Brahmamudi Serial Today Episode: రిసార్ట్ కు రాజ్‌తో కలిసి వెళ్తున్న యామిని రొమాంటిక్‌గా మాట్లాడుతుంది. రాజ్‌ పలకుండా డ్రైవింగ్‌ చేస్తుంటాడు. దీంతో ఏంటి బావ నువ్వేం మాట్లాడటం లేదు అని అడుగుతుంది. అయినా రాజ్‌ పలకడు.

యామిని: నీకు మాట్లాడటం ఇష్టం లేకపోతే ఏమీ మాట్లాడద్దులే బావ

రాజ్‌: నువ్వు చెప్పింది నిజమే యామిని నాకు కూడా కళావతి గారితో మాట్లాడుతుంటే నా మాటలకు పులిస్టాప్‌ ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే నా గుండె నా కోసం కళావతి గారి కోసమే కొట్టుకుంటుంది అనిపిస్తుంది. చెప్పేస్తాను. కళావతి గారు రిసార్ట్‌ కు రాగానే నా గుండెల్లో ఉన్నది నువ్వే అని చెప్పి నా మనసులోని ప్రేమను కళావతి గారికి ఎక్స్‌ప్రెస్‌ చేసి తన ప్రేమను గెలుచుకుంటాను. తను నా హర్ట్‌లో బంధించి లవ్‌లప్‌ చేసేస్తాను. (మనసులో అనుకుంటాడు.)

యామిని:  లేదు బావ నిన్ను ఎలాగైనా  ఆ కావ్యకు దగ్గర కానివ్వను ఏది ఏమైనా సరే నిన్ను ఈరోజు పూర్తిగా నా సొంతం చేసుకుని ఆ కావ్య మళ్లీ నీ జీవితంలోకి రాకుండా చేస్తాను. (మనసులో అనుకుంటుంది.)

రాహుల్‌ రోల్డ్‌ గోల్డ్‌ నగలు స్వప్న లాకర్‌లో పెట్టడానికి ట్రై చేస్తుంటే.. స్వప్న వస్తుంది.

స్వప్న: నా లాకర్ దగ్గర ఏం చేస్తున్నావు రాహుల్‌.

రాహుల్‌: పవర్‌ బ్యాంక్‌ కోసం వెతుకుతున్నాను

స్వప్న: నీ పవర్‌ బ్యాంక్‌ నా లాకర్ లో ఎందుకు ఉంటుంది. నిన్ను చూస్తుటే ఎందుకో డౌటుగా ఉంది.

రాహుల్‌:  నీ మీద ఒట్టు స్వప్న నీ ముందు మళ్లీ మళ్లీ కుప్పిగంతలు వేస్తానా..?

స్వప్న సరే అంటూ వెళ్లిపోతుంది. ఇంతలో రుద్రాణి వచ్చి రాహుల్‌ను తిడుతుంది.

రుద్రాణి: ఏం చేస్తున్నావురా

రాహుల్‌:  ఏం లేదు మమ్మీ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను

రుద్రాణి: నిన్ను చూస్తుంటే అలా కనిపించడం లేదు. దొంగలా బిహేవ్‌ చేస్తున్నావు నీ బాడీ లాంగ్వేజ్‌ కూడా అలాగే ఉంది

అంటూ తిట్టగానే రాహుల్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు రిసార్ట్‌ కు వెళ్లాక రూంలో రాజ్‌ చేయి తీసుకుని యామిని రొమాంటిక్‌గా మాట్లాడుతుంది.

యామిని: బావ ఎలాంటి కపుల్స్‌ కు అయినా వాళ్ల లైఫ్‌ పెళ్లి అయ్యాక స్టార్ట్‌ అవుతుంది. కానీ మనం మాత్రం పెళ్లికి ముందే మన లైఫ్‌ని మొదలు పెడదాం బావ. ఈ టూడేస్‌ నీతో గడిపే ప్రతిక్షణం నాకు లైఫ్‌లాంగ్‌ గుర్తిండిపోవాలి బావ.

రాజ్‌ అదోలా చూస్తుంటాడు.

యామిని: ఏమైంది బావ నేను దగ్గరకు వచ్చే సరికి నీకు రొమాంటిక్‌ ఫీలింగ్స్‌ వస్తున్నాయా..?

రాజ్‌:  కాదు నా లిమిట్స్‌ నాకు గుర్తుకు వస్తున్నాయి

యామిని: కమాన్‌ బావ మన మధ్య లిమిట్స్ ఏంటి..?  చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. పైగా మనల్ని పంపించింది మా మామ్‌ డాడే కదా

రాజ్‌: నేను అదే చెప్తున్నాను.. వాళ్లు మనల్ని నమ్మి పంపించినప్పుడు వాళ్ల నమ్మకాన్ని మోసం చేయకూడదు కదా

యామిని:  మనం కాబోయే భార్యభర్తలమే కదా బావ

రాజ్: కానీ ఇంకా పెళ్లి అయితే కాలేదు కదా

యామిని: అది ఎలాగూ అవుతుంది.

అని చెప్తూ..  రాజ్‌ మీదకు వెళ్తుంటే రాజ్‌ అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు. అప్పుడే కావ్య రిసార్ట్‌కు వస్తుంది. కావ్యను చూసిన హ్యపీగా కిందకు వెళ్తాడు. కావ్యతో మాట్లాడుతుంటాడు ఇంతలో యామిని కిందకు వస్తుంది. యామినిని చూసిన రాజ్‌ కావ్యను తీసుకుని అక్కడి నుంచి రూంలోకి వెళ్తాడు. మరోవైపు లంచ్‌ బాక్స్‌ రెడీ చేస్తున్న అప్పు దగ్గరకు వెళ్లి తిడుతుంది ధాన్యలక్ష్మీ. ఇంతలో అక్కడకు వచ్చిన ప్రకాష్‌ కోపంగా ధాన్యలక్ష్మీని తిట్టడంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు రూంలో కావ్యకు ఎలాగైనా తన లవ్‌ విషయం చెప్పాలని రాజ్‌ ట్రై చేస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!