Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున కోసం తన తల్లి లలిత ఇంటికి వస్తుంది. మిథున చాలా సంతోషపడుతుంది. దేవా, సత్యమూర్తి ఆశ్చర్యంగా చూస్తారు. లలిత శారద ఒకర్ని ఒకరు వదిన అని పలకరించుకుంటారు. కాంతం సెటైర్లు వేస్తే నీ వాళ్లు ఎవరూ రావడం లేదు అనా తన మీద పడి ఏడుస్తున్నావ్ అని ప్రమోదిని అంటుంది.
సత్యమూర్తి: చూడండి అమ్మా మీరు మీ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్లకుండా పండగలకు పరామర్శలకు రావడం ఏం బాలేదు. లలిత: చూడండి అన్నయ్య మీ అబ్బాయి ఎప్పుడైతే తన మెడలో తాళి కట్టాడో అప్పుడే నా కూతురు ఈ ఇంటి కోడలు అయింది. సత్యమూర్తి: ఏంటమ్మా మీరు మీ అమ్మాయి బంగారం లాంటి భవిష్యత్ ఉందని నచ్చచెప్పి తీసుకెళ్లకుండా మీరు మీ అమ్మాయిలా మూర్ఖంగా మాట్లాడుతారు ఏంటి.లలిత: అన్నయ్య నా కూతురు దేవానే తన భర్త అని నమ్ముతుంది. అందుకే తనకు నచ్చిన జీవితం ఇస్తే జీవితాంతం సంతోషంగా ఉంటుంది. అదే తనకు నచ్చని జీవితం ఇస్తే జీవితాంతం బాధ పడుతుంది. సత్యమూర్తి: చూడండి వాడితో జీవితం అంటేనే నరకం మీ అమ్మాయి కూడా ప్రస్తుతం ఆ నరకంలో ఉంది మీరు అది అర్థం చేసుకోవడం లేదు.లలిత: ఆ నరకం నా కూతురు నందనవనంలా మార్చుకుంటుంది.దేవా: అమ్మ మీ కూతురు ఇక్కడ ఉండటం మాకు ఎవరికీ ఇష్టం లేదు. మీ కొటేషన్లు ఆపేసి దయచేసి మీరు తనని తీసుకెళ్లిపోండి.లలిత: బాబు మీరు దేవుడి సాక్షిగా భార్యాభర్తలు అయ్యారు. ఎవరు కాదు అన్నా అవును అన్నా తను నచ్చినా నచ్చకపోయినా తను తనభర్తతో అత్తారింట్లో ఉంటుంది. అందుకే మా అమ్మాయికి సాంప్రదాయబద్ధంగా నల్లపూసలు గుచ్చే కార్యక్రమం చేపడతాం.సత్యమూర్తి: ఏంటి తనకు నల్లపూసల తంతు చేస్తారా.లలిత: అవును అన్నయ్య ఇలా పెళ్లి అయిన అమ్మాయిని పసుపు తాడుతో ఉంచడం మంచిది కాదు. అందుకే ఇలా వచ్చాను.సత్యమూర్తి: ఏమ్మా ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా. అసలు వాళ్లకి జరిగింది పెళ్లే కాదు. వాడు బంగారం లాంటి ఆ అమ్మాయికి భర్తగా సరిపోడు.లలిత: వాళ్లకు కచ్చితంగా జరిగింది పెళ్లి. తను మీ కోడలు మీరే నల్లపూసలు తంతు జరిపించాలి. మా కూతురు అలా చాలా రోజులుగా తాడుతో ఉండటం మాకు చూడటానికి బాధగా ఉంది. అలా ఉండటం మన రెండు కుటుంబాలకు అరిష్టం అర్థం చేసుకోండి.సత్యమూర్తి: వాడు నా కడుపున పుట్టడమే అరిష్టం అంతకు మించి ఏం జరగదు వెళ్లండి. ఈ అమ్మాయి స్థానంలో నా కూతురు ఉండి ఉంటే ఎప్పుడో తనని నచ్చచెప్పేవాడిని మీలా కాదు.లలిత: నల్లపూసలు సౌభాగ్యానికి సంబంధించినవి. నా కూతురి సౌభాగ్యం కోసం ఆలోచించండి.శారద: ఏవండీ మిథున సౌభాగ్యం అంటే మన దేవా ప్రాణం అండీ. వాడికి ఏమైనా అయితే మనం తట్టుకోలేం అండీ. అందుకే నల్ల పూసలు..సత్యమూర్తి: శారద.. ఇప్పటి వరకు ఆ అమ్మాయి విషయంలో నీకు నచ్చినట్లే చేశావ్ ఇది మాత్రం జరగదు. వాళ్లని పంపేయ్.లలిత: వదిన ఒక ఆడపిల్ల సౌభాగ్యం గురించి ఆలోచిస్తారు అనుకున్నా. అన్నయ్య గారు కొడుకు మీద కోపంతో ఉన్నారు. మీరు అయినా ఆయనకు చెప్పి నచ్చచెప్పండి లేదంటే ఏ రూపంలో అయినా అశుభం రావొచ్చు. ఏర్పాట్లు చేసి కబురు చేస్తారు అని నమ్మకంతో ఉంటాను.
కాంతం ప్రమోదినితో అత్తయ్యగారు మిథునకు నల్లపూసల తంతు చేస్తాను అంటారా అని గట్టిగా సమోసాలు తింటూ చిందులు తొక్కుతుంది. మిథున దేవా భార్య కదా అందులో తప్పేముంది అని ప్రమోదిని అంటుంది. దేవా మిథునని ఎలా అయినా పంపేయాలి లేదంటే ఆ తంతు ఈ తంతు అని తినేస్తున్నారని అనుకుంటాడు. ఇంతలో మిథున వచ్చి నిల్చొంటుంది. నా మెడలో తాళి కడితే సరిపోతుందా నల్లపూసలు వేయాలి అని తెలీదా అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ అని దేవా అంటాడు. నీ మెడలో కట్టిన తాళి వల్ల నా జీవితం యమపాశం అయింది. ఇప్పుడు ఆ నల్లపూసలు కూడా వేస్తే ఇక నా జీవితం అంతే. ఇప్పటికే ఒక కాలు ఊబిలో చిక్కుకుంది లాక్కోలేక పీక్కోలేక చస్తున్నా అంటాడు.
మిథున దేవాతో అందరి ముందు బుద్దిగా నువ్వు నా మెడలో నల్లపూసలు వేస్తావ్.. ఇది పక్కా గుర్తు పెట్టుకో అని అంటుంది. దేవా నవ్వుతాడు. నీ మనసులో నా మీద ఉన్న ప్రేమనే ఆ పని చేయిస్తుంది అని అంటుంది. బుర్ర లేకుండా మాట్లాడకు అని దేవా అంటాడు. శారద నల్లపూసలు వేయించాలి అప్పుడే మిథున కాపురం బాగుపడుతుంది అనుకుంటుంది. ఇంతలో కాంతం వచ్చి అత్తయ్య గారు మీతో సీరియస్‌గా మాట్లాడాలి అంటుంది. నా బాధలో నేను ఉంటే నీ గోల ఏంటి అని శారద అడుగుతుంది. దాంతో కాంతం మిథునకు నల్లపూసల కార్యక్రమం జరగకూడదు ఇది తిరుగుబాటు తనకు ఆ నల్లపూసల తంతు జరిగితే సహించేది లేదు అని అంటుంది.
శారద సీరియస్‌గా కోడలికి థ్యాంక్స్ చెప్పి నీ ఆవేశం వల్ల నాకు ధైర్యం వచ్చింది. నీ ధైర్యం చూసిన తర్వాత నేను వెళ్లి మీ మామయ్యతో మాట్లాడుతా అని కాంతాన్ని ఇమిటేట్ చేసి వెళ్తుంది. నాకు నేనే గోతి తవ్వుకున్నా అని కాంతం నెత్తి కొట్టుకుంటుంది. మిథున సత్యమూర్తి దగ్గరకు వెళ్లి మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. మామయ్య మీకు నా మీద వ్యక్తిగతంగా కోపంలేదు. నా మంచి కోరుకునేవాళ్లే మీరు నిజంగా నా మంచి కోరితే నాకు ఈ నల్లపూసల కార్యక్రమం జరిపించండి అని అంటుంది. సత్యమూర్తి కసురుకొని వెళ్లు అని అంటాడు. మామయ్య కన్నవాళ్లు పిల్లల క్షేమం కోరుకుంటారు కదా మీరు కూడా దేవా మంచి కోరి నల్లపూసల తంతు జరిపించండి అని అంటుంది. పెద్దమనసుతో ఆలోచించండి అంటుంది. ఈ తంతు జరగదు అని సత్యమూర్తి అంటే శారద జరుగుతుంది అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథునని ఎవరు ఏం అన్నా తట్టుకోలేనమ్మా.. ప్రేమ బయట పెట్టేసిన దేవా!