Meghasandesam Serial Today Episode: మీరాను తీసుకుని ఇంటికి వెళ్లిన చెర్రి కేపీతో కోపంగా గగన్ ఆఫీసులో మీరా చేసిన పని చెప్తాడు. అమ్మ నన్ను ఎంత నమ్మించిందో తెలుసా..? అంటూ కోప్పడతాడు. ఎన్నో మాటలు చెప్పి అన్నయ్య ఆఫీసుకు తీసుకెళ్లి అన్నయ్యను గోరంగా అవమానించింది అని చెప్తాడు.
మీరా: ఓరేయ్ ఇంత వయసు వచ్చాక ఇంత బతుకు బతికాక నేనెందుకు అమాయకురాలిగా ఉండాలా..? మీ అందరినీ అది దాని కొడుకుతో కలిసి కట్టకట్టుకుని పట్టుకుని పోతుంటే నేను కళ్లు మూసుకుని కూర్చోవాలా..?
చెర్రి: అదిగో మళ్లీ అదే మాట..
మీరా: ఓరేయ్ ఆపరా..?
కేపీ: మీరా పిచ్చి పట్టిందా నీకు..
మీరా: పిచ్చి కాదండి మీరంతా ఎక్కడ నా చేజారిపోతారేమోనని బాధగా ఉంది.
ఇంతలో వీడియో కెమెరా తీసుకుని శరత్ చంద్ర ఇంటికి వస్తుంది భూమి. కేపీ, మీరా, చెర్రిలను చూస్తుంది.
భూమి: ఏంటి అంత సీరియస్‌గా ఉన్నారు.
చెర్రి: ఏం చెప్పమంటావులే భూమి. మా అమ్మ చేసిన నిర్వాకానికి తల ఎక్కడ పెట్టుకోవాలో నాకు అర్థం కావడం లేదు.
మీరా: ఏంట్రా నేను ఏదో ఆ గగన్ గాడిని చంపేసినట్టు అంత నిందిస్తున్నావు.
భూమి: అత్తయ్య కాస్త మర్యాదగా మాట్లాడండి. ఆయన మా ఆయన.
మీరా: అవును అమ్మ ఆయన మీ ఆయనే నాకెందుకు తెలియదు. మీ ఆయన అయ్యాకే కదా ఈ మేనత్తను నువ్వు మర్చిపోయావు. నువ్వు నా సవతి కలిసి ఈ మేనత్త తాళి తెగిపోతున్నా.. నేను తెల్ల చీర కట్టుకుని తిరుగుతున్నా నాకు ఒక్క మాట చెప్పలేదు. నువ్వు మీ అత్తయ్య కలిసి నా కుటుంబాన్ని లాగేసుకోవాలని చూస్తున్నారు కదా..? అదే మీ ఆయనకు చెప్పాను. అదే నేను అవమానించాను అంటున్నారు.
భూమి: ఏంటి మీరు మా ఆయన్ని అవమానించారు.
చెర్రి: చాలా దారుణంగా భూమి. అన్నయ్య అమ్మ కాళ్లు పట్టుకున్నా వదలలేదు.
భూమి: అందుకా ఆయన ఆలా ఉన్నారు. ఆయన్ని మీరు చాలా దారుణంగా అవమానించారని ఇప్పుడు అర్థం అవుతుంది. మేనత్తవు అయిపోయావు. మీరు కాబట్టి వదిలేస్తున్నాను అత్తయ్యా.. ఇంకెకరు అయ్యుంటే చంపేసేదాన్ని. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా..? ఎవరి వల్ల జరుగుతుందో తెలుసా..? అసలు మామయ్య చావు బతుకుల దాకా ఎందుకు వెళ్లారో తెలుసా..?
కేపీ: భూమి వద్దు..
భూమి: మీక అర్థం కావడం లేదు అత్తయ్యా మీతో సహా ఈ ఇంట్లో వాళ్లు అందరూ ప్రమాదంలో ఉన్నారు. మీరు ప్రమాదంలో ఉన్న ప్రతిసారి మిమ్మల్ని రక్షిస్తుంది ఆ ఇల్లు అత్తయ్య. బదులుగా మీలాంటి వాళ్లతో నిందలు పడాల్సి వస్తుంది. అన్నింటికీ ముగింపు పలికే సమయం వచ్చేసింది అత్తయ్య. మా నాన్న ఎక్కడ..?
చెర్రి: మా నాన్న వచ్చినప్పుటి నుంచి మీ నాన్న కనిపించడం లేదు..
భూమి: అలాగా మా నాన్న ఎక్కడున్నాడో తీసుకొస్తాను. అప్పుడే మీకు నిజానిజాలు తెలుస్తాయి అత్తయ్య.
అంటూ భూమి బయటకు వెళ్లిపోయి శరత్ చంద్రకు ఫోన్ చేస్తుంది. హాస్పిటల్ లో ఉన్న శరత్ చంద్ర ఫోన్ అపూర్వ లిఫ్ట్ చేస్తుంది. శరత్ చంద్ర ఆత్మహత్య ప్రయత్నం చేశారని చెప్తుంది. దీంతో భూమి షాక్ అవుతుంది. తిరిగి కేపీ దగ్గరకు వెళ్తుంది భూమి. భూమి ఏడ్వడం చూసిన కేపీ కంగారు పడతాడు.
కేపీ: అమ్మా భూమి ఏంటి ఏమైంది..? ఎందుకు ఏడుస్తున్నావు..?
భూమి: నాన్న ఆత్మహత్య చేసుకోబోయారు. ఎందుకో తెలుసా మామయ్య.
కేపీ: దేనికి అమ్మా..?
భూమి: మా అమ్మను చంపింది అపూర్వ అని తెలిసి. ఇన్నాళ్లు ఇలాంటి దాన్నా నేను నమ్మింది అని మానసిక క్షోభతో చనిపోవాలనుకున్నారు.
అని భూమి చెప్పగానే.. కేపీ, శరత్ చంద్రకు ఫోన్ చేసి ఎక్కడున్నావని అడుగుతాడు. దానికి శరత్ చంద్ర తాను గెస్ట్ హౌస్‌లో ఉన్నానని తాగుతున్నానని చెప్తాడు. ఎందుకు తాగుతున్నారని అడిగితే మీరాకు ముఖం చూపించలేక అని శరత్ చంద్ర చెప్తాడు. దీంతో కేపీ కెమెరా లో వీడియో శరత్ చంద్ర చూడలేదని నిజం ఆయనకు తెలియలేదని వెంటనే ఆయనకు నిజం తెలిసేలా చేయాలని భూమిని తీసుకుని కేపీ శరత్ చంద్ర దగ్గరకు బయలుదేరుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!