Meghasandesam Serial Today Episode : దత్తత కార్యక్రమానికి శోభాచంద్ర ఫోటో తీసుకొచ్చి పెడుతుంది. భూమి. దీంతో శరత్‌చంద్ర హ్యాపీగా పీలవుతూ భూమిని హగ్‌ చేసుకుంటాడు. ఇంతలో పంతులు అయ్యా సమయం మించిపోతుంది పూజ మొదలు పెడదామా..? అంటాడు సరేనని శోభాచంద్ర ఫోటో పక్కన కూర్చుంటాడు శరత్‌చంద్ర. పక్కనే భూమి కూర్చుంటుంది. పంతులు పూజ మొదలు పెడతాడు. అందరూ హ్యాపీగా చూస్తుంటారు. అపూర్వ కోపంతో రగిలిపోతుంది. ఇంతలో సుజాత మెల్లగా అపూర్వ దగ్గరకు వచ్చి భూమిని తిడుతుంది.

సుజాత: చూశావా అమ్మాయి.. భూమి అప్పుడే తన యాక్షన్‌ మొదలుపెట్టింది. అల్లుడికి వైఫ్‌గా నీ ప్లేస్‌ను ఎగరేసి చచ్చిన దాని అమ్మ ఫోటో పెట్టేసింది.

అపూర్వ: నాకు కనిపిస్తుంది కదా పిన్ని.. మళ్లీ దాన్ని చెప్పడం ఎందుకు..?

సుజాత: నీకు ఎదురుగా ఉన్నదే కనిపిస్తుంది అమ్మాయి.. నాకు నీ మొత్తం భవిష్యత్తు కనిపిస్తుంది అమ్మాయి. అవును అమ్మాయి. భూమి ఈ ఇంట్లోంచి నిన్ను బయటకు తోసేశాక నీ పరిస్థితి ఏంటి..? మా ఇంటికి వచ్చేస్తావా..? ఖాళీగా కూర్చుంటే గడిచే ఇల్లు కాదులే అమ్మాయి మా ఇల్లు. ఏదైనా పని చేయాలి. మరి మీ అమ్మా కూతుళ్లకు ఏమైనా పనులు వచ్చా..?

అపూర్వ: పిన్ని కాసేపు సైలెంట్‌గా ఉంటావా..?

సుజాత: అది కాదు అమ్మాయి ఫ్యూచర్‌ గురించి మనకు కూడా ఒక ప్లాన్‌ ఉండాలి కదా..? ఏ పని రాకపోయినా పర్వాలేదు. ఇంటి పనులు నేర్చుకోండి.. పని మనుషులకు ఈ రోజుల్లో చాలా డిమాండ్‌ ఉంది.

అపూర్వ: పిన్ని కాసేపు నోరు మూసుకో.. మండుతున్న దాన్ని ఇంకా మండించకు.

సుజాత: అందుకే అమ్మాయి.. తగులబడిపో అని చెప్తున్నాను.. ఈ కార్యక్రమం ఆగిపోతుంది.

అపూర్వ: నోరు మూస్తావా లేదా..?

పంతులు: అయ్యా దత్తత కార్యక్రమం అంటే దత్తత ఇచ్చే వాళ్లు.. పుచ్చుకునే వాళ్లు ఉండాలి. కాకపోతే భూమి పరిస్థితి మీరు ముందే చెప్పి ఉండటం వల్ల దైవమే మీకు దత్తత ఇస్తున్నట్టు ఆయన ప్రతినిధిగా నేను భూమి అరచేతులను తమలపాకులతో పాలతో కడిగి మీకు అప్పగించడంతో ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. ఇది ఆనవాయితీగా చెప్పడం మా ధర్మం.

ప్రసాద్‌: భూమికి ఎవరు లేకపోవడం ఏంటి..? ఎదురుగానే ఉన్నాము.. తన అమ్మా నాన్నా.. మేమంతా బంధువులుగా ఉన్నాము. కానీ ఇది బయటకు చెప్పుకోలేను. ఈ కార్యక్రమం తర్వాత భూమి మా ఇంటి పిల్లే అని గర్వంగా అందరికీ చెప్పుకోవచ్చు.

అని మనసులో అనుకుంటాడు కృష్ణప్రసాద్‌. అప్పుడే కోపంగా కృష్ణప్రసాద్‌ను చూస్తుంది అపూర్వ. కృష్ణప్రసాద్‌ కేర్‌లెస్‌గా చూస్తుంటాడు. ఏం చేయాలా అని అపూర్వ ఆలోచిస్తుంది. మరోవైపు హాస్పిటల్‌ లో ఉన్న గగన్‌ ఎలాగైనా నక్షత్ర పరిస్థితి శరత్‌ చంద్ర వాళ్లకు చెప్పాలనుకుంటాడు. అందుకోసం చెర్రికి ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయడు. దీంతో గగన్‌ అపూర్వకే విషయం చెప్పాలని ఫోన్‌ చేస్తాడు. ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన అపూర్వ గగన్‌ను ముందు తిడుతుంది. గగన్‌ కోసంగా అపూర్వను తిడుతాడు. భూమిని, శరత్‌చంద్ర దత్తత తీసుకుంటుంటాడు.

గగన్‌: మీ అమ్మాయి నక్షత్ర హాస్పిటల్‌ లో ఉంది.

అపూర్వ: ఏంటి హాస్పిటల్‌లో ఉందా..?

గగన్‌: మీ అమ్మాయి నక్షత్ర ఇక్కడ చావు బతుకుల మధ్య ఉంది.

అపూర్వ: ఏంటి నువ్వు చెప్పేది.. చావు బతుకుల మధ్య ఉండటమేంటి..?

గగన్‌: అవును పాలిమర్‌ హాస్పిటల్‌ లో ఉంది.  

అని గగన్‌ చెప్పగానే శరత్‌ చంద్ర కంగారుగా దత్తత కార్యక్రమాన్ని వదిలేసి అపూర్వను తీసుకుని హాస్పటిల్‌కు వెళ్తాడు. ఐసీయూలో నక్షత్రను చూసి అపూర్వ ఏడుస్తుంది. గగన్‌ దగ్గరకు వెళ్లి ఎలా జరిగిందని అపూర్వ అడుగుతుంటే.. శరత్‌ చంద్ర చూసి కోపంగా వీడు మన నక్షత్రను చంపేయాలనుకున్నాడు అంటూ అపూర్వను తిడతాడు. పక్కనే ఉన్న కత్తి తీసుకుని గగన్‌ను చంపాలనుకుంటాడు శరత్‌చంద్ర ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!