Meghasandesam Serial Today Episode: లోపలికి వచ్చిన గగన్‌ను ఫోన్‌ ఇవ్వు అని అడుగుతుంది సుజాత. తన ఫోన్‌ ఎక్కడో పడిపోయిందని అంటాడు గగన్‌. చేసిందంతా చేసి ఇప్పుడు అమాయకుడిగా మాట్లాడుతున్నావా..? నా కూతురు నక్షత్ర డ్రెస్‌ చేంజ్‌ చేసుకుంటుంటే ఫోటోలు తీసి ఇప్పుడు ఫోన్‌ కనిపించడం లేదు అంటూ నాటకాలు ఆడుతున్నావా..? అంటుంది. దీంతో గగన్‌ కోపంగా అపూర్వను తిడతాడు. శరత్‌ చంద్ర.. గగన్‌ను తిడతాడు. ఇంతలో మినిస్టర్‌ ఇద్దరిని ఆపి గగన్‌ నీ క్యారెక్టర్‌ ప్రూవ్‌ చేసుకోవాలంటే నీ ఫోన్‌ ఇవ్వు అంటాడు. నా దగ్గర లేదు అంటాడు గగన్‌. అయితే ఇలంతా వెతుకండి అని శరత్ చంద్ర చెప్తాడు. ఇంతలో భూమికి గాయత్రి ఫోటోలు తీసిన విషయం గుర్తుకు వచ్చి గాయత్రిని పక్కకు తీసుకెళ్లి కొడుతుంది. వెంటనే గాయత్రి జరిగింది చెప్తుంది. భూమి వెంటనే గగన్‌ను తాను భోజనం తినిపించిన దగ్గరకు వెళ్లి గగన్‌ ఫోన్‌ తీసుకుని ఫోటోలు డిలీట్‌ చేయాలని చూస్తుంది లాక్‌ ఉండటంతో ఫోన్‌ ఓపెన్‌ కాదు. ఇంతలో సుజాత వచ్చి అందరినీ పిలుస్తుంది. అందరూ రావడం చూసిన భూమి గగన ఫోన్‌ పగులగొడుతుంది.


గగన్‌: భూమి ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా..? అది నా హానెస్టీని ఫ్రూవ్‌ చేసుకునే ఫోన్‌.


భూమి: మా అంకుల మాట జవదాటను అని నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవడానకి ఈ పని చేశాను.


గగన్‌: భూమి నీకేమైనా పిచ్చా..


శరత్‌: రేయ్‌ గగన్‌ మాటలు జాగ్రత్తగా రాని.. భూమి నాకు ఎంత ఇంపార్టెంటో ఇక్కడున్న అందరికీ తెలుసు. తనను పట్టుకుని పిచ్చి గిచ్చి అన్నావో బాగుండదు.


గగన్‌: మీరంతా కలిసి నా మీద నింద వేశారు. ఆ నింద నిజం కాదని ప్రూవ్‌ చేయడానికి ఆ ఫోన్‌ ఒక్కటే సాక్ష్యం.


శరత్‌: అడితే పద్దతిలో అడుగు. భూమి ఏం చేసినా దాని వెనక ఒక కారణం ఉంటుంది.


సుజాత: అల్లుడు గారు.. భూమి మీద మీకున్న ప్రేమో గుడ్డి నమ్మకమో భూమి ఏం చేసినా  కరెక్టు అనిపించేలా చేస్తున్నాయి. ఈ అబ్బాయి నక్షత్ర ఫోటోలు తీస్తే భూమి గగన్‌ను రక్షిస్తుందని మీకు ఎందుకు అనిపించడం లేదు.


అపూర్వ: పిన్ని చెప్తుంది కూడా కరెక్టే అనిపిస్తుంది బావ. ఎంతైనా భూమి ఆ ఇంటి నుంచే వచ్చింది కదా..?


శరత్: ఏమ్మా వీళ్లు చెప్తుంది నిజమేనా..? ఇంకా నీకు ఆ ఇంటి మీద ప్రేమ వదల్లేదా..?


భూమి: వదిలి ఉండకపోతే నేను ఆఫోన్‌ పగులగొట్టే దాన్నే కాదు అంకుల్‌. నక్షత్ర ఫోటోలు ఎవరో తీస్తున్నారు అన్నప్పుడు నేను, ఆయన బయటే ఉన్నాము. ఇదిగో ఈ గోరింటాకు పిన్నే సాక్ష్యం. చెప్పు పిన్ని మేము బయట ఉన్నామా లేదా..?


సుజాత: నేను గగన్‌ను పిలవడానికి వచ్చినప్పుడు మీరు బయటే ఉన్నారు.


భూమి: అప్పుడు మేము ఏం చేస్తున్నామో చెప్పు..


సుజాత: నేను నువ్వు ఆ అబ్బాయికి అన్నం తినిపిస్తున్నాడు అనుకున్నాను. కానీ నువ్వే తింటున్నావు అన్నావు.


భూమి: మనసులో ఏదో పెట్టుకుని నన్ను బ్యాడ్‌ చేస్తుంది ఈ పిన్ని..నువ్వు వచ్చే సరికి ఏం చేస్తున్నామో గుర్తు చేసుకుని చెప్పు.


సుజాత: నాకు ఏం గుర్తు రావడం లేదమ్మా.. నువ్వే చెప్పు నిజమో కాదో నేను చెప్తాను.


భూమి: నేను వద్దంటున్నా ఈయన నా ఫోటోలు తీశారు అంకుల్‌.


శరత్‌: రేయ్‌ వద్దంటున్నా భూమి ఫోటోలు ఎందుక తీశావురా..?


భూమి: చెప్పండి అంకుల్‌ అడుగుతుంటే అలా బెల్లం కొట్టిన రాయిలా ఎందుకు చూస్తున్నారు. మీరు చెప్పకపోతే సుజాత పిన్ని అయినా చెప్తుంది. నన్ను చూడాలని ఉంది అని కనీసం ఫోటోలయినా తీసుకురమ్మని శారద ఆంటీ చెప్పిందంట అంకుల్‌. అయినా మీరంతా నా గతం నేను మర్చిపోవాలనుకుంటున్నాను ఫోటోలు తీయోద్దని చెప్పాను. చెప్పినా వినకుండా ఫోటోలు తీశాడని ఆ ఫోన్‌ పగులగొట్టాను.


అని భూమి చెప్పగానే కావాలనే వాణ్ని సేవ్‌ చేయడానికే భూమి అలా చెప్తుందని అపూర్వ అంటుంది. దీంతో అపూర్వ దగ్గరకి వెళ్లి గాయత్రి విషయం చెప్తుంది భూమి. అపూర్వ వెంటనే భూమి చెప్పిందే కరెక్టు అంటుంది.  ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!