ఇలాగైనా పాప ఆచూకి తెలుస్తుందేమో చూద్దాం.. 

రణవీర్: చూద్దాం అంటే సరిపోదు.. నీకు నేను చాలా సార్లు హెల్ప్‌ చేశాను.. ఈ ప్లాన్‌ లో నువ్వు నాకు హెల్ప్‌ చేయాలి. 

మనోహరి: నేనేం చేయాలి 

రణవీర్: అంజు పాపను నువ్వే ఎత్తుకొచ్చి నాకు అప్పగించాలి 

మనోహరి: అప్పుడు నేను ఇరుక్కుంటాను.. అసలే ఆ పిల్ల చాలా తెలివైంది. 

రణవీర్‌: నేను  ఇంట్లోకి వచ్చి ఆ పిల్లను కిడ్నాప్‌ చేయలేను కదా..? 

మనోహరి: దానికి అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు నీ టైం బాగుండి కరెక్టు ప్లాన్‌ ఆలోచించావు.. రేపు ఇక్కడ హోళీ జరుగుతుంది. అనాథ ఆశ్రమం పిల్లలు వస్తున్నారు.. ఆ పిల్లలతో కలిసి ఈ పిల్లలు హోళీ ఆడబోతున్నారు.. ఆ సందర్భంలో నువ్వు వచ్చి చడీ చప్పుడు కాకుండా అంజును ఎత్తుకుపో.. ఆ పని పూర్తి అయ్యే లోపు ఇక్కడ ఎవ్వరికీ డౌటు రాకుండా నేను మానేజ్ చేస్తాను 

రణవీర్‌: ఆ సరే సరే నువ్వు ఆ ఏర్పాట్లు చూడు మిగతా పని నేను పూర్తి చేస్తాను

మనోహరి: ఇదిగో నేను మళ్లీ చెప్తున్నాను.. ఈ విషయంలో నా పేరు ఎక్కడా బయటకు రాకూడదు.. అమర్‌కు నా గురించి తెలిసిందో నువ్వు నా మాజీ మొగుడివి అని కూడా చూడకుండా నిన్ను చంపేస్తాను 

రణవీర్: ఏయ్‌ నాకు కావాల్సింది ఆస్థి. అది నాకు దక్కితే చాలు.. నిన్ను ఇరికిస్తే నాకేం వస్తుంది 

మనోహరి: అదే చెప్తున్నాను.. నన్ను ఇరికిస్తే నీకేం రాదు.. పైగా నీ ప్రాణం పోతుంది. అమర్‌తో నా పెళ్లి దగ్గర పడుతుంది. దాన్ని చెడగొట్టకు.. 

రణవీర్‌: అలాగేనే నా మాజీ భార్యామణి నీ పని నీది నా పని నాది.. రేపు కలుద్దాం అంటూ ఫోన్‌ కట్‌ చేస్తాడు. 

మనోహరి: రేపటితో రణవీర్‌ పీడ విరగడవుతుంది. అంజును అడ్డు పెట్టుకుని అమరేంద్రతో నా  కూతురు ఎక్కడుందో చెప్పిస్తే.. ఆ పిల్లను తీసుకుని రణవీర్‌ నా దారికి అడ్డు రాకుండా వెళ్లిపోతాడు.. 

మరోవైపు 

లాయరు:  మనోహరి ఏమంటుంది సార్‌ అని అడగ్గానే.. ఏమంటుంది మనం తనను ఇరికించకూడదట. నా మాజీ భార్య నాతోనే చెప్తుంది. లాయరు నవ్వుతూ కలికాలం సార్‌ ఏం చేస్తాం.. అనగానే.. ఈ ఆస్థి నా చేతికి రావాలి.. ఆ తర్వాత మనోహరిని ఏదో ఒకటి చేయాలి లాయరు అంటూ కోపంగా మందు తాగుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.