Meghasandesam Serial Today Episode : ఇందు వాళ్ల అత్తా మామలకు కృష్ణప్రసాద్‌ ఫోన్‌ చేసి మా ఇంట్లో వాళ్లంతా మీతో మాట్లాడాలంట ఒకసారి ఇంటికి వస్తారా..? అని అడుగుతాడు. వస్తామని చెప్తారు. దీంతో అందరూ వాళ్ల కోసం ఎదురుచూస్తుండగానే.. వాళ్లిద్దరూ శరత్‌చంద్ర ఇంటికి వస్తారు. ఏంటి రమ్మన్నారు అని అడుగుతారు.

కృష్ణ: మీకు రావాల్సిన కట్నం నేను ఈ ఇంట్లో దొంగతనం చేసి మరీ ఇచ్చానని నా మీద నింద పడింది.

శరత్‌: కేపీ దొంగతనం నిందా అని ఎందుకు అంత పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతున్నావు. నేను మీకు ఇచ్చిన రెండు కోట్లకు ఇక్కడ లెక్క రాయడం మర్చిపోయానని అంటున్నారు. అది నిజమా కాదా అని అడగొచ్చు కదా..?

కృష్ణ: మాటలు మార్చినంత మాత్రాన దొంగ అని  నా మీద పడ్డ నింద చెరిగిపోదు కదండి. వాళ్లకు అర్థమయ్యేలా మాట్లాడనివ్వండి. సార్‌ నా కూతురుకు ఇవ్వాల్సిన కట్నం రెండు కోట్లు నేను ఇక్కడ దొంగిలించి నేను మీకు ఇచ్చానా..?

వెంకటేష్‌: మరీ అంత కఠినంగా మాట్లాడకండి.. వినడానికి మాకు కూడా కాస్త ఇబ్బందిగా ఉంది. మీరైతే మాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు.

అపూర్వ: ఆ రెండు కోట్లు ఇచ్చినప్పుడు సరిగ్గా ఇలాగే చెప్పమని కేపీ చెప్పాడా అండి.

వెంకటేష్‌: అదేంటమ్మా అలా మాట్లాడుతున్నారు. ఆయన మాకు ఎలాంటి డబ్బులు ఇవ్వట్లేదని చెప్తుంటే.. ఇచ్చి అబద్దం చెప్పమన్నాడా..? అంటారేంటి..? ఆయన మాకు ఎలాంటి డబ్బు ఇవ్వలేదండి.

అపూర్వ: చూడండి వెంకటేష్‌ గారు మీ మధ్య తరగతి మనస్తత్వాలు నాకు బాగా తెలుసు. డబ్బు కోసం మీరు ఎంత వరకైనా దిగజారుతారు. ఎన్ని అబద్దాలైనా అలవోకగా అల్లేస్తారు. మీరు మీరు ఒక్కటే అన్నట్టు కూలబలుక్కుని మాట్లేడేస్తున్నారు కదా..? ఎంతైనా మా కేపీ కూడా మధ్య తరగతి నుంచి వచ్చిన వాడే కదా..?

భూమి: అవును మరి మా అపూర్వ ఆంటీ పెద్ద తరగతి నుంచి వచ్చింది. గోల్డెన్‌ స్పూన్‌తో పుట్టింది.

అపూర్వ: ఇలా మధ్యలో అడ్డు పడి నువ్వేం చెప్పాలనుకున్నావమ్మా..?

భూమి: మీరు కూడా మధ్య తరగతి నుంచే వచ్చారని గుర్తు చేస్తున్నాను. మధ్య తరగతి మనుషులు అంటే అటు పైకి ఎగబాకలేక.. ఇటు కిందకు పడిపోలేక ఆత్మాభిమానాలతో నలిగిపోతున్న మనుషులని తెలియజేస్తున్నాను.

అపూర్వ: నువ్వు చెప్పింది కరెక్టే.. మధ్య తరగతి మనుషుల్లో రెండు రకాలు ఉంటారు. నేను చెప్పినట్టు దిగజారిపోయే వాళ్లు ఒకరైతే.. నువ్వు చెప్పినట్టు ఆత్మాభిమానంతో బతికేవాళ్లు ఇంకో రకం. కేపీ, వెంకటేష్‌లు నేను చెప్పిన రకానికి చెందినవాళ్లు.. మరి నేను నువ్వు చెప్పిన వర్గానికి చెందుతాను. నేను ఎంత ఆత్మాభిమానంతో బతికానో.. ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చానో మా బావకు బాగా తెలుసు. కేపీ మమ్మల్ని మోసం చేసి ఈ ఇంట్లోకి ఎలా అడుగుపెట్టాడో ఇక్కడ అందరికీ తెలుసు. అయినా కేపీని నువ్వు ఇంకా సపోర్టు చేస్తున్నావంటే కేపీ కొట్టేసిన రెండు కోట్ల గురించి నీకు కూడా తెలుసా..?

శరత్‌: అపూర్వ కాస్త ఆలోచించి మాట్లాడు.  భూమిని నిందించకు..

అపూర్వ: నువ్వే ఆలోచించు బావ. ఈ ఇంట్లో రెండు కోట్లు పోయాయి. ఇద్దరు అనుమానితులు ఉన్నారు. కేపీ ఈ డబ్బు తీయలేదంటే.. కేపీ చెప్పినట్టు నేనే తీశాను అంటున్నావు. అది నువ్వు నమ్ముతున్నావా..? బావ.

శరత్‌: చచ్చినా నువ్వు అలాంటి పని చేయవు      

అపూర్వ: కదా ఈ కేపీయే ఆ డబ్బు మాయం చేశాడని అర్థం. కేపీని ఈ భూమి సపోర్టు చేస్తుంది అంటే ఈ భూమికి కూడా తెలుసనే కదా బావ అర్థం.

శరత్‌: కేపీ మీద ఉన్న అభిమానంతో అలా మాట్లాడుతుంది. అమ్మా భూమి ఈ విషయంలో నువ్వు ఇన్‌వాల్వ్‌ అవ్వకు.

భూమి: అది కాదు నాన్నా..

శరత్‌: వద్దు అన్నాను కదా.. వద్దు అంటే వద్దు..

కృష్ణ: అంటే నన్ను దొంగ అని తేల్చేశారు అన్నమాట.

శరత్‌: కేపీ వాళ్లకు ఇచ్చే కట్నం చెప్పి ఇచ్చుండాల్సింది. ఇంత రాదాంతం ఉండేదు కాదు కదా..?

అని శరత్‌ చంద్ర చెప్పగానే.. కృష్ణ ప్రసాద్‌ బాధపడతాడు. తర్వాత గగన్‌ శరత్‌ చంద్ర ఇంటకి నక్షత్ర కోసం వస్తున్నాడని శారద చెప్పడం వల్లే గగన్‌ వస్తున్నాడని ఇలాగే జరిగితే వాడు నక్షత్రకు దగ్గరైపోతాడని అలా జరగకూడదంటే నువ్వు వాడికి ఫోన్‌ చేసి ఐలవ్యూ చెప్పేయ్‌ అంటాడు. నా కొడుకు నక్షత్రకు దక్కాలా.. నీకు దక్కాలా అనేది నీ చేతుల్లోనే ఉందని ప్రసాద్‌ చెప్పగానే.. భూమి ఆలోచనలో పడిపోతుంది. వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి గగన్‌ కారుకు ఎదురుగా నిలబడుతుంది.  ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!