Brahmamudi Serial Today Episode: కేరళలో రిసార్ట్‌కు వెళ్తున్న రాజ్‌ కారుకు ఎదురుగా గాయాలతో వచ్చిన వ్యక్తి కింద పడిపోతాడు. రాజ్‌, కావ్య వెళ్లి అతన్ని వివరాలు అడిగితే అతను మాట్లాడలేకపోతుంటాడు.

Continues below advertisement

రాజ్‌:  ఎవరు నువ్వు.. ఎవరు నిన్ను కొట్టింది.. కళావతి కొంచెం వాటర్‌ తీసుకురా..

కావ్య కారు దగ్గరకు వెళ్లి వాటర్‌ తీసుకొస్తుంటే.. రాజ్‌ కావ్య వైపు చూస్తుంటాడు. ఆ వ్యక్తి ఒక పెన్‌డ్రైవ్‌ రాజ్‌ జేబులో పెట్టి చనిపోతాడు.

Continues below advertisement

రాజ్‌: కళావతి మనం వెంటనే రిసార్ట్‌కు వెళ్దాం పద

కావ్య: ఏవండి మరి ఈ బాడీ

రాజ్: ఏయ్‌ ఇది తీసుకుని వెళ్తామా ఏంటి..? ఎవడో ఏంటో వదిలేసి వెళ్లిపోవడమే..

ఇద్దరు వ్యక్తులు అక్కడికి వస్తారు.

రౌడీ: హలో వదిలేసి వెళ్లడానికి అది పచ్చడి పెట్టుకునే జాడీ అనుకున్నారా..? పచ్చడి అయిపోయిన బాడీ

రాజ్‌: మీరెవరు..? ఇతను మీకు తెలుసా..? ఎవరు చంపారు..

కావ్య: ఇతని పేరేంటి..? అసలు ఏమైందండి

రాజ్: ఏంటి అలా చూస్తున్నారు మీరేనా ఇతన్ని కొట్టింది

రౌడీ: చూడండి ప్రశ్నించాల్సింది మేము మీరు కాదు

రాజ్‌: వాడు గుద్దింది మా కారును

రౌడీ: అయితే మీరు వాణ్ని కారుతో గుద్ది చంపేశారన్న మాట. ఇంతకీ వాడు మీకేం చెప్పాడు

అంటూ రౌడీ బెదించడంతో రాజ్‌, కావ్య వార్నింగ్‌ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి రాత్రి పది గంటలకు ఇంటికి వస్తారు అప్పు, కళ్యాణ్‌. చప్పుడు చేయకుండా దొంగల్లా రూంలోకి వెళ్తుంటే.. ధాన్యలక్ష్మీ వచ్చి లైట్‌ వేస్తుంది. ధాన్యలక్ష్మీని చూసిన అప్పు, కళ్యాణ్‌ షాక్‌ అవుతారు.

కళ్యాణ్‌: అమ్మా ఏంటి..? ఇంకా నువ్వు పడుకోలేదా..?

అప్పు: ఇప్పటి దాకా పడుకోకపోతే మీ ఆరోగ్యం ఏమవుతుంది అత్తయ్య.

ధాన్యలక్ష్మీ: నా ఆరోగ్యానికి ఏం కాదు కానీ నీ ఆరోగ్యం సంగతేంటి..?

కళ్యాణ్‌: తన ఆరోగ్యం సంగతేంటి అమ్మ గుండ్రాయిలా ఉంటేనూ..

ధాన్యం: గుండ్రాయిలా ఉంటే మరి హాస్పిటల్‌కు ఎందుకు వెళ్లారు..?

కళ్యాణ్‌: ఓ అదా అవును అమ్మ నిన్నటి వరకు పొట్టి ఆరోగ్యం గుండ్రాయిలా ఉండేది. కానీ ఇవాళే  కాస్త ఇబ్బంది పెట్టింది అందుకే హాస్పిటల్‌కు వెళ్లాం

ధాన్యం: హాస్పిటల్‌కు వెళ్లారు సరే మరి ఇంత లేట్‌ ఎందుకు అయింది

కళ్యాణ్‌: ఎంతయింది జస్ట్‌ ఎనిమిదే కదా అమ్మా

ధాన్యలక్ష్మీ  టైం చూస్తుంది. పది అవుతుంది. ఇంతలో ప్రకాష్‌ వస్తాడు. ఏదో సర్ది చెప్పి కళ్యాణ్‌, అప్పులను పంపించేస్తాడు. ధాన్యలక్ష్మీ ప్రకాష్‌ను కోపంగా చూస్తుంది. మరోవైపు రిసార్ట్‌లో ఉన్న కావ్య ఆలోచిస్తుంది.

రాజ్: ఏంటి శ్రీమతి గారు ఏంటో తీవ్రంగా ఆలోచిస్తున్నారు

కావ్య: అదేనండి ఇందాకా ఎవరో వచ్చి మన కారుకు గుద్దు కోవడం ఏంటి…?

రాజ్‌: ఏయ్‌ కళావతి ఏంటా మాటలు వాడు మన కారుకు గుద్దుకోలేదు. కారు దగ్గరకు వచ్చి పడిపోయాడు.

కావ్య: అదేనండి చూస్తుండగానే ప్రాణం పోయింది. మనం వచ్చింది దేనికి.. అలా జరగడం ఏంటి అని తలుచుకుంటేనే భయం వేస్తుందండి

రాజ్: కళావతి ఇంకా ఆ విషయమే ఆలోచిస్తున్నావా..? నువ్వు

కావ్య: అలోచించకుండా ఎలా ఉండగలం అండి వాళ్లేదో రౌడీలా ఉన్నారు. మన దగ్గరకు వచ్చి మనల్నే ప్రశ్నించారు కాస్తలో కాస్త తప్పించుకున్నాము

రాజ్‌: అబ్బా కళావతి అలా మాట్లాడకు మనం ఏమైనా తప్పు చేశామా..? తప్పించుకోవడానికి అయినా మనం వచ్చింది వైద్యం చేయించుకోవడానికి వైద్యం చేయించుకుని హైదరాబాద్‌ వెళ్లిపోవాలి. అనవసరమైన విషయాల మీద ఫోకస్‌ పెట్టొద్దు.. ఇదిగో ఈ కషాయం తాగు

అంటూ రాజ్‌ కషాయం ఇవ్వగానే.. తాగి చేదుగా ఉందని తాగనని మారాం చేస్తుంది కావ్య. దీంతో రాజ్‌, కావ్యను బుజ్జగిస్తుంటాడు. కషాయం తాగాలని సాంగ్‌ పాడుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!