Meghasandesam Serial Today Episode: చెర్రితో కలిసి మీరా గగన్‌ ఆఫీసుకు వెళ్తుంది. ఆఫీసు ముందు కారు అపేసిన చెర్రి ఇదేనమ్మా అన్నయ్య ఆఫీసు అని చెర్రి చెప్పగానే.. నువ్వు ఎప్పుడూ వస్తుంటావు కదరా నాకెలా తెలుస్తుంది అంటుంది మీరా. ఇద్దరూ కలిసి లోపలిక వెళ్తారు. లోపలికి వెళ్లాక మీరా ఆగిపోతుంది.

Continues below advertisement

చెర్రి: అదేంటమ్మా ఇక్కడే ఆగిపోయావు.. రా..

మీరా: ఓరేయ్‌ ఇన్నాళ్లు మీ అన్నయ్యను ధ్వేషిస్తూ వచ్చాను. ఇప్పుడు మీ అన్నయ్య ఆఫీసుకు రావడం అంటే అదోలా ఉంది. ఇక మీ అన్నయ్య క్యాబిన్‌లోకి రావాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉందిరా..?

Continues below advertisement

చెర్రి: ఇబ్బంది ఏంటమ్మా..? ఇక్కడి దాకా వచ్చి రెండు అడుగులు వేస్తే ఏమవుతుంది. పర్లేదు రా..?

మీరా: అలా కాదు చెర్రి మీ అన్నయ్యను కాస్త బయటకు పిలవొచ్చు కదా..? ఏ మీ నాన్న ప్రాణం కాపాడిన వాడు ఈ పిన్ని కోసం మీ అన్నయ్య రెండు అడుగులు బయటకు రాలేడా..?

చెర్రి: బలే దానివి అమ్మా మన అనుకుంటే అన్నయ్య ఎంత దూరం అయినా దూసుకుని వస్తాడు. నువ్వు ఇక్కడే ఉండు పిలుచుకుని వస్తాను.

అంటూ చెర్రి, గగన్‌ చాంబర్‌లోకి వెళ్తాడు. చెర్రిని చూసిన గగన్‌ ఏంటి సడెన్‌ సర్‌ఫ్రైజ్‌ అంటూ అడుగుతాడు.

చెర్రి: నా రాకకే నువ్వు సడెన్‌ సర్‌ప్రైజ్‌ అయ్యావంటే మరి ఇంకొకళ్లు వచ్చారే దానికేం అంటావు..

గగన్‌: ఎవరురా..?

చెర్రి: అమ్మా.. ( మీరాను చూపిస్తాడు)

గగన్‌: అరేయ్‌ పిన్ని వచ్చింది.. అరేయ్‌ పిన్ని ఎందుకు వచ్చిందిరా..?

చెర్రి: అదే సర్‌ఫ్రైజ్ మరి..

గగన్‌: ఏదో ఒకటి కానీ బయట ఎందుకు నిలబెట్టావురా…? లోపలికి తీసుకుని రా..?

చెర్రి: సోదరా ఇబ్బంది పడుతుంది సోదరా..?

గగన్‌: ఇక్కడి దాకా వచ్చి లోపలికి రావడానికి ఇబ్బందేంట్రా..?

చెర్రి: ఇన్నాళ్లు మన ఫ్యామిలీల మధ్య జరిగిన డిష్యూం డిష్యూంలు గుర్తుకు వచ్చి ఫీలవుతుంది. నిన్నే బయటకు రమ్మంటుంది రా..

ఇద్దరూ కలిసి బయటకు మీరా దగ్గరకు వెళ్తారు.

గగన్‌: నమస్తే పిన్ని…

మీరా: నమస్తే గగన్‌

గగన్‌: పిన్ని ఇక్కడెందుకు లోపలికి రండి.. మిస్టర్‌ ఆది.. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా..?

మీరా: అవేమీ వద్దులే గగన్‌. మీతో రెండు మాటలు మాట్లాడి వెళ్దామని వచ్చాను.

గగన్‌: చెప్పండి పిన్ని..

మీరా: ఎం చెప్పుకున్నా నలుగురిలో చెప్పుకుంటేనే బాగుంటుందనే ఉద్దేశంతోనే నేను ఇక్కడే నిలబడిపోయాను.

గగన్‌: ఏంటో చెప్పండి పిన్ని..

మీరా: ఇన్నాళ్లు నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటూ వచ్చాను గగన్‌. ఇదిగో ఈ చెర్రి ఇందు బిందు.. మా పిల్లలు పుట్టినట్టే మీ అమ్మకు మీరు పుట్టారు. మిమ్మల్ని ద్వేషించడంలో అర్తం లేదని ఇన్నాళ్లుగా నాకు అర్థం కాలేదు.

చెర్రి: అబ్బో ఇన్నాళ్లు మా అమ్మను అమాయకురాలే అనుకున్నాను. కాస్త తెలివి మీరిందని నాకు ఇప్పుడే అర్థం అయింది.

గగన్‌: నువ్వు నోరు మూయరా.. ఇప్పటికైనా మీరు లోపలికి రండి పిన్ని..

చెర్రి: ఇంకా నేను చెప్పాల్సింది ఉంది గగన్‌. ఈ రోజు మా  ఆయన బతికి ఉన్నాడంటే కారణం నువ్వే. ఆయన ప్రాణాలకు నీ ప్రాణాలు అడ్డేసి కాపాడావు. ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేను గగన్‌.

గగన్‌: నేనేం చేయలేదు పిన్ని..

మీరా: అని అంటానని ఈ వెధవ ఇక్కడికి తీసుకొచ్చాడు. కానీ మీరేంటో మీ బతుకులేంటో నాకు తెలియదేంట్రా..? నా మొగుడు చచ్చినట్టు నాటకం ఆడి దాచేస్తారేంట్రా..? మీవి చిల్లర బతుకులు.. నా పసుపు కుంకుమ తీసేస్తుంటే వద్దని అడ్డుకోలేదేంట్రా నువ్వు..

అంటూ మీరా తిడుతుంటే.. గగన్‌ నిజంగా నాకేం తెలియదు పిన్ని నన్ను నమ్మండి అంటూ మీరా కాళ్ల మీద పడతాడు. దీంతో మీరా గట్టిగా తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు హాస్పిటల్‌లో ఉన్న అపూర్వ.. శరత్‌ చంద్ర బతకాలి కానీ అప్పుడే స్పృహలోకి రాకూడదని ప్లాన్‌ చేస్తుంది. ఇంతలో భూమి వీడియో కెమెరా తీసుకుని హాస్పిటల్‌కు వస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!