Ammayi garu Serial Today Episode ముత్యాలు, అప్పలనాయుడు అమ్మాయిగారు మందారం బిడ్డని బాగా చూసుకుంటుందని కొడుకుతో చెప్తారు. ఇక విరూపాక్షి మనసులో నిజంగానే రూప రాజు బిడ్డని పేద రక్తం, బస్తీ రక్తం అని ఫీలై ఉంటే రాజుని ప్రేమించదు కదా ఇలా పనిమనిషి అయిన మందారం బిడ్డను ఎలా ఇంత దగ్గరకు తీసుకుందని అనుకుంటుంది.
రాజు తల్లిదండ్రులతో కన్న బిడ్డని చంపుకోవాలి అనుకున్న మనిషి పరాయి బిడ్డని ఎలా చేరదీస్తారమ్మా ఇదంతా నటన అని చెప్తాడు. ఇంతలో అక్కడికి మందారం శవం కాల్చిన రోజు ఉన్న కాపరి అక్కడికి వచ్చి మందారం ఫొటో చూసి శవానికి నిప్పు పెట్టిన తర్వాత ఓ మనిషి ఆ శవాన్ని బయటకు తీయడం గుర్తు చేసుకొని ఈవిడకు తద్దినం పెడుతున్నారేంటి ఈవిడ బతికే ఉంది కదా అని అనుకంటాడు. ఆరోజు కాస్టికం మీద నుంచి బయటకు తీసిన మనిషి బతికే ఉందని వీళ్లకి తెలీదా అని అనుకుంటాడు. మందారం బతికే ఉందని చనిపోలేదని ఆయన వెళ్లి విజయాంబిక, దీపక్‌లకే చెప్పేస్తాడు. ఇద్దరూ షాక్ అవుతారు. సీన్ కట్ చేస్తే ఓ చోట మందారానికి వైద్యం జరుగుతుంటుంది. దీపక్ ఆ వ్యక్తి నిజం చెప్పకుండా పక్కకు తీసుకెళ్తాడు.
విజయాబింక: ఏయ్ ఏం మాట్లాడుతున్నావయ్య ఐదు ఆరేళ్ల క్రితం చనిపోయిన ఆమె బతకడం ఏంటి మా కళ్ల ముందే చనిపోయింది కదా.
కాటికాపరి: నేను నా కళ్లతో చూశాను. నేను కాటి కాపరిని. ఆమె చితికి నిప్పు పెట్టిన తర్వాత ఆమెలో కదలిక వచ్చింది దాంతో నేను ఆమెను కాపాడాను. ఇంతలో అక్కడికి ఒకాయన వచ్చి ఆమెను తీసుకెళ్లాడు.
రాజు మందారం బాడీకి నిప్పు పెట్టిన తర్వాత రాఘవ ఆమెను తీసుకెళ్తాడు. ఆ వ్యక్తి నిజం చెప్పడానికి వెళ్తే దీపక్ అడ్డుకుంటాడు. మేమే నిజం చెప్తామని ఆయన్ను పంపేస్తారు. మందారం ఎక్కడుంది? ప్రాణాలతో ఉంటే ఇంకా ఇంటికి రాలేదు ఏంటి? మందారాన్ని తీసుకెళ్లిన ఆ వ్యక్తి ఎవరు? అని తల్లీ కొడుకులు ఆలోచిస్తారు. మందారం గురించి ఎంక్వైరీ చేసి అది బతికే ఉంటే చంపేద్దామని అనుకుంటారు. మందారం ఆబ్దికం పూర్తయిపోతుంది. మందారం కొడుకు, రాజు వేరు వేరుగా పిండాలను చెరువులో వదులుతారు. ఇక రాజుని చూసిన రూప మనసులో రాజు నా చేయి వదిలేసిన నువ్వు మళ్లీ నా చేయి పట్టుకునేలా చేస్తానని అనుకుంటుంది. అందుకు కావాలనే నీటిలో పడిపోయినట్లు జారుతుంది. రాజు వచ్చి రూపని పట్టుకుంటాడు. ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటారు. రూప థ్యాంక్స్ చెప్తే ఈ పరిస్థితిలో ఎవరు ఉన్నా ఇలాగే రియాక్ట్ అయ్యేవాడిని అని అంటాడు. రూప మనసులో తొందర్లోనే నీలోని ప్రేమికుడిని బయటకు తీస్తా అనుకుంటుంది.
రాత్రి రాజు రూప పడిపోవడం తాను పట్టుకోవడం గుర్తు చేసుకుంటాడు. బంటీ రావడంతో పడుకోవడానికి తీసుకెళ్తాడు. ఇక దీపు రూపతో చాలా రోజుల తర్వాత నువ్వు సంతోషంగా కనిపిస్తున్నావు మమ్మీ అని అంటాడు. ఇద్దరూ పిల్లలకు కథలు చెప్తారు. రూప రాజు గురించి గొప్పగా చెప్తుంది. ఇక బంటీ మాత్రం రాజుకి రాణి లేదు నాన్న అని అంటాడు. అమ్మ గుర్తు రావడం లేదు కానీ నాన్నకి రాణి ఉండాలని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: క్షమించమని రాజుని అడిగిన రూప.. కఠినంగా మారిపోయిన రాజు.. మందారానికి ఆబ్దికం!