Chinni Serial Today Episode నాగవల్లి మధులో నిన్ను నేను బాగా చూసుకుంటా కానీ కన్నీళ్లతో చూసుకుంటా.. ఆఫ్ టికెట్ నీ గురించి చెప్పేస్తాడు అనుకున్నా కానీ జస్ట్ మిస్.. లేదంటే నీకు కన్నీళ్లు నాకు ఆనంద్ భాష్పాలు వచ్చుండేవి అని అంటుంది. ఆఫ్ టికెట్‌తో మాట్లాడింది నేనే.. స్లిప్‌తో నిన్ను బయటకు రప్పించింది కూడా నేనే.. మ్యాడీ వాళ్ల డాడీ మీద మర్డర్ అటంప్ట్ చేయించింది కూడా నేనే.. ఇవన్నీ చేయించింది,, నిన్ను మ్యాడీతోనే బయటకు పంపించాలి అనుకున్నా ఇప్పుడు మిస్ అయింది కానీ ఎప్పుడూ మిస్ అవ్వదులే అని అంటుంది.
మధు ఆలోచనలో పడుతుంది. నాగవల్లి ఆంటీ ఎందుకు డైరెక్ట్‌గా చెప్పకుండా ఎందుకు ఇలా నాతో చెప్పించాలని చూస్తుంది. దేవా అంకుల్ మా నాన్నని ఎందుకు దాచేశాడు.. ఇద్దరి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.. తెలిసో తెలీకో పులి స్వారీ మొదలు పెట్టా అన్నీ తెలుసుకోవాలి అనుకుంటుంది. ఆఫ్ టికెట్‌కి తగిలిన గాయాలకు ఫ్రెండ్ మందు రాస్తాడు. చిన్నికి విషయం చెప్పేశా అని సంతోషంగా ఉందిరా.. దేవా గురించి మొత్తం చెప్పేస్తా అని భయపడి దేవా నన్ను పారిపోయేలా చేశాడు.. బాలరాజు అన్న ఎక్కడున్నాడో కూడా చిన్నినే తెలుసుకుంటుందని అంటాడు.
బాలరాజు దగ్గరకు దేవా వెళ్లి నిన్ను నీ కూతురు, ఆఫ్ టికెట్‌ని చంపేస్తారా.. నన్ను చంపించాలని నీ కూతురు ఆఫ్ టికెట్ గ్యాంగ్‌ని పంపింది.. నీ కూతురు నా గురించి నా ఫ్యామిలీకి తెలియాలి అనుకుంటుంది.. అది నా కంట పడితే స్పాట్‌లోనే చంపేస్తా అంటాడు. చిన్ని నీకు ఆ అవకాశం ఇవ్వదు దేవా అది బాలరాజు కూతురు.. చిన్నిలో ప్రవహిస్తుంది నా రక్తం కాబట్టి నీకు తగిన బుద్ధి చెప్పాలి అనుకుంటుంది. నా కూతురు వేట మొదలు పెట్టింది.. నీ నిజస్వరూపం ప్రపంచానికి తెలియాలి అని నీ మీద దండయాత్ర మొదలు పెట్టింది,, నన్ను కూడా కాపాడుతుంది అని అంటాడు. ఇద్దరినీ ఇక్కడే చంపేస్తా అని దేవా అంటాడు. ఆఫ్ టికెట్ గురించి కనుక్కోమని అంటాడు.
మ్యాడీ తండ్రి మీద జరిగిన అటాక్ గురించి తలచుకొని బాధ పడుతూ ఉంటాడు. మ్యాడీ మూడ్ మార్చాలి అని మధు అనుకుంటే నాకు సాయం చేస్తావా మధు అని మ్యాడీ అంటే నీ భార్యని ఏమైనా చేస్తా అంటుంది. నువ్వు నా పెళ్లాం కాదు నేను నీ మొగుడు కాదు,, మనం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అలా అని నువ్వు ఒప్పుకుంటావా.. ఒక్క 5 నిమిషాలు నాకు సాయం చేస్తావా అని అడుగుతాడు. మధు సరే అంటుంది. మా నాన్న మీద చిన్ని ఎందుకు దాడి చేయించింది అని అంటాడు. వాళ్లు దాడి చేయించలేదు అని ఆఫ్ టికెట్ ప్రమాణం చేశాడు.. కదా. మీ నాన్నకి పొలిటికల్ శత్రువులు ఉంటారు కదా వాళ్లలో ఎవరో అయింటారు అని అంటుంది.
చిన్ని నాతో ఏదో చెప్పాలి అని నా చుట్టూ తిరుగుతుంది కదా ఎందుకు చెప్పడం లేదు అని మ్యాడీ అంటే తనని నీ దగ్గరకు రాకుండా ఎవరో ఆపుతున్నారేమో అందుకే నీ దగ్గరకు రాలేకపోతుందేమో ఏం చెప్పలేకపోతుందేమో అని మధు అంటుంది. నాకు తెలిసి మీ అమ్మ చావుకి సంబంధించిన విషయం చిన్నికి తెలుసుంటుంది. మీ అమ్మని వాళ్ల అమ్మ చంపలేదు అనిపిస్తుంది. అది నిరూపించడానికి చిన్ని ప్రయత్నిస్తుందని అనిపిస్తుంది. చిన్ని దగ్గర మీ అమ్మ సంబంధించిన ఏదో ఉంటుంది. నువ్వు చిన్నిని ప్రేమించిన విషయం మనకి తెలుసు కానీ చిన్నీకి తెలీదు కదా.. గుడిలో మన పెళ్లి అయిన విషయం కూడా తెలుసుంటుంది కదా.. సో నీకు ప్రేమ గురించి చెప్పే అవసరం తనకు లేదు నిజాలు చెప్పాలనే తిరుగుతూ ఉంటుంది అని అంటుంది. మ్యాడీ మధుకి థ్యాంక్స్ చెప్పి హగ్ చేసుకుంటాడు.
దేవాతో నాగవల్లి ఆఫ్ టికెట్‌ని ఎందుకు వదిలేశావ్ వాడి వల్ల అన్నీ నిజాలు తెలిసేవి కదా అంటుంది. దేవా మనసులో పార్వతిని చంపింది నేను అని చెప్పేస్తాడని వదిలేశా అనుకుంటాడు. వాడు ఏమైనా అబద్ధం చెప్పి మనల్ని ట్రాప్ చేసేవాడు అందుకే వదిలేశా అంటాడు. నాగవల్లి మనసులో చిన్ని మన ఇంట్లోనే ఉంది వాడి వల్ల దొరికిపోయేది మ్యాడీ గెంటేస్తాడు అనుకుంటే ఇలా అయిపోయిందని అనుకుంటుంది.
మధు ఆఫ్ టికెట్‌ని కలుస్తుంది. దేవా గురించి అడుగుతుంది. ఎందుకు ఇలా చేశాడో నాకు తెలీదు అని ఆఫ్ టికెట్ అనిపిస్తుంది. అన్ని కారణాలు మనకు తెలియాలి అంటే మీ నాన్న బయటకు రావాలి అని ఆఫ్ టికెట్ అంటాడు. నాన్నకి అంకుల్‌కి గొడవలు ఏంటి అని మధు అడిగితే తెలీదు అని ఆఫ్ టికెట్ అనేస్తాడు. మ్యాడీ అప్ సెట్‌లో ఉన్నాడని పండగ పేరుతో మా ఇంటికి తీసుకెళ్తానని అంటుంది. తన తండ్రి గురించి తెలుసుకోవడానికి ఓ ప్లాన్ కూడా చెప్తుంది. ఇక సుబ్బు, స్వరూప మ్యాడీ ఇంటికి వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.