Meghasandesam Serial Today Episode:   భూమిని మర్డర్‌ చేస్తానని నువ్వు పదే పదే అంటూ నన్ను జైలుకు పంపిచేలా ఉన్నావు అంటూ అపూర్వ కోపంగా సుజాతను తిడుతుంటే.. మీరా వింటుంది. వదిన అంటూ కంగారుగా పిలవగానే.. సుజాత, అపూర్వ షాక్‌ అవుతారు. దగ్గరకు వచ్చి వదిన నువ్వేంటి భూమిని మర్డర్‌ చేయడమేంటి అని అడుగుతుంది. అపూర్వ తడబడుతుంటే.. నువ్వు విన్నది తప్పు అమ్మాయి.. భూమి మీద ఉన్న జీవుల్ని మర్డర్‌ చేస్తే.. మనం జైలుకు వెళ్తామా..? అని అడుగుతుంది. అంతే నీకు వేరేలా వినిపించింది అని కన్వీన్స్‌ చేస్తుంది సుజాత. అయినా నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతుంది అపూర్వ. వియ్యంకుల వారికి పంపించిన బ్యాగుల్లో కట్నం డబ్బులు లేవట కదా అంటుంది మీరా.. ఉన్నాయని ఎవరు చెప్పారు.. అంటూ అపూర్వ అడుగుతూ.. ఈ హడావిడిలో ఉన్నాం కదా అంటుంది. మరోవైపు వంశీ కూరగాయలు తీసుకొస్తాడు.

వంశీ: ఇదిగో కూరగాయలు కూడా తీసుకొచ్చాను. ఆఫీసుకు వెళ్లేలోగా వండేస్తాను. మధ్యాహ్నం నువ్వు వడ్డించే ముందు వేడి చేయ్‌..

ఇందు: అలాగే సరే..

వంశీ: ఏంటి డల్లుగా ఉన్నావు.. టిఫిన్ చేయలేదా..?

ఇందు: లేదు.. మీతో కలిసి చేద్దామని ఆగాను.

వంశీ: టిఫిన్‌ చేయనందుకే డల్లు అయ్యావా..?

ఇందు: లేదు. మా అమ్మ ఫోన్‌ చేసింది వాళ్లంతా వనభోజనాలకు వెళ్తున్నారట. అత్తయ్య నన్ను పంపించనని సీరియస్‌గా చెప్పారు.

వంశీ: ఓస్‌ అంతే కదా.. ఇప్పుడు మనం వనభోజనాలకు మీ వాళ్లతో  కలిసి వెళ్లాలి అంతే కదా..? లోపలికి వెళ్దాం పద..

అంటూ ఇందును కిచెన్‌లోకి తీసుకెళ్లి.. చేతికి మసి అంటించి.. చేయి కాలిందని అరవమని చెప్తాడు. ఇందు అరుస్తుంటే.. సౌందర్య, రమేష్‌ వస్తారు. ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావురా… అని అడుగుతారు. దీంతో పెసరట్టులో ఉప్పు తక్కువైంది అందుకే చేయి కాలుస్తున్నాను అంటాడు. కోపంగా వెళ్లి రెడీ కాపో హాస్పిటల్‌కు తీసుకెళ్తాను అంటాడు వంశీ. రమేష్‌, సౌందర్య ఆశ్చర్యంగా చూస్తుంటారు. శారద వాళ్లు కూడా వనభోజనానికి వెళ్తుంటారు. అపూర్వ  వచ్చి పిలవని పేరంటానికి వెళ్లినట్టు మనం వనభోజనానికి వెళ్తున్నాం కదా..? భూమి మనతో కలుస్తుందా..? అని పూరి అడుగుతుంది. అవన్నీ ఇప్పుడెందుకు కానీ ఇవన్నీ కారులో సర్దుదాం రా అని బయటకు వెళ్తారు. బైక్‌ లో పెట్రోల్ అయిపోవడంతో శారద వాళ్ల ఇంటి ముందు నిలబడి ఉంటారు. బయటకు వచ్చిన శారద వాళ్లను చూసి లోపలికి రండి అని పిలుస్తుంది. పర్వాలేదు ఇక్కడే ఉంటామని చెప్తుంది ఇందు. వంశీ మాత్రం వెళ్దాం పద ఇందు అనగానే అందరూ లోపలికి వెళ్తుంటే.. పూరి అడ్డుగా నిలబడుతుంది.

శారద: ఏంటే అలా అడ్డంగా నిలబడ్డావు.. ఎవరొచ్చారో చూడు.

పూరి: అదే ఎవరొచ్చారో చూస్తున్నా.. ఇంట్లో చెత్త ఎవరైనా బయట వేస్తారు. బయటి చెత్తను ఎవరు లోపలికి తెచ్చుకోరు.

ఇందు: మనం వెళ్దాం పదండి..

శారద: ఆగమ్మా.. ఏం పూర్ణి ఏంటా మాటలు మంచి చెడ్డా లేకుండా.. లోపలికి వెళ్లి అన్నయ్యను పిలువు.. తన మాటలేం పట్టించుకోవద్దమ్మా.. మీరు లోపలికి రండి.. రండి అల్లుడు గారు. అమ్మా మొదటిసారి ఇంటికి వచ్చారు. కుడి కాలు పెట్టి రండి. కూర్చో అమ్మా.. కూర్చో బాబు.. ఇప్పుడే వస్తాను.

గగన్‌: అమ్మా ఇందు ఎలా ఉన్నారు.. బాగున్నారా..? బావగారు. కూర్చోండి.. ఇలా సడెన్‌ గా..

వంశీ: మీ ఇంటి బయట బైక్‌ ఆగిపోతేనూ.. అత్తయ్యగారు లోపలికి తీసుకొచ్చారు.

శారద: అవున్రా నేను తీసుకొస్తే కానీ లోపలికి రాలేదు. అయినా మీ ఇల్లు మా ఇల్లు అని వేరు చేసి మాట్లాడతారేంటి.. ఇది మన ఇల్లు మీరు ఎప్పుడైనా రావొచ్చు..

అంటూ అందరికీ టీ ఇస్తుంది.. టీ తాగబోతున్న వంశీ చేయి నోప్పి చేయగానే ఏంటని అడుగుతారు శారద. అది వంట చేస్తుంటే.. అని వంశీ చెప్తాడు. నువ్వు వంట చేయడం ఏంటి బాబు అని శారద అడుగుతుంది. దీంతో నాకు చేయడం రాదని తను చేశాడు అని చెప్తుంది ఇందు.  తర్వాత కట్నం కోసం అత్తామామలు పెడుతున్న టార్చర్‌ గురించి చెప్తుంది. ఆ కట్నం ఏదో నేను ఇస్తానని గగన్‌ చెప్తాడు. వద్దని మనం మంచి చేసినా వాళ్లు చెడుగానే ఆలోచిస్తారు అంటూ శారద ఆపుతుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!