Meghasandesam Serial Today Episode:  నేను అడిగినట్టుగానే మా బావ నాకు కేక్‌ తినిపించాడు అని తన ఫ్రెండ్స్‌ కు చెప్తుంది నక్షత్ర. ఇంతలో గగన్‌ రావడంతో ఒక్క నిమిషం ఉండండి బావకు థాంక్స్‌ చెప్పి వస్తాను అని గగన్‌ దగ్గరకు వెళ్లి థాంక్స్ చెప్తుంది. దేనికి అని గగన్‌ అడగ్గానే.. నువ్వు నాకు కేక్‌ తినిపించావు కదా అందుకు అంటుంది. దీంతో నేను తినిపించలేదని పవర్‌ పోయినప్పుడు నీకు ఎవరో కేక్‌ తినిపించారు. ఒకవేళ ముద్దు పెట్టి ఉంటే అది నా ఖాతాలో వేసేదానివా అంటాడు. ఊరుకో బావా అంటూ ఏదేదో చెప్తుంటే.. ఇది ఒప్పుకోకపోతే వదిలేటట్టు లేదని అవును తినిపించాను అంటాడు గగన్‌. దూరం నుంచి గగన్‌ మాటలు విన్న సుజాత. షాకింగ్‌గా వెంటనే ఈ విషయం అమ్మాయికి చెప్పాలి అని అపూర్వ దగ్గరకు వెళ్తుంది.


సుజాత: అమ్మాయి.. ఇందాకా మీ అమ్మాయి తనకు తానే కేక్‌ తిన్నానని చెప్పింది కదా..? అది అబద్దం ఆ గగన్‌ గాడే తినిపించాడు.


అపూర్వ: ఏం మాట్లాడుతున్నావు పిన్ని..


సుజాత: నేను స్వయంగా నా కళ్లతో చూశాను. నా చెవులతో విన్నాను. వాడే కేక్‌ తినిపించానని నీ కూతురుతో చెప్తున్నాడు. ఇంతకంటే రుజువేం కావాలి అమ్మాయి.


అపూర్వ: చూస్తుంటే పరిస్తితి చేయి దాటిపోయేలా ఉంది పిన్ని.


సుజాత: నీకు అలా అనిపిస్తుందా..? ఎప్పుడో తప్పిపోతేనూ..


అపూర్వ: తప్పనివ్వను పిన్ని.. తప్పినా నా దారిలోకి తెచ్చుకుంటాను. వాడిని ఘోరంగా అవమానించి.. జీవితంలో నా కూతురుని చూడకుండా చేస్తాను.


 అని అందుకోసం తాను ఎలా ప్లాన్‌ చేసింది మొత్తం చెప్తుంది అపూర్వ. దీంతో కన్నకూతురు మీద ఇలాంటి ప్లాన్‌ ఎవరైనా చేస్తారా… అని సుజాత అడుగుతుంది. నా కూతురుని కాపాడుకోవడానికి నాకు ఇదొక్కటే దారి అంటుంది అపూర్వ. మరోవైపు చెర్రి హ్యాపీగా ఫీలవుతుంటే.. ఇందు, బిందు వచ్చి మాకు ఇంకా కన్పీజ్‌ గానే ఉందని మళ్లీ వెళ్లి కన్‌ఫం చేసుకుంటామని బిందు వెళ్లి భూమిని నీకు కేక్‌ తినిపించింది మా అన్నయ్యే కదా అని అడుగుతుంది. నీకెవరు చెప్పారు అని భూమి అడగ్గానే.. అయితే తినిపించింది మా అన్నయ్యే అంటావా..? అని బిందు హ్యాపీగా చెర్రి  దగ్గరకు వెళ్లి భూమి నిన్ను ప్రేమిస్తుందని చెప్తుంది. చెర్రి ఎగిరి గంతేస్తాడు. మరోవైపు అపూర్వ, నక్షత్ర ‌ఫ్రెండ్‌ను పిలిచి నక్షత్ర డ్రెస్‌ మార్చుకుంటుంటే.. గగన్‌ ఫోన్‌లో ఫోటో తీయాలి అని చెప్తుంది. డబ్బుల ఆశ చూపగానే ఆ ఫ్రెండ్‌ ఓకే అంటుంది. మరోవైపు గగన్‌ తన ఫోన్‌తో భూమి ఫోటోలు తీస్తుంటాడు.


భూమి: ఏం చేస్తున్నారు.


గగన్‌: కనబడటం లేదా..? నన్ను ప్రేమిస్తున్న అమ్మాయి ఫోటోలు తీస్తున్నాను.


భూమి: నేను ప్రేమిస్తున్నానని నీకు చెప్పానా…


గగన్: నేను చెప్పాను కదా.. నాకు అర్తం అయిపోయిందని..


భూమి: అయినా మీరు ఫోటోలు ఎందుకు తీస్తున్నారు.


గగన్‌: పదేపదే నువ్వు గుర్తుకు వస్తే ఇక్కడకు వచ్చి చూడటానికి ఇదేమన్నా మా అత్తారిల్లు అనుకున్నావా..?


భూమి: మీరు ఇలా చేస్తే.. నేను వెళ్లిపోతాను..


 అంటూ భూమి వెళ్లిపోతుంటే.. గగన్‌ ఫోటోలు తీస్తుంటాడు. నక్షత్ర ఫ్రెండ్‌ వచ్చి చూస్తుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!