Meghasandesam Serial Today Episode: శరత్ చంద్రను కలవడానికి గెస్ట్‌హౌస్‌కు వెళ్లిన భూమికి అక్కడ శరత్ చంద్ర కనబడడు పైగా అపూర్వ పంపిన రౌడీలు భూమిని చంపడానికి ప్రయత్నిస్తారు. ఇంతలో అపూర్వ వచ్చి భూమి చేతిలో కెమెరా లాక్కుని పగులగొడుతుంది. ఇక భూమిని చంపేయండి అని చెప్పగానే.. భూమి అక్కడి నుంచి పారిపోతుంది. రౌడీలు భూమిని ఫాలో చేస్తుంటారు. భూమి ఏడుస్తూ పరుగెడుతుంది.
భూమి: ఆ అపూర్వ అసలు స్వరూపాన్ని నాన్నకు తెలిసేలా చేసి నిజాన్ని బయట పెట్టి తను చేసిన పాపాలకు తగిన శిక్ష పడేలా చేద్దాం అనుకుంటే అడుగడుగునా అడ్డు పడుతూ తప్పించుకుంటుంది. నా దగ్గర ఉన్న సాక్ష్యాలు అన్నింటిని నాశనం చేసింది. తన నేర చరిత్ర బయట పడకుండా శాశ్వతంగా సమాధి చేసింది. ఇప్పుడు ఏం చేయాలి మా అమ్మ చావుకు ఎలా న్యాయం చేయాలి.
అనుకుంటూ ఏడుస్తూ వెళ్లి ఎస్పీ సూర్య కారుకు ఎదురుగా వెళ్లి కారుకు తగిలి కింద పడిపోతుంది. సూర్య చూసి కారు దిగి కంగారుగా భూమి అంటూ పిలుస్తాడు. భూమి స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది.
సూర్య: భూమి ఎందుకు అంత కంగారుగా పరుగెత్తింది. అసలు ఏం జరిగింది. ఎవరైనా వెంబడించారు అనుకున్నా ఎవరు లేరే.. అసలు ఏమై ఉంటుంది.
అనుకుంటూ భూమిని చేతులతో ఎత్తుకుని తన కారులో పడుకోబెడుతుంటే.. అప్పుడే అక్కడికి గగన్ వచ్చి చూస్తాడు. భూమిని చూసి షాక్ అవుతాడు గగన్. సూర్య కారు తీసుకుని వెళ్లిపోతాడు.
గగన్: నీ ప్రేమ ఒక నటన. నీ మాటలు అబద్దాల కోతలు. నీ నవ్వు ఒక విషపు వలయం. నువ్వు ఒక మాయ లేడివి నిన్న నమ్మి వెర్రి వాడిగా మిగులుతుంది నేనే..? మోసానికి చిరునామా ఏదంటే.. అది నువ్వని మరోసారి నిరూపించావు.
అంటూ కోపంగా గగన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్లిన మీరా ఏడుస్తూ శారద చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఇందుకు కాల్ చేస్తుంది.
ఇందు: చెప్పమా..?
మీరా: నేను కాదే నువ్వే చెప్పు మా అన్నయ్య చెప్పినట్టుగా ఇస్తానన్న కట్నం మీ అత్తామామలు తీసుకున్నారా..?
ఇందు: అంటే అమ్మా..?
మీరా: నువ్వేం దాచాల్సిన అవసరం లేదు ఇందు నాకు అంతా తెలిసిపోయింది. నా సవతే చెప్పింది. చెప్పు.. ఆ కట్నం మా అన్నయ్యే ఇచ్చారా..? లేదా ఇంకెవరైనా ఇచ్చారా..? బెల్లం కొట్టిన రాయిలా అలా ఉండిపోయావేంటే.. చెప్పు..
ఇందు: అది అన్నయ్య ఇచ్చాడు అమ్మా..?
మీరా: అన్నయ్య అంటే ఎవరే అన్నయ్య..
ఇందు: గగన్ అన్నయ్య ఇచ్చాడు..
మీరా: వాడు అన్నయ్య అయిపోయాడే నీకు.. డబ్బులిచి అన్నయ్య పోస్ట్ వాడు కొనుక్కున్నాడు.. చెల్లెలిగా నీవు అమ్ముడుపోయావు.. ఈ విషయం నాకెందుకు చెప్పలేదే..?
ఇందు: అన్నయ్య చెప్పొద్దు అన్నాడు..
మీరా: మళ్లీ అన్నయ్యా..? బాగుంది చీ.. బాగుంది
అంటూ మీరా కాల్ కట్ చేస్తుంది. మరోవైపు కేపీ శరత్ చంద్ర దగ్గరకు వెళ్తాడు. మీరాకు తాను నిజం చెప్పలేదని అంటాడు. దీంతో శరత్ చంద్ర హ్యాపీగా కేపీ చేతులు పట్టుకుని థాంక్స్ చెప్పి నువ్వేం చెప్పినా చేస్తానని చెప్తాడు. దీంతో కేపీ, భూమిని కూతురుగా గగన్‌ను అల్లుడిగా అంగీకరించమని చెప్తాడు. దీంతో శరత్ చంద్ర ఆలోచనలో పడిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!