Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్ రిపోర్ట్స్ చూసి రుక్మిణి తన కూతురు కాదని విరూపాక్షి, రుక్మిణిని గెంటేసినట్లు విజయాంబిక, దీపక్ కల కంటారు. తీరా చూస్తే ఇదంతా కల అనా నోరెళ్ల బెడతారు. సూర్యప్రతాప్‌ని రిపోర్ట్స్ చూడమని అంటారు. సూర్యప్రతాప్ డాక్టర్‌ని పంపేస్తారు. సూర్యప్రతాప్ రిపోర్ట్స్ చూస్తుంటే విరూపాక్షి తనని కాపాడమని దేవుణ్ని కోరుకుంటుంది.
సూర్యప్రతాప్ రిపోర్ట్స్ పట్టుకొని రూపని గుర్తు చేసుకొని రుక్మిణి కూడా తన మనవడిని కాపాడటం గుర్తు చేసుకొని రిపోర్ట్స్ చింపేస్తాడు. విజయాంబిక, దీపక్‌లు షాక్ అయిపోతారు. రుక్మిణి ప్రేమలోనూ ప్రవర్తనలోనూ ఎలా చూసిన తనకు రుక్మిణిలో రూప కనిపిస్తుందని తన ఆలోచనల్లో రుక్మిణి రూప కాకపోయినా తన మనసు తన అంతరాత్మ రుక్మిణి రూప అని చెప్తుంది అని సూర్యప్రతాప్ చెప్తారు. రాజు వాళ్లు చాలా హ్యాపీగా ఫీలవుతారు. రుక్మిణి రూప లేని లోటు తీర్చిందని రుక్మిణిని అవమానించి గెంటేస్తే చనిపోయిన తన కూతురు కూడా క్షమించదు అని తన మనస్సాక్షిని నమ్ముతాను అని చెప్పి రుక్మిణితో ఈ రోజు నుంచి నువ్వు నా కూతురి హోదాలో నా ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్తారు.
రుక్మిణి తండ్రిని వాటేసుకుంటుంది. బంటీ కూడా మా అమ్మ నాతోనే ఉంటుంది అని గెంతులేస్తాడు. సూర్యప్రతాప్ రుక్మిణిలా ఉన్న రూపని దగ్గరకు తీసుకుంటాడు. రూప చాలా సంతోషిస్తుంది. బంటీ తాతయ్యని హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్తాడు. చంద్ర రుక్మిణితో నువ్వు మా అన్నయ్యకి కూతురి అయితే నాకు కూతురే అని అంటాడు. ఇక సుమ కూడా నువ్వు మా ఇంటి బిడ్డవే అంటుంది. రాజు రుక్మిణితో ఇక నుంచి నువ్వు మా చిన్నమ్మాయిగారు అని అంటాడు. విరూపాక్షి విజయాంబిక వాళ్లని చూసి కొన్ని పాపిష్టి కళ్లు పడుంటాయి దిష్టి తీస్తాను అని రూపని దిష్టి తీస్తుంది.
రుక్మిణి రాజుతో నాన్న నన్ను ఇంట్లో ఉండమని చెప్తారు కాబట్టి రాఘవని ఇంటికి తీసుకురావాలి అంటుంది. దాంతో రాజు మన ప్లాన్ అమలు చేద్దాం అంటాడు. మరోవైపు తల్లీకొడుకులు రుక్మిణి పీడ విరగడ అయ్యేలా చేయాలి అనుకుంటారు. ఇంతలో రుక్మిణి పేరు మీద పోస్ట్ వస్తుంది. అదంతా రాజు, రూపల ప్లానే.. విజయాంబికలు వాళ్లు చూసేలా రుక్మిణి ఆ పోస్ట్ తీసుకొని ఎవరైనా చూస్తే అని కావాలనే భయంగా కంగారుగా వాటిని తీసుకొని గదికి పరుగులు తీస్తుంది. విజయాంబిక వాళ్లు ఆ పోస్ట్‌లో ఏదో ఉందని రుక్మిణిని ఫాలో అవుతారు.
రుక్మిణి కావాలనే వాటిని కింద పడేస్తుంది. ఆ పోస్ట్‌లో ఎవరో ఆనంద్ అనే అబ్బాయితో రుక్మిణి ఫోటోలు ఉంటాయి. కావాలనే ఆనంద్‌కి కాల్ చేసి ఆనంద్ నన్ను ఆనందంగా ఉండనివ్వవా మన ఇద్దరి ఫొటోలు డిలీట్ చేయమని చెప్పాను కదా నీకు నాకు సెట్ అవ్వదు అని మాట్లాడుతుంది. విజయాంబిక వాళ్లు చూసి రుక్మిణికి ఎవరో లవర్ ఉన్నాడు అనుకుంటారు. వాడు ఎవడో తెలుసుకోవాలి అనుకుంటారు. ఆనంద్‌గా రాజు మాట్లాడుతాడు. నువ్వు నా పెళ్లానివి అమ్మి అంటూ మాట్లాడుతాడు. మా నాయన చెప్పినోడినే పెళ్లి చేసుకుంటా అని రుక్మిణి తిడుతుంది. ఇక రుక్మిణి ఎవరూ చూడకుండా ఫొటోలు దాయాలి అంటూ దాస్తుంది. విజయాంబిక వాళ్లు తర్వాత వెళ్తారు. ఆ ఫొటోలు చూస్తారు. రూప, రాజులు వాళ్లని ఫాలో అవుతారు. ఇద్దరూ లవర్స్ అని అనుకుంటారు. తల్లీకొడుకుల మాటలు విని నవ్వుకుంటారు.
విజయాంబిక ఈ ఆనంద్‌కి ఇచ్చి పెళ్లి చేస్తే బయటకు పంపేయొచ్చు అప్పుడు ఆస్తి మనదే అని అనుకుంటుంది. దానికి దీపక్ రుక్మిణిని మామయ్య ఆంగీకరించారు కదా ఆస్తి ఇచ్చేస్తారు అని అంటే ఆనంద్‌ని రుక్మిణి ద్వేషిస్తుంది కాబట్టి ఆనంద్ వైపు నుంచి మాట్లాడి వాడితో ఆస్తి కొట్టేద్దాం అనుకుంటారు. ఆనంద్ పేరుతో వచ్చిన అడ్రస్‌కి పరుగులు తీస్తారు. అక్కడ ఆనంద్ మిషన్ తొక్కుతూ ఉంటాడు. ఆనంద్ వాళ్లని చూసి రాజు చెప్పిన గుంట నక్కలు వీళ్లేనా వీళ్ల పని పడతా అని అంటాడు. ఆనంద్ వాళ్లని చూసి మీకు కొలతలు తీసుకోవాలా మీ తమ్ముడి కొలతలు తీసుకోవాలా అని అంటాడు. విజయాంబిక వయసు తక్కువ అని చెప్పడంతో తెగ సిగ్గు పడిపోతుంది.
దీపక్ రుక్మిణి గురించి ఆనంద్ గురించి అడుగుతాడు. రుక్మిణి నీకు ఎలా తెలుసు అని అడిగితే ఆనంద్ కోర్టు సినిమా స్టోరీ చెప్తాడు. ఇద్దరూ నిజం అని నమ్మేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథునని ఎవరు ఏం అన్నా తట్టుకోలేనమ్మా.. ప్రేమ బయట పెట్టేసిన దేవా!