Meghasandesam Serial Today Episode: రెస్టారెంట్‌ లో సాధన డాన్స్‌ చేస్తుంటే భూమి కోపంగా చూస్తుంది. గగన్‌.. భూమిని చూసి ఏమైంది అలా చూస్తున్నావు అని అడుగుతాడు. దీంతో భూమి బాధగా బావ ఆవిడ కరెక్ట్‌ చేయడం లేదు. ఆమె చేస్తున్నవి అన్ని తప్పుడు మూమెంట్స్‌ అని చెప్తుంది.

భూమి: ఆపండి.. ఏంటి ఇది నాట్యమా..? నువ్వు శోభాచంద్ర గారి శిష్యురాలివా..?

సాధన: అంతటి శోభాచంద్ర గారి శిష్యురాలిని అయినా..నా నాట్యాన్నే మధ్యలో ఆపిన నువ్వు ఎవరు..?

భూమి: ఆ శోభా చంద్ర కూతురిని

సాధన: ఓ భూమి అంటే నువ్వేనా..? నీ గురించి వార్తల్లో విన్నానులే.. నీకు జన్మను ఇస్తూ మా శోభాచంద్ర గారు కన్ను మూశారు. ఆవిడ దగ్గర నాట్యం నేర్చుకున్న నన్నే నాట్యం గురించి ప్రశ్నిస్తున్నావా..? అసలు నీకేం తెలుసని నాట్యం గురించి.

భూమి: తెలుసు మా అమ్మనే గురువుగా బావించి నేను నాట్యం నేర్చుకున్నాను.

సాధన: భావించినంత మాత్రాన నాట్యం రాదు భూమి.

భూమి: సాధన చేస్తే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. ద్రోణాచార్యుడినే గురువుగా భావించి విలువిద్య నేర్చుకున్న ఏకలవ్యుడు అర్జునుడినే భయపెట్టాడు. అలాగే నేను మా అమ్మను గురువుగా బావించి ఎకలవ్య శిష్యరికం చేశాను.

సాధన: అయ్యబాబోయ్‌ ఇప్పుడు నన్ను భయపెట్టేస్తావా..? ఏంటి..?

గగన్‌: హలో మేడం.. మా భూమి డాన్స్ చేయడం మీరు చూస్తే కచ్చితంగా భయపడతారు.

సాధన: అబ్బో మధ్యలోకి ఒక మధ్యవర్తి వచ్చాడండి వకాల్తా పుచ్చుకోవడానికి. నా నాట్యం కోసం అర్రులు చాచే అభిమానులు ఉన్న నేను ఈవిడ గారి నాట్యం చూడటం ఏంటి..? చూడటం కాదు. నాతో కలిసి నాట్యం చేయమని చెప్పు. ఒకటి రెండు అడుగులకే ఓడిపోయి కింద పడకపోతే నా పేరు శోభాచంద్ర శిష్యురాలు సాధనే కాదు.

భూమి: చీ నోర్‌ మూయ్‌ కుప్పిగంతులు వేస్తూ దానికి నాట్యం అని పేరు పెట్టి మాటకు ముందు వెనక మా అమ్మ పేరు చెప్పకు. నీతో పోటీ పడమని చెప్పి నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. నేను పోటీకి సిద్దం..

గగన్‌: సూపర్..కమాన్‌ భూమి..

అని గగన్‌ అనగానే భూమి స్టేజీ మీదకు వెళ్లి నాట్యం స్టార్ట్‌ చేస్తుంది. ఇద్దరి మధ్య డాన్స్‌ పోటీ మొదలవుతుంది. కొద్దిసేపటికి భూమితో పోటీ పడలేక సాధన ఓడిపోతుంది. ఓటమి బాధతో సాధన ఉంటుంది.

భూమి: ఇది నిజమైన నాట్యం అంటే సాధన గారి లాంటి మాటలకు గారడీలకు మీరు మోస పోవద్దు.. నేనే ఒక అకాడమీని స్థాపించి.. ఉచితంగా నాట్యం నేర్పిస్తాను.

అని చెప్పగానే అందరూ భూమిని చప్పట్లతో అభినందిస్తారు. మరోవైపు ఇంటి దగ్గర భూమి ఇంకా రాలేదేంటని శరత్ చంద్ర ఎదురుచూస్తుంటాడు. ఇంతలో భూమి గగన్‌ కారులో వస్తారు. వాళ్లను చూసిన శరత్ చంద్ర గోడ చాటుకు వెళ్తాడు. శరత్‌ చంద్రను గమనించిన గగన్‌ వెంటనే భూమిని పిలిచి మనం ప్రేమించుకున్నాం.. పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. పెళ్లికి ముందు కొన్ని తీపి గుర్తులు ఉండాలి కదా అంటూ భూమిని కిస్‌ అడుగుతాడు గగన్‌. ఇంతలో శరత్ చంద్ర దగ్గరకు అపూర్వ వస్తుంది. ఇంతలో భూమి.. గగన్‌కు కిస్‌ ఇచ్చి వెళ్తుంది. అది గమనించిన అపూర్వ కిందకు వెళ్లి భూమిని తిడుతూ పెళ్లి అయ్యేవరకు నువ్వు వాడితో బయటకు వెళ్లకూడదు అని చెప్తుంది. నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు పిన్ని అంటుంది భూమి. వినాలి అనుకుంటూ శరత్ చంద్ర వస్తాడు. భూమి షాక్‌ అవుతుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!