Meghasandesam Serial Today Episode: కేపీని షూట్‌ చేసింది తానేనని మీరా తెలిస్తే తన  పరిస్థితి ఏంటని బాధపడుతున్న శరత్‌ చంద్ర పాయిజన్‌ తాగి చనిపోవాలనుకుంటాడు. అనుకున్నట్టుగానే పాయిజన్ తాగేస్తాడు. మరోవైపు హాస్పిటల్‌ లో ఉన్న ఎస్పీ సూర్య దగ్గరకు భూమి వెళ్తుంది. అప్పుడే పోలీస్‌ హైయ్యర్‌ ఆఫీసర్స్‌ వచ్చి సూర్యతో మాట్లాడి వెళ్లడం చూస్తుంది. వాళ్లు వెళ్లిపోయాక భూమి ఐసీయూలోకి వెళ్తుంది. భూమిని చూసి సూర్య షాక్‌ అవుతాడు.

Continues below advertisement

సూర్య: నువ్వా ఎందుకు వచ్చావు ఇక్కడికి

భూమి: వచ్చి చాలా సేపు అయ్యిందండి.. మీకు థాంక్స్‌ చెప్పాలని వచ్చాను.

Continues below advertisement

సూర్య: ఎందుకు థాంక్స్‌ మీ ఆయన చేతుల్లో దెబ్బలు తిన్నందుకా..? మీ ఆయన వల్లే ఇప్పుడు నేను హాస్పిటల్‌లో ఉన్నందుకా..?

భూమి: ఇందాక మీరు మీ పై ఆఫీసర్స్‌ తో మాట్లాడటం నేను విన్నానండి. కొట్టింది ఆయనే అని తెలిసి కూడా మీరు ఆయన పేరు చెప్పలేదు కదా..? అందుకు.

సూర్య: ఓ మీ ఆయనకు నేను మేలు చేశాను అనుకుంటున్నావా..? చెప్తే మా డిపార్ట్‌మెంట్‌ వాణ్ని శిక్షిస్తుంది. నాకు అది ఇష్టం లేదు. ఇప్పుడు నా మెయిన్‌ టార్గెట్‌ మీ మామయ్య కేపీ కాదు. మీ ఆయన గగన్‌. నేనే స్వయంగా నా చేతులతో కొట్టాలి. ఇప్పుడు నేను హాస్పిటల్‌ లో పడి ఉన్నానే సరిగ్గా వాడు ఇలాగే పడి ఉండాలి.

అంటూ కోపంగా లేవబోతుంటే.. కింద పడబోతాడు. భూమి పట్టుకుని బెడ్‌ మీద పడుకోబెడుతుంది. ఇంతలో ఐసీయూ దగ్గరకు గగన్‌ వచ్చి చూస్తుంటాడు.

భూమి: సూర్య గారు ఆవేశపడకండి. మీ అన్నయ్యను చంపించారన్న అపార్థంతో మీరు మా మామయ్యను చంపాలనుకున్నారు. ఎంత కాదనుకున్నా మా మామయ్య వాళ్ల నాన్న మరి కోపం రాదా..? అందుకే కొట్టారు. ఈ కోపతాపాల్ని ఇంతటితో వదిలిపెట్టేయండి. ఒక సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ గా ఇంకొక్కసారి మీ అన్నయ్య మర్డర్‌ కేసును విచారించి నిజానిజాలు తెలుసుకోండి.

సూర్య: ఇంక తెలుసుకునేది ఏమీ లేదు.

భూమి: ఫ్లీజ్‌ అండి మా ఆయన్ని ఏమీ చేయకండి.

సూర్య: మీ ఆయన్ని చంపాకే ఏ ఎంక్వైరీ అయినా..? ఎన్నాళ్లు మీ ఆయన బతకడు. మీ నాన్న దగ్గరకు వెళ్లిపో

భూమి: ఫ్లీజ్‌ అండి ఈ కక్షలు ఇంతటితో వదిలేయండి. ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఆలోచించండి.  

అంటూ భూమి రిక్వెస్ట్‌ చేస్తుంటే.. గగన్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత ఇంటికి వెల్లిన గగన్‌, భూమి ఐసీయూలో సూర్యతో మాట్లాడింది గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మరోవైపు భూమి తాను కెమెరా ఇచ్చిన షాపు వెళ్తుంది. అక్కడ కెమెరా రిపేరు చేసిన వ్యక్తి భూమికి కెమెరా ఇస్తాడు.

వ్యక్తి: ఇందులో రికార్డు అయిన డేటా అంత ఉంది ఒకసారి చెక్‌ చేసుకోండి మేడం.

అని చెప్పగానే.. భూమి కెమెరా ఓపెన్‌ చేస్తుంది. అందులో అపూర్వ, శోభాచంద్రను చంపింది మొత్తం వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసిన భూమి షాక్‌ అవుతుంది. తర్వాత అక్కడి నుంచి గగన్‌ దగ్గరకు వెళ్తుంది భూమి. ఇన్నాళ్లు మీ నాన్న మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణం, మా అమ్మ చావుకు కారణం ఈ కెమెరాలో ఉందని చెప్తుంది. గగన్‌ ఆశ్చర్యపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!