Ammayi garu Serial Today Episode: అశోక్‌ ఫోన్‌కోసం కోమలి ఎదురుచూస్తుంటుంది. రోజూ ఈ సమయానికి ఫోన్ చేసే వాడు కదా...పైగా నేను చేస్తుంటే తన ఫోన్ స్విచ్ఛాప్ రావడం చూసి కంగారుపడుతుంది. ఇంతలో అశోక్‌ ఫోన్ చేయగా...అతనిపై అరుస్తుంది. నాకు తెలియకుండా  ఫోన్ ఎందుకు స్విచ్ఛాప్‌ చేశావని అడుగుతుంది. నేను ఎంత కంగారుపడుతున్నానో తెలుసా అంటుంది. ఇంతలో అశోక్‌ నేను చాలా పెద్ద ప్రాబ్లంలోఉన్నానని చెబుతాడు. ప్రస్తుతానికి ఎవరికి దొరకలేదంటాడు. సీక్రెట్ ప్లేస్‌లో సేఫ్‌గా దాక్కున్నానని అంటాడు. నువ్వు దాక్కోవాల్సిన అవసరం ఏముందని...అసలు ఏం జరిగిందని నిలదీస్తుంది. నీకు ఏం కాకూడదని...నువ్వు భయపడకూడదనే నేను ఈ ప్రాబ్లంలో ఇరుక్కున్నానని చెబుతాడు. నువ్వు అనాథ ఆశ్రమంలోనే ఉన్నావని నిరూపించేందుకు రాజు, రూప,విరూపాక్షి కలిసి మీ ఇంటికి బయలుదేరారని...నిన్ను ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తుండగా....ఓ ఐడియా వచ్చిందని చెబుతాడు. తానే విరూపాక్షి గన్‌లో నుంచి బుల్లెట్‌ తీసి ఆ బుల్లెట్‌తోనే చిట్‌ఫండ్ కంపెనీ మేనేజర్‌ను చంపేసి ఆ నేరం విరూపాక్షి మీద పడేలా చేశానని చెబుతాడు. కొన్నిరోజుల్లో మన పెళ్లి పెట్టుకున ఇలా ఎందుకు చేశావని కోమలి అశోక్‌పై మండిపడుతుంది. నిన్ను ప్రాబ్లంలో నుంచి బయటపడేయాలనే  నేను ఆపని చేశానని చెబుతాడు. దీంతో కోమలి ఇదంతా ఎవరు చేయమన్నారు అని అడుగుతుంది. దీపక్‌,విజయాంబికానే ఈ ఐడియా ఇచ్చారని చెప్పి...ఫోన్ కట్‌ చేస్తాడు. నాకు చెప్పకుండా  నా అశోక్‌ను ఈ కేసులో ఇరికిస్తారా అంటూ కోమలి విజయాంబిక మీద కోపంతో రగిలిపోతుంది.

Continues below advertisement

   అటు యువరాజు పోలీసులు ఇచ్చిన సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలనగా చూస్తూ ఉంటాడు. ఇది ఖచ్చితంగా మార్ఫింగ్ వీడియో అంటాడు. ఎవరో కావాలనే అమ్మగారిని ఈ కేసులో ఇరికించారని అంటాడు. ఈ హత్య చేసిన వాళ్లను పట్టుకోవాలని అంటాడు.   అటు విజయాంబిక,దీపక్‌ కూడా కంగారు పడుతుంటారు. అశోక్‌ సీక్రెట్ ప్లేస్‌లోనే ఉన్నాడు కదా...వాడు దొరికాడంటా మనం దొరికిపోతాం అని అంటుంది. ఇంతలో అక్కడికి కోమలి వచ్చి వారిద్దరిపైనా మండిపడుతుంది. మీరు దొరికిపోకుండా ఉండేందుకు నా అశోక్‌ను ఇరికిస్తారా అంటూ కేకలు వేస్తుంది.  నేను పెళ్లిచేసుకోవాలనుకున్న అశోక్‌తో హత్య చేయించి నా జీవితం నాశనం చేయాలని అనుకున్నారా అని నిలదీస్తుంది. ఇంతలో దీపక్‌ ఆమె ఒంటిపై చేయి వేసి నీకు కొత్త జీవితం ఇవ్వాలనకుంటున్నా అంటాడు. వెంటనే కోమలి దీపక్ చెంప పగులగొడుతుంది. వంకర కూతలు కూస్తే నాలుక తెగిపోద్దని హెచ్చరిస్తుంది.ఇంతలో విజయాంబిక  కలుగజేసుకుని నీ గురించి నిజం తెలిస్తే అందరికీ ప్రాబ్లం వస్తుందనే ఈ పని చేయించానని సర్దిచెబుతుంది. నిన్ను కాపాడటం కోసమేనంటుంది. నా కోసమే అయితే అశోక్‌ కాకుండా  వేరే ఎవరితోనైనా ఈ పని చేయించొచ్చు కదా అని నిలదీస్తుంది. రాజు ఈ విషయాన్ని అంత తేలికగా వదిలిపెట్టడని తెలుసుకదా అంటుంది. అశోక్‌కు ఎమైనా అయితే...నేను ఊరుకోను అంటుంది. ఆధారాలన్నీ చెరిపివేశామని...అశోక్‌ కు శిక్షపడే అవకాశమే లేదని అంటారు. విరూపాక్షికి శిక్షపడిన తర్వాత ఈ ఆస్తి మొత్తం రాయించేసుకుని  నీవాటా నువ్వు తీసుకుని వెళ్లి అశోక్‌ను పెళ్లి చేసుకోవచ్చని విజయాంబిక చెబుతుంది. ఈలోగా అశోక్‌కు  ఏం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదేనని చెప్పి అక్కడి నుంచి కోమలి వెళ్లిపోతుంది.               

                 హత్య జరిగిన చిట్‌ఫండ్ కంపెనీలో ఉన్న సీసీ ఫుటేజ్ చెక్‌ చేయడం కోసం రాజు, రూప అక్కడికి వెళ్తారు. సెక్యూరిటీని అడిగి సీసీ ఫుటేజ్‌ చూస్తారు.అందులో ఒక కెమెరా  ఫుటేజీ తీసివేసి ఉండటంతో రాజు వాళ్లను అడుగుతాడు. దీనికి వారు మాకేం తెలియదని సమాధానమిస్తారు. ఇంకో కెమెరాలో రికార్డయిన ఫుటేజ్ పరిశీలించగా....ఓ వ్యక్తి మేనేజర్‌ను చంపి బయటకు వెళ్లిపోతున్న వీడియో స్పష్టంగా కనిపిస్తుంది. వాడి చేతిలో గన్‌ ఉన్నప్పటికి  ముఖం కనిపించకుండా టోపీ అడ్డుపెట్టుంటాడు. వీడే ఆ మర్డర్‌ చేశాడని రాజు అంటాడు. ప్రస్తుతానికి వీడెవడో కనిపెట్టలేకపోవచ్చు గానీ...అమ్మగారు మాత్రం తప్పుచేయలేదని నిరూపించవచ్చని అంటాడు.

Continues below advertisement