Meghasandesam Serial Today Episode: భూమిని ఇంటికి తీసుకువచ్చిన శరత్ చంద్ర తన ఆవేదన చెప్తాడు. భూమి పలకకుండా ఏడుస్తూ ఉండిపోతుంది. ఇంతలో శరత్ చంద్ర ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో నువ్వు ఎక్కడున్నా నీ మీద అభిమానం అలాగే ఉంటుంది. నువ్వు అక్కడున్నా ఇక్కడున్నా మా ఇద్దరి మధ్య మాత్రం శత్రుత్వం అలాగే ఉంటుంది. అని చెప్పి వెళ్లిపోతుంటే.. భూమి నాన్నా అని పిలుస్తుంది. ఆ పిలుపునకు వెనక్కి తిరిగి వచ్చిన శరత్ చంద్ర ఈ పిలుపు చాలా సంతోషంగా ఉందమ్మా..? ఆ ఇంటికి వెళ్లాక ఇంకెప్పుడు ఇలా పిలవకు అంటాడు. చెప్పగానే భూమి ఏడుస్తుంది. శరత్ చంద్ర వెళ్లిపోతుంటే..
భూమి: ఆగండి నాన్నా నా సమాధానం వినకుండానే మీ అంతట మీరు ఓ నిర్ణయం తీసుకుంటే ఎలా..? నేను ఆయన్ని ప్రేమించడం లేదు.
బయట డోర్ దగ్గర నుంచుని చూస్తుంటారు అపూర్వ, సుజాత.
సుజాత: ఇదేంటి అమ్మాయి.. లోపలి నుంచి వీడియో కనిపించడం లేదు.. ఆడియో వినిపించడం లేదు.. లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఎలా..?
భూమి: ఆయన్ని కలవడానికి మాత్రమే వెళ్లాను. అదే నిజం. మీరు ఆ ఇంటికి వెళ్లొద్దు అన్నారు కదా..? ఆంటీ పూరి ఎలా ఉన్నారో తెలుసుకుందామని ఆయన్ని కలిశాను. కానీ ఆయన ఐలవ్యూ చెప్తారని అసలు ఊహించలేదు.
శరత్: నాకు తెలుసమ్మా.. నాకు ఇష్ట లేని పనేది నా భూమి చేయదని..ఏడవకు.. ఇద్దరి గురించి ఆలోచించడం నీ మంచితనం. నీ కన్నతండ్రిగా చెప్తున్నాను. ఇక వాళ్ల గురించి ఆలోచించకు అమ్మా
అని భూమిని ఓదారుస్తుంటాడు. మరోవైపు బార్‌లో కూర్చుని మందు తాగుతున్న ప్రసాద్ మీరాకు ఫోన్ చేస్తాడు. భూమి ఇంటికి వచ్చిందా..? అని అడిగితే వచ్చిందని అన్నయ్యా తీసుకొచ్చారని.. ఎందుకో కోపంగా ఉన్నారని చెప్తుంది. దీంతో ఏదో రాంగ్ జరిగింది తెలుసుకోవాలి అని ప్రసాద్ వెళ్లిపోతాడు. అదే బార్‌కు గగన్ వస్తాడు. వెయిటర్ వచ్చి ఆర్డర్ అడిగితే బాగా మత్తేక్కేది ఏదైనా తీసుకురా అని చెప్తాడు. భూమిని గుర్తు చేసుకుని బాధపడుతుంటాడు. ఇంతలో వెయిటర్ మందు తీసుకురాగానే మందు తాగబోతుంటాడు. చెర్రి వచ్చి ఆపుతాడు.
చెర్రి: అన్నయ్యా ఏం చేస్తున్నావు.. నువ్వు తాగాలి అనుకుంటున్నావా..? మాట్లాడాలి బార్‌కు రా అంటే షాక్ అయ్యాను. అసలు పెద్దమ్మకు తెలిస్తే తట్టుకుంటుందా..?
గగన్: నేను ఒక అమ్మాయినిన ప్రేమించాను చెర్రి..
చెర్రి: ఏంటి సోదరా మరోసారి చెప్పు..
గగన్: నేను ఒక అమ్మాయిని ప్రేమించాను.
చెర్రి: నేను విన్నది నిజమే.. ఇన్నాళ్లు నేను ప్రేమలో పడుతుంటే ఇప్పుడు నువ్వు ప్రేమలో పడ్డావన్నమాట. చెప్పన్నయ్యా నాకు తెలియాల్సిందే ఆ లక్కిగాళ్ ఎవరు..?
గగన్: ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోకుండా తన పేరు బయట పెట్టి పర్సనల్ లైఫ్ చెడగొట్టలేను కదా..?
చెర్రి: ఓహో నాకు చెప్పినంత మాత్రాన్నే ఆ అమ్మాయి ఆత్మగౌరవం దెబ్బ తింటుంది అంటావా..?
అని చెర్రి గుచ్చి గుచ్చి అడగ్గానే గగన్ పేరు చెప్పడు. కానీ గుడిలో జరిగిన గొడవ విషయం చెప్తాడు. తన మనసులో ఏముందో చెప్పకుండానే వెళ్లిపోయింది అని గగన్ చెప్పగానే అమ్మాయికి ఇష్టం లేకపోతే నువ్వు చెప్పిన వెంటనే నువ్వు అంటే ఇష్టం లేదని చెప్పేది. తన వాళ్లు పక్కన ఉంటే చెప్పు తీసుకుని కొట్టేది. కానీ అలా చేయలేదంటే ముందు తన మనసులో ఏముందో తెలుసుకో అంటాడు. కరెక్టు టైంలో వచ్చి మంచి ఐడియా ఇచ్చావురా చెర్రి అంటూ గగన్ హ్యాపీగా వెళ్లిపోతాడు. ఇంటికి వచ్చిన ప్రసాద్ ను చూసి భూమి ఏడుస్తుంది. గుడిలో జరిగిన గొడవ గురించి చెప్తుంది. నా ఈ పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు మామయ్యా అంటూ ఏడుస్తుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!