Podharillu Serial Today Episode: చక్రి ఫస్ట్‌నైట్‌కు  అన్ని ఏర్పాట్లు చేసి తీసుకెళ్లి అతనికి చూపిస్తారు అన్నదమ్ముులు. మంచం నిండా మల్లెపూవులు,  అగరబత్తిలు వాసనలు, పండ్లు,స్వీట్లు తెచ్చిపెడతారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయని కేశవ్‌ చక్రిని అడుగుతాడు. అది చూసి చక్రి అదిరిపడతాడు. పెళ్లి అంటేనే అగ్గిమీద గుగ్గిలంలా మహా ఎగురుతోందని...ఇప్పుడు ఈ ఫస్ట్‌నైట్‌ అంటే ఇక నన్ను బతకనివ్వదని అనుకుంటాడు. వాడి ముఖం వాడిపోయినట్లు  ఉండేసరికి ఏమైందని మాధవ్ అంటాడు. ఇప్పుడు ఇవన్నీ వద్దు తీసివేయండని  చక్రి అనడంతో ఏమైందని వాళ్లు అడుగుతారు. భూషణ్‌తో పెళ్లి ఇష్టం లేక  మహా ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిందని....పోలీస్‌స్టేషన్‌లో  వాళ్ల నాన్నతో, అన్నతో పెద్ద గొడవ జరిగిందని చెబుతాడు. వాళ్ల కుటుంబాన్ని తను ఇక ఎప్పటికీ కలుసుకోలేదన్న  బాధలో తను ఉంటే....ఇప్పుడు  ఈఫస్ట్ నైట్‌ అంటే ఎలా అని అంటాడు.  చక్రి చెప్పిన దానిలో కూడా  నిజం ఉందని కేశవ్‌ అంటాడు. ఇప్పుడు తను ఉన్న బాధలో  ఇలాంటి ఏర్పాట్లు సరి కాదని అంటాడు.  తను చూసేసరికి ఇవన్నీ తీసివేయండని చెప్పి చక్రి వెళ్లిపోతాడు.                     అన్నదమ్ములంతా  పడుకోవడానికి చాప, దుప్పట్లు వేసుకుంటుంటే  మహా  అక్కడికి వస్తుంది. మాధవ్‌ఆమెను గదిలోకి తీసుకెళ్లమని చెప్పడంతో ఒక్కసారిగా  ఉలిక్కిపడుతుంది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుండగా....తటపటాయిస్తూనే   చక్రి ఆమెను గదిలోకి తీసుకెళ్తాడు. అక్కడ మల్లెపువ్వుల వాసన , పూలు చూసి ఏం  జరిగిందని  మహా నిలదీస్తుంది. మా వాళ్లు రూమ్‌ఫ్రెషనర్‌ కొట్టారని అబద్ధం చెబుతుంది. రేపు పొద్దున్నే నన్ను హాస్టల్‌లో దిగబెట్టాలని మహా హెచ్చరిస్తుంది. అలాగే మీ వాళ్లకు కూడా నిజం చెప్పమని చెబుతుంది. సరేనంటూ  చక్రి తలుపులు దగ్గరకు వేసి వెళ్లివాళ్ల  అన్నదమ్ముల మధ్య పడుకుంటాడు. తమ పక్కన ఎవరో ఉన్నారని మెలుకువ వచ్చిన కన్నా నిద్రలేచి అందరినీ నిద్రలేపుతాడు. చక్రిని చూసి నువ్వు ఎందుకురా ఇక్కడికి వచ్చి పడుకున్నావ్ అని వాళ్లు నిలదీస్తారు. తను చాలా బాధలో ఉందని...పైగా నిన్నటి నుంచి ఛేజింగ్‌లు, గొడవలతో అలసిపోయిందని  అందుకే ప్రశాంతంగా పడుకోమని చెప్పి వచ్చానని అబద్ధం చెబుతాడు. వాడు  చెప్పిన మాటలు  కేశవ్‌కు నమ్మబుద్ధి కాదు. నిజం చెప్పమని నిలదీస్తాడు. నిజంగా అదేనని చెబుతాడు. అసలు మీ లవ్‌స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యిందో చెప్పమని చిన్నా అడగడంతో  చక్రి అన్నీ అబద్ధాలు చెబుతాడు. తనను చూసి ఇష్టపడే భూషణ్‌తో  మహా పెళ్లి వద్దనుకుందని  చెబుతాడు. తను ఇష్టపడే నాతో వచ్చేసిందని అంటాడు. మీ అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకున్నాం కానీ....వాళ్ల నాన్న ఛేజింగ్‌తో పోలీసులు మా పెళ్లి చేశారని చెబుతాడు. వాళ్ల ఇంట్లో వాళ్లతో జరిగిన గొడవ కారణంగానే  తను కొంచెం నెర్వస్‌గా ఉందని...కొద్దిరోజుల తర్వాత అన్నీ సర్దుకుంటాయని అంటాడు.                             మహా గదిలో లైట్లు వెలుగుతుండటంతో చక్రి అక్కడికి వెళ్లి తలుపుతీస్తాడు. ఇంకా నిద్రపోలేదేంటని అడుగుతాడు.  తలుపుకి గొళ్లెం లేకుండా ఎలా పడుకుంటానని అంటుంది. ఐదుగురు మగవాళ్లు బయట ఉన్నప్పుడు  మీరు కొంచెం భయపడటంలో  తప్పులేదని....కాకపోతే మీరు నిశ్చింతగా పడుకోవచ్చని చెబుతాడు. మిమ్మల్ని ఇంట్లో నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అంతకన్నా జాగ్రత్తగా చూసుకుంటామని చెబుతాడు. బయట నలుగురు సెక్యూరిటీగార్డులు  ఉన్నారనుకుని  పడుకోమని చెబుతాడు.

Continues below advertisement

Continues below advertisement