Meghasandesam Serial Today Episode: వనభోజనాల దగ్గర ఉన్న చెర్రి వెళ్లి గగన్‌ను కలుస్తాడు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నిన్ను కలవాలని ఎంత ట్రై చేసినా కుదరలేదు.. మనిద్దరం రెండు దేశాల బోర్డర్లు కలిసి ఉన్నట్టు ఎప్పుడూ పక్కపక్కనే ఉంటాం కానీ చుట్టూ గస్తీ ఉంటుంది అదంతా తప్పించుకుని రావడానికి ఇదిగో ఈ టైం పట్టింది అంటాడు చెర్రి. సరేలే ఇంకేంటి సోదరా..?
గగన్: నువ్వే చెప్పరా..?
చెర్రి: చెప్పే ఇంట్రెస్టింగ్ స్టోరీ నీ దగ్గర పెట్టుకుని నన్ను అడుగుతావేంటి సోదరా..?
గగన్: అరే చెర్రి ఏది నువ్వు తిన్నగా మాట్లాడవా..? ఎంతటి వారినైనా కన్పీజ్ చేస్తావా..?
చెర్రి: అది కాదన్నాయి.. నీది ఒక లవ్ స్టోరీ నడుస్తుందని చెప్పావు కదా..? ఆ గుడి దగ్గర ప్రపోజ్ చేస్తే మధ్యలో ఎవడో ఇడియట్ వచ్చి కొట్టి తీసుకెళ్లిపోయాడు అన్నావు కదా..? ఆ లవ్ స్టోరీ ఎంత వరకు వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడు ఉంది. ఐ మీన్ ఈ ఊరిలోనే ఉందా..? ఆ ఇడియట్ ఏ ఊరికైనా పంపించేశాడా..?
గగన్: అరే ఎక్కడో కాదురా..? మీ ఇంట్లోనే ఉంది. అది భూమినే అని చెప్పాననుకో.. నువ్వు టాంటాం అని అందరికీ చెప్పేస్తావు.. అది భూమికి ఇబ్బంది అవుతుంది. అందుకే కదా నీకు పేరు చెప్పలేకపోతున్నాను.
చెర్రి: ఏంటన్నాయ్ అడిగితే ఏమీ చెప్పలేకపోతున్నావు ఏంటి..? ఆ అమ్మాయి గురించి అడగ్గానే ట్రాన్స్ లోకి వెళ్లిపోయావా ఏంటి..? కాశ్మీర్ కొండల దాకా వెళ్లిపోయి డ్యూయెట్ వేసుకుంటున్నట్టున్నావు.
గగన్: ఏయ్ పోరా ఎక్కడికి వెళ్లలేదు.. ఇక్కడే ఉన్నాను.
చెర్రి: నువ్వు ఇక్కడే ఉన్నావు ఆ అమ్మాయి ఎక్కడుంది అని అడుగుతున్నాను. అది చెప్పు..
గగన్: ఎక్కుడుందా..? ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉందిరా..?
చెర్రి: ఇక్కడే ఉందిరా.. ఈ సిటీలో ఉందా..?
గగన్: అవును
చెర్రి: అంటే నువ్వు ప్రపోజ్ చేశావు తన నుంచి రిప్లై వచ్చే లోపు వాడెవడో వచ్చి అడ్డుకున్నాడు అన్నావు కదా ఆ తర్వాత నువ్వు ఆ అమ్మాయిని కలిశావా..?
గగన్: చాలా సార్లు కలిశానురా..?
చెర్రి: వావ్ సూపర్.. అయితే ఆ అమ్మాయి ఐలవ్యూ టూ అని నీకు స్వీటు రిప్లై ఇచ్చేసింది అన్నమాట. అయినా నిన్ను కాదనుకునే వాళ్లు ఎవరుంటారు అన్నయ్యా..నువ్వు ఐలవ్యూ అనగానే అమాంతం నిన్ను ముద్దుపెట్టుకోరూ..?
గగన్: హలో హోల్డన్ ఇంకా అంత దూరం వెళ్లలేదురా..?
చెర్రి: అదేంటి అన్నయ్యా అంత మాట అనేశావు . మరి ఆ అమ్మాయి రిప్లై ఏంటి.?
గగన్: చెప్పడం లేదురా..? కానీ ఆ అమ్మాయి చేష్టలు అన్ని నేనంటే ఇష్టం ఉన్నట్టే ఉంటాయి.
చెర్రి: అవునా.. చేష్టలు ఇష్టంగానే ఉన్నాయా..? అయితే అన్నయ్యా ఒక ఐడియా.. వజ్రాన్ని వజ్రంతోనే కోసినట్టే నోటిని నోటితోనే కొట్టాలి. ఏం లేదు అన్నయ్యా ఈ సారి ఎదురైనప్పుడు గట్టిగా ఒక ముద్దు పెట్టేయ్..
గగన్: రేయ్ ఏం చెప్తున్నావురా… కుదరదు..
చెర్రి: అదేం లేదు అన్నయ్యా.. ఏ అమ్మాయి అయినా ఇష్టం లేని వాళ్లు ముద్దు పెడితే లాగిపెట్టి కొడుతుంది. ఇష్టం ఉంటే సిగ్గు పడుతూ వెళ్తుంది.
గగన్: నువ్వు చెప్పేది ఒక రకంగా నిజమే అనిపిస్తుందిరా..?
చెర్రి : అవును అన్నయ్యా ఆ అమ్మాయి అలా సిగ్గు పడుతూ ఉందంటే చెప్పకనే నీకు ఐల్యవూ చెప్పినట్టే
అని ఇద్దరూ మాట్లాడుకుంటుంటే.. భూమి దూరం నుంచి చూస్తుంది. భూమిని గమనించిన చెర్రి అన్నయ్యా నువ్వు వెంటనే వెళ్లి ఆ ముద్దు పనిలో ఉండు.. అని చెప్పగానే.. గగన్ వెళ్లిపోతాడు. చెర్రి మాత్రం భూమి ఒంటరిగా వస్తుంది. ఈ అవకాశం వదులుకోకూడదని భూమి దగ్గరకు పరుగెత్తుతాడు. తర్వాత వనభోజనాల దగ్గర అందరూ డాన్స్ చేయాలని డిసైడ్ అవుతారు. అపూర్వ, శరత్ చంద్ర డాన్స్ చేస్తారు. తర్వాత గగన్ డాన్స్ చేయగానే.. అందరూ చప్పట్లు కొడతారు. ఇంతలో శరత్ చంద్ర లేచి నువ్వు ఇప్పుడు నా భూమి వేయబోయే డాన్స్ తో పోటీ పడు అప్పుడు నువ్వు డాన్సర్ అని నేను ఒప్పుకుంటా అంటాడు శరత్ చంద్ర. దీంతో గగన్, భూమి పోటీపడుతూ డాన్స్ చేస్తుంటారు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!