Karthika Deepam 2 Serial Today January 10th: కార్తీకదీపం 2 సీరియల్: దీపలో మొదలైన ఫీలింగ్స్.. టచ్‌కి పడిపోయిందా.. దండకా.. జ్యో ఏదో చేస్తుందంటగా!

Karthika Deepam 2 Serial Today Episode దీప కార్తీక్ ఇద్దరి మెడలో శౌర్య ఒకే దండ వేయడం అనసూయ దీపని కార్తీక్ గురించి ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ దీపని సైకిల్‌ మీద ఎక్కించుకొని జ్యోత్స్నని ఉడికించి ఇంటి తీసుకెళ్తాడు. ఇద్దరూ వెళ్తుంటే జ్యోత్స్న వెనకాలే వెళ్తుంది. నా మీద గెలిచాను అని సంబరపడుతున్నావా బావ అని అడుగుతుంది. ఇక దీపతో నీకు గూబ పగిలేలా సమాధానం చెప్పేదాన్ని కానీ మా నాన్న ఉన్నారని అంటుంది. దానికి కార్తీక్ నువ్వు కౌన్సిలింగ్‌ తీసుకొనే స్థితిలో ఉన్నావ్ జ్యోత్స్న అంటాడు. దానికి జ్యో ఎంత ఎత్తులో ఉండే నువ్వు ఈ దీపని పెళ్లి చేసుకొని కిందకి పడిపోయావ్ అంటుంది. దానికి దీప ఇప్పుడే ఆయన జీవితం మొదలైంది అని అంటుంది. 

Continues below advertisement

దీప: మారడానికి ఇంత కంటే మంచి టైం రాదు జ్యోత్స్న. మనం వెళ్తున్న దారి మంచిది కాదని కాలం చిన్న చిన్న హెచ్చరికలు చేస్తుంది తెలుసుకోకపోతే కోలుకోలేని దెబ్బ తగులుతుంది. మంచి తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. ఇప్పటికైనా మారకపోతే తింటావ్ గట్టిగా తింటావ్.
జ్యోత్స్న: ఏంటి వార్నింగ్ ఇస్తావా.
కార్తీక్: పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు పెద్దలు హెచ్చరిస్తారు. అందరితో నమస్కారాలు పెట్టించుకునే మామయ్య అందరికీ దండం పెట్టాడు. లోలోపల ఎంత బాధ పడుతున్నాడో నాకు తెలుసు. ఇప్పటికైనా మంచిగా ఉండు. వాళ్లని రోడ్డుకి ఈడ్చకు.
జ్యోత్స్న: నన్ను అడుగడుగునా రెచ్చగొడుతున్నావ్ దీప సారీ దీప ఈ సారి ఏం చేస్తానో నాకే తెలీదు. చాలా అంటే చాలా గట్టిగా బాధ పడతావ్. 

కార్తీక్ ఇంటికి వెళ్లి తల్లితో సమస్య పరిష్కారం అయిందని చెప్తాడు. అందరూ సంతోషిస్తారు. ఇక దీప వచ్చి అనసూయని చెప్పకుండా వెళ్లావేంటి అని అడుగుతుంది. దాంతో ఇళ్లు తాకట్టు పెట్టడానికి వెళ్లానని చెప్తుంది. ఇక కార్తీక్ దీపకు ఈ విజయంలో సగం భాగం ఉందని దీప మెడలో దండ వేస్తాడు. ఇక శౌర్య ఇద్దరూ సగం సగం అంటే ఇద్దరి మెడలో దండ వేయాలి అని ఇద్దరి మెడలో దండ వేస్తుంది. ఇక అనసూయ, కాంచన చాలా సంతోషిస్తారు. సగంలో నేను ఉన్నాను అని ఇద్దరి మధ్యలో దండలో దూరిపోతుంది. కాంచన ఫొటోలో తీస్తుంది. కార్తీక్ వాళ్లు ఫొటోలు చూసి సరదా పడతారు. దీప గదలోకి వెళ్లి దండ తీసి పక్కన పెడితే అనసూయ వచ్చి కొండంత ప్రేమతో నీ భర్త నీకు వేశాడు కొంచెం సేపు ఉంచుకోవచ్చు కదా అంటుంది. దానికి దీప కార్తీక్ బాబుకి నా మీద జాలి, కృతజ్ఞత, అభిమానం అని చెప్తుంది.

కార్తీక్ బాబుని నేను ఆరాధిస్తున్నా అని చెప్తుంది. శౌర్య కార్తీక్ లాకెట్ వేసుకుంటుంది. కార్తీక్ రావడంతో దాన్ని దాచేస్తుంది. కార్తీక్ చూసి ఈ లాకెట్ నీ మెడలో ఏంటి అని అడుగుతాడు. శౌర్య పారిపోతుంది. కార్తీక్ దీపని పట్టుకోమని అంటాడు. దీప పట్టుకుంటే దాని మెడలో చూడు అని అంటే దీప అది ఎందుకు వేసుకున్నావ్ అని అంటుంది. ఆడపిల్లలది నాన్నకి ఎందుకు అని అంటుంది. కార్తీక్ పాపని పట్టుకునే టైంలో దీపని పట్టుకుంటాడు. దీపలో ఫీలింగ్స్ మొదలవుతాయి. అలా ఉండిపోతుంది. ఇక దీప పాపని పట్టుకొని లాకెట్ తీసుకుంటుంది. అది కార్తీక్‌కి ఇస్తుంది. కార్తీక్ దాన్ని తన మెడలో వేసుకొని ఇకపై ఎలా తీసుకుంటావో నేను చూస్తా అని అంటాడు. దానికి శౌర్య నీకు మా అందరి కంటే తనే ఎక్కువ అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్, దీపల ధర్నా - జ్యోత్స్న మీద తాత సీరియస్.. తల వంచిన దశరథ్‌!

 

Continues below advertisement