Illu Illalu Pillalu Serial Today Episode రామరాజు ఇంట్లో పూజ పూర్తి అవ్వడంతో భార్యలు తమ భర్తల కాళ్లకు దండం పెడతారు. తర్వాత వల్లీ పుట్టింటికి వెళ్లి తల్లీదండ్రుల మీద ఎండు ఆకులు వేసేసి నర్మద, ప్రేమల చేత ఆట బొమ్మ అయిపోయా అని తల్లిని తిడుతుంది. దిక్కుమాలిన అబద్ధాలు ఆడి నన్ను ప్రశాంతంగా లేకుండా చేసేశారని తిడుతుంది. మొన్నటి వరకు పది లక్షలు టెన్షన్, నిన్నటి వరకు ప్రేమ నగలు టెన్షన్ ఇప్పుడు నేను ఏమ్‌ఏ ఇంగ్లీష్ అని చెప్పారు.. నాకు తెలుగే సరిగా రాదు ఇప్పుడు ఇంగ్లీష్ నా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు అని అంటుంది. 

Continues below advertisement

ఆనంద్‌రావు కూతుర్ని కూర్చొపెట్టి మంచో చెడో నీకు మంచి జీవితం ఇవ్వాలి అని బద్ధాలు చెప్పి మోసాలు చేసి నీకు పెళ్లి చేశాం.. ఇదంతా మేమే చేశాం కాబట్టి మేమే చూసుకుంటాం. నిజానికి నర్మద, ప్రేమలు మంచోళ్లు తల్లి నీ కాపురం కూలిపోకూడదు అని నిజం చెప్పలేదు.. నువ్వు వాళ్ల జోలికి వెళ్తే వాళ్లు నీ జోలికి వస్తారు కానీ లేదంటే నీకు వాళ్లతో ఏం భయం లేదు ప్రశాంతంగా నీ భర్తతో నువ్వు ఉండు తల్లి.. నీ జోలికి వాళ్లు వస్తే అప్పుడు చూసుకుందాం అని ఇడ్లీబాబాయ్ కూతురికి నచ్చచెప్తాడు. 

ఇంతలో భాగ్యం వచ్చి నా కూతుర్ని వాళ్లు ప్రశాంతంగా ఉండనివ్వరు.. నా కూతురు దాని భర్తో ప్రశాంతంగా ఉండాలి అంటే వాళ్లిద్దరూ దీని గుప్పెట్లో ఉండాలి.. పెద్ద నీతి కబుర్లు చెప్తున్నావ్ వెళ్లు పక్కకి అని భాగ్యం అంటుంది. అవునమ్మా వాళ్లతో నేను కబాడీ  ఆడుకోవాలి నా గుప్పెట్లో ఉంచుకోవాలి అని అంటుంది. అమ్మడు నీ గుప్పెట్లోకి వాళ్లు వచ్చేశారే.. ఇద్దరు కొడుకులు తండ్రులకు ఎదురు తిరిగి పెళ్లాలకు మద్దతు ఇచ్చారా.. కొడుకులు తండ్రికి మధ్య చిచ్చు ఉంది అది అతి త్వరలో పెద్దది అవుతుంది. చూస్తా ఉండు ఆ ఇంట్లో నర్మద, ప్రేమల వల్ల తండ్రీ కొడుకుల మధ్య ఎంత దుమారం రేగుతుంతో ఇక రామరాజు ఇంట్లో రణరంగమే అని భాగ్యం అంటుంది.

Continues below advertisement

ప్రేమ ఆరు బయట కూర్చొని నెయిల్ పాలీష్ వేసుకుంటూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ వచ్చి ప్రేమ చేతికి ఓ కవరు ఇచ్చి అది ఓపెన్ చేసి చూడమని అంటాడు. ప్రేమ అది చూసే టైంకి ధీరజ్ ప్రేమ కాలికి నెయిల్ పాలీష్ పెడతాడు. హాల్‌టికెట్ ఏంట్రా నీ ముఖానికి ఏం పరీక్ష రాస్తున్నావ్ అని అడిగితే పేరు చూడు అని అంటాడు. ప్రేమ చూసి నాది.. ఇదేంట్రా నేను పోలీస్‌ రిటెన్ టెస్ట్‌కి అప్లే చేయలేదు కదరా అటే నేను చేశాను అని అంటాడు. అప్లే చేసినట్లు చెప్పలేదు కదరా అంటే సర్ఫ్రైజ్ చేద్దాం అని చెప్పలేదు అంటాడు. ప్రేమ చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఈ రోజు నుంచి గట్టిగా చదువుకో అని చెప్తాడు. పరీక్ష నేను రాయిస్తా నిన్ను హైదరాబాద్ తీసుకెళ్తా.. అని అంటాడు. మామయ్య ఒప్పుకోరు కదరా అని ప్రేమ అంటే చెప్పకుండా తీసుకెళ్తా అని ధీరజ్ అంటాడు. మామయ్యకి తెలీకుండా వెళ్లడం అంటే ఇక అంతే అని ప్రేమ అంటుంది. ఏది ఏమైనా నేను నిన్ను తీసుకెళ్లి పరీక్ష రాయిస్తా ఈ విషయం నాకు వదిలేసి నువ్వు పరీక్షకి ప్రిపేర్ అవ్వు అని అంటాడు.

సాగర్ ఓ జాబ్ కన్సల్టేషన్‌ దగ్గరకు వెళ్లి తనకు గవర్నమెంట్ జాబ్ కావాలి వచ్చే ఏర్పాట్లు చేయమని అడుగుతాడు. మొన్న నువ్వు రాసిన పరీక్ష రిజల్ట్‌లో నీ మార్కులు చూశాక నువ్వు అసలు పరీక్ష రాసి పాసవ్వడం జరగని పని ఇక వదిలేయ్ అని అతను సాగర్‌ని పంపేస్తాడు. సాగర్ బాధగా వెళ్తే ఎదురుగా నర్మద ఉంటుంది. ఇక్కడేంటి అని అడుగుతుంది. సాగర్ డల్‌గా ఉండటం గురించి నర్మద ప్రశ్నిస్తుంది. ఏం లేదని సాగర్ అనేస్తాడు. రాత్రి ఇంట్లో అందరూ భోజనాలు చేస్తుంటారు. ఇంతలో ప్రేమ వల్లీని వల్లీ అక్కాయ్ నువ్వు ఎమ్ఏ ఇంగ్లీష్ చేశావ్ కదా అని అడుగుతుంది. వల్లీ దెబ్బకి పొలమారుతుంది. తర్వాత ఎమ్‌ఏ ఇంగ్లీష్ బీభత్సంగా చదివేశా అని అంటుంది. నర్మద వల్లీతో నేను గవర్నమెంట్ జాబ్ చేయాలి అనుకున్నా.. ప్రేమ పోలీస్ అవ్వాలి అనుకుంది మరి నీకు ఏం అవ్వాలి అని అంది అని అంటుంది. నా పని అయిపోయిందిరా అని వల్లీ అనుకుంటుంది. తర్వాత నర్మద వాళ్లతో నేను అత్తయ్యకి ఇంటి పనిలో సాయం చేయాలి.. మామయ్య అత్తయ్యని చూసుకోవాలి  అని అంటుంది. నర్మద, ప్రేమ ఇద్దరూ రెచ్చ గొట్టి వల్లీతో ఇప్పటి వరకు అత్తయ్య గారు వంట గదికి రాణి ఇక నుంచి నేను రాణి అని అనేలా చేస్తారు. రామరాజు వల్లీని పొగిడేస్తారు. అత్తయ్యకి సాయం చేయడానికి మాత్రమే ఉండిపోయా లేదంటే నేను మీ కంటే పెద్ద ఉద్యోగం చేసేదాన్ని అని వల్లీ అనగానే వెళ్లమ్మా రేపటి నుంచి నువ్వు ఉద్యోగానికి వెళ్లు అని వేదవతి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.