Meghasandesam Serial Today Episode: భూమిని పోలీసులు తీసుకెళ్లాక అందరూ బాధపడుతుంటారు. అపూర్వ, సుజాత మాత్రం హ్యాపీగా ఫీలవుతుంటారు. ఇక శివ, పూరిల ఎంగేజ్‌మెంట్‌ వాయిదా పడుతుంది. ఇంతలో అపూర్వ మాత్రం తాను చేసిన పని గుర్తు చేసుకుంటుంది. ఇల్లు చూస్తున్న నెపంతో గగన్‌, భూమిల రూంలోకి వెళ్లి కప్‌బోర్డులో డ్రగ్స్‌ పెట్టడం తర్వాత ఎస్పీ సూర్యకు ఫోన్‌ చేయడం గుర్తు చేసుకుంటుంది.

Continues below advertisement

సూర్య: చెప్పండి మేడం..?

అపూర్వ:  మీరు చెప్పిన పని చేసేశాను. మీరు చేయాల్సిన పని ఇక మిగిలి ఉంది.

Continues below advertisement

సూర్య: ఆ బాక్స్‌ గగన్‌ ఇంటికి వెళ్లిపోయిందా…

అపూర్వ: వెళ్లిపోవడం కాదు. ఆ ఇంట్లోనే నేను ఉన్నాను. బాక్స్‌ను బాక్స్‌ లా పెట్టలేదు. గగన్‌, భూమిల బెడ్‌ రూంలో ఉన్న ఒక కప్‌బోర్డులో  భూమి బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగులో ఒక జ్యూవెల్లరీ బాక్స్‌ ఉంది. ఆ జ్యువెల్లరీ బాక్స్‌ లో మీరు ఇచ్చిన ప్యాకెట్స్‌ పెట్టాను.

సూర్య: వావ్‌ మీరు సూపర్ మేడం.. ఆ ఇంటికి వెళ్లే సందర్భాన్ని క్రియేట్‌ చేసి మరీ మీరా ప్యాకెట్‌ పెట్టారు అంటే మీది మామూలు బ్రెయిన్‌ కాదు.. క్రిమినల్‌ బ్రెయిన్‌.. నిజంగా మీరు సూపర్.. మీ బ్రెయిన్‌ సూపర్‌ మేడం

అపూర్వ: ఆగండి మిస్టర్‌ ఎస్పీ సూర్య గారు మరీ అంత పొగడకండి. ఇందులో నా క్రెడిట్‌ ఏమీ లేదు. వాళ్ల తమ్ముడి తరుపున తాంబూలాలు తీసుకోవడానికి రమ్మని భూమి తన గొయ్యి తనే తవ్వుకుంది. బావ రానన్నాడు. నేనే ఎలాగోలా రప్పించాను. సరే మరి త్వరగా పని మొదలు పెట్టండి. నిశ్చయ తాంబూలాలకు ఇక్కడ కార్యక్రమం మొదలై పోతుంది. సరే ఉంటాను

సూర్య: సరే మేడం నా పని నేను స్టార్ట్‌ చేస్తాను.

అంటూ కాల్ కట్‌ చేస్తాడు. సుజాత మాత్రం భూమి జువ్వెల్లరీ తన మెడలో వేసుకుని  హ్యాపీగా అపూర్వకు నగలు చూపిస్తుంది.

సుజాత: అమ్మాయి అమ్మాయి.. బాగుందా..?  

అని అడగ్గానే.. అపూర్వ కోపంగా చూస్తూ.. సుజాతను కొట్టబోతుంది. సుజాత భయంతో ఏమైంది అమ్మాయి అని అడుగుతుంది. నాకే అన్నావు కదా అంటుంది.

అపూర్వ: అయితే మాత్రం వేసేసుకుంటావా..?

సుజాత: అవును వేసుకుంటాను..

అపూర్వ: ఇలా వేసుకుని వెళితే దొరికిపోవా..? బుద్ది లేదు..

సుజాత: అమ్మాయి నాకు కాబోయే మా ఆయన ఇచ్చాడని చెప్తానే..

అపూర్వ: పో పిన్ని ఇప్పటిదాకా లేనిది ఇప్పటికిప్పుడు ఈ నగ ఎక్కడి నుంచి వస్తుంది నీకు .. తీయ్‌.. నోర్మూసుకుని తీయ్‌..

సుజాత: తీస్తున్నాను ఉండు.. తీస్తున్నాను..

అపూర్వ: దాచేయ్‌.. అక్కడ దాచేయ్‌..

అని అపూర్వ చెప్పగానే.. సుజాత తన దగ్గరే దాచేస్తుంది. ఇక ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్లిపోవడం అపూర్వ గుర్తు చేసుకుంటుంది. అందరూ భూమిని పోలీసులు పట్టుకెళ్లారని బాధతో ఉండగానే అక్కడికి కేపీ వస్తాడు. కేపీని చూసిన గగన్‌ కోపంగా తిడతాడు. తాను భూమి కోసం వచ్చానని భూమిని తీసుకెళ్లింది నిజమైన పోలీసులు కాదని వారంతా సూర్య మనుషులని చెప్తాడు. ఆ మాటలకు గగన్‌ కోపంగా సూర్య ఇంటికి వెళ్లి సూర్యను కొడుతుంటాడు. భూమి ఎక్కడని అడగ్గానే.. సూర్య తన ఫోన్‌లో వీడియో ఆన్‌ చేసి చూపిస్తాడు. అందులో భూమిని ఒక దగ్గర బంధించి కొట్టడం ఉంటుంది. ఆ వీడియో చూసిన గగన్‌ మరింత కోపంగా సూర్యను కొడుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!