Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీకి విహారి అన్నీ కంపెనీల బాధ్యతలు అప్పగిస్తాడు. లక్ష్మీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న వెంటనే కంపెనీని వెన్నుపోటు పొడుస్తున్న వాళ్లని ఏరివేసే పని పెట్టుకున్నానని అంటుంది. అందుకు సంబంధించి తమ కంపెనీ వర్క్ ఇవ్వని ప్రొడక్ట్ ఇవ్వని కొన్ని కంపెనీలు పేర్లు చూపించి వాటికి తమ కంపెనీ నుంచి కోట్లు అకౌంట్‌లో పడ్డాయని అది అంతా అంబిక మేడం చేసింది అని మనల్ని మోసం చేసింది అంబికనే అని అందరి ముందు చెప్తుంది.
విహారితో పాటు అందరూ షాక్ అయిపోతారు. నాకేం తెలీదు అని అంబిక అంటే సాక్ష్యాలు కూడా విహారికి లక్ష్మీ చూపిస్తుంది. అవి చూసిన తర్వాత విహారి అంబికను సీరియస్‌గా చూస్తాడు. అంబిక ఏదో చెప్పబోతే మాట్లాడొద్దు అత్తయ్య నువ్వు తప్పు చేశావ్ అని సాక్ష్యాలు ఉన్నాయి. మన కంపెనీలో నువ్వు అవినీతి చేయడం ఏంటి అత్తయ్యా అని అంటాడు. మన కంపెనీనే కాదు కుటుంబాన్ని మోసం చేశావ్ అవసరం అని చెప్తే నేను ఎంత డబ్బు అయినా అడగకుండా ఇచ్చేవాడిని కదా అని అంటాడు. అంబిక మనసులో నువ్వు నాకు ఇవ్వడం ఏంట్రా అనుకుంటుంది. విహారితో టైం ఇస్తే ఆ డబ్బు కట్టేస్తా అంటుంది. మోసం బయట పడిన తర్వాత కడతా అంటే ఎలా సహిస్తా అత్తయ్య కంపెనీ ఎవరికైనా ఒకటే. నువ్వు చేసిన పనికి నీకు చట్ట పరంగా శిక్ష పడాలి అని అంటాడు. అంబిక వద్దని చెప్తుంది. అయినా విహారి వినకుండా పోలీసులకు ఫోన్ చేస్తాడు.
పోలీసులు వచ్చి అంబికను అరెస్ట్ చేస్తారు. అంబిక ఎంత బతిమాలినా విహారి వినడు. లక్ష్మీ అంబికతో ఆ రోజే చెప్పాను మారమని వినలేదు ఇప్పుడు శిక్ష అనుభవించండి అంటుంది. పోలీసలు అంబికను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అంబిక కంగారు పడి నిద్రలో నుంచి చేస్తుంది. ఇదంతా కలనా ఆ లక్ష్మీ ఎండీ అయితే నన్ను వదలదు ఎలా అయినా సహస్రని ఎండీని చేయాలి అనుకుంటుంది. ఉదయం విహారి నానమ్మ అందరితో ప్రాజెక్ట్ కోసం చెప్తాడు. అందరూ ఇంట్లో ఉండి చూడొచ్చు లైవ్ ప్రజెంట్ చేస్తున్నాం అని చెప్తాడు. సహస్ర, లక్ష్మీలను తర్వాత రమ్మని చెప్తాడు. అంబిక సహస్రని తీసుకొని పక్కకు వెళ్తుంది. అంతా రెడీగా ఉన్నావా ప్రజంటేషన్‌కి రెడీ అయ్యావా అని అడుగుతుంది. నేను రెడీ అయ్యాను కానీ లక్ష్మీని తక్కువ అంచనా వేయకూడదు అని అంటుంది.
అంబిక సహస్రతో ఆ లక్ష్మీని రాకుండా నేను చేస్తాను. నువ్వు మాత్రం చక్కగా ప్రపరేషన్ అవ్వు అని అంటుంది. సహస్ర ఎండీ అయితే తన ఆటలు సాగుతాయి అని అంబిక అనుకుంటుంది. లక్ష్మీని ఆపడానికి రౌడీని కాల్ చేసి లక్ష్మీ ఆఫీస్‌కి రాకుండా చూసుకోమని చెప్తుంది. ఆ మాటలు చారుకేశవ చాటుగా వింటాడు. లక్ష్మీ గుడికి వెళ్తుంది. దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇక సహస్ర ఆటో డ్రైవర్‌కి లక్ష్మీ ఫొటో చూపించి గుడిలో నుంచి వచ్చి నీ ఆటో ఎక్కుతుంది. తనని ఎక్కించుకొని రాంగ్ అడ్రస్ తీసుకెళ్లి మొత్తం సిటీ తిప్పేయ్ కానీ తనని వదలొద్దు అని అంటుంది. అందుకు ఆ ఆటో డ్రైవర్‌కి డబ్బులు ఇస్తుంది. తర్వాత సహస్ర లక్ష్మీని కలుస్తుంది. నా మీద గెలిచేయాలి అనుకుంటున్నావా అని అంటుంది. నువ్వు ఎంత పోరాడినా ఆరాట పడినా నేనే ఈ రోజు గెలుస్తా అని సహస్ర అంటుంది. ఎండీ నా సీట్ అని అవసరం అయితే నీకు స్వీపర్ పని ఇస్తాను అని సహస్ర అంటుంది.
సహస్ర వెళ్లిపోయిన తర్వాత లక్ష్మీ ఆటోలో బయల్దేరుతుంది. చారుకేశవ ఇంకా ఆఫీస్‌కి విహారి వాళ్లు రాలేదని కాల్ చేసి చెప్తాడు. క్లైంట్స్‌ని రిసీవ్ చేసుకొని కాన్ఫిరెన్స్ హాల్‌లో పెట్టమని విహారి చారుకేశవతో చెప్తాడు. క్లైంట్స్ రావడంతో చారుకేశవ రిసీవ్ చేసుకుంటాడు. ఇంట్లో అందరూ టీవీ వేసుకొని లైవ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. విహారి ఆఫీస్‌కి వస్తాడు. లక్ష్మీ, సహస్ర గురించి అడుగుతాడు. క్లైంట్స్ ప్రజంటేషన్ మొదలు పెట్టమని అంటారు. అందరూ కంగారుపడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథునని ఎవరు ఏం అన్నా తట్టుకోలేనమ్మా.. ప్రేమ బయట పెట్టేసిన దేవా!