Meghasandesam Serial Today Episode: భూమి, గగన్‌లను శరత్చంద్ర, అపూర్వ, కేపీ, నక్షత్ర ఎత్తుకోవడంతో ఒకరినొకరు దండలు మార్చుకుంటారు. ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకుంటుంటారు. ఇంతలో వాళ్లను కిందకు దించేస్తారు. అప్పుడే చెర్రి దగ్గరకు వెళ్తాడు.
చెర్రి: వెయిట్ వెయిట్ అప్పుడే అయిపోలేదు. నెక్ట్స్ ఐటమ్ వర్షంలో తడసిన ఒక ఫీలింగ్.. వసంతోత్సవం..
అని చెప్పగానే.. అందరూ బయటకు వెళ్తారు. అక్కడ పసుపు నీళ్లు కలిపి రెడీగా ఉంటాయి. గగన్, భూమి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు.
చెర్రి: ఒకే ఒకే ఇక మీరు చూసుకున్నది చాలులే కానీ కానివ్వండి..
అని చెప్పగానే.. గగన్, భూమి తలో చెంబుతో పసుపు నీళ్లు తీసుకుని ఒకరి మీద ఒకరు పోసుకుంటారు. ఆ నీళ్లతో తడిసిపోతూ.. ఎగ్జైట్‌గా ఫీలవుతుంటారు. వాళ్లను చూసిన కేపీ, చెర్రి హ్యాపీగా ఫీలవుతుంటారు. భూమి, గగన్ ఒకరి మీద ఒకరు పోటీ పడి మరీ నీళ్లు పోసుకుంటుంటారు. వాళ్లను చూసిన కేపీ ఎమోషనల్ అవుతాడు. చెర్రి శారదకు వీడియో కాల్ చేసి చూపిస్తాడు. గగన్, భూమిలను వీడియో కాల్ లో చూసిన శారద సంతోషపడుతుంది. ఇంతలో బిందు శివకు ఫోన్ చేస్తుంది.
శివ: హలో చెప్పు బిందు..
బిందు: మా మామయ్య పిలిస్తేనే మా అన్నయ్య గగన్, భూమి ఇంటికి వచ్చారు శివ.
శివ: తెలుసు బిందు వాళ్లు బయలుదేరేటప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను.
బిందు: ఏదో ఒకటి చెప్పి నువ్వు కూడా వాళ్లతో రావాల్సింది శివ. పెళ్లి తర్వాత జరిగే ఆచారాలు ఎంత బాగుంటాయో నువ్వు కూడా చూసుండేవాడివి.
శివ: అవును వాటితో పాటు నిన్ను కూడా చూసే వాడిని..
బిందు: అవును ఒకరిని ఒకరం చూసుకుంటూ.. రాబోయే కాలంలో మన పెళ్లి అయ్యాక భూమి ప్లేసులో నన్ను.. అన్నయ్య ప్లేస్‌లో నిన్ను ఊహించుకుని మురిసిపోయేవాళ్లం కదా..?
శివ: చాలా దూరం వెళ్లిపోతున్నావు బిందు. ముందు మన చదువులు పూర్తి అవ్వాలి. తర్వాత మన ప్రేమను మీ ఇంట్లో ఒప్పుకోవాలి. ముఖ్యంగా మా భూమి అక్క ఒప్పుకోవాలి. చాలా తతంగమే ఉంటుంది.
బిందు: మా ఇంట్లో ఒప్పుకోవాలి అన్నావు అంత వరకు ఓకే మధ్యలో భూమి అక్క ఒప్పుకోవాలి అంటావేంటి..?
అని బిందు అడగ్గానే.. శివ షాక్ అవుతాడు. వెంటనే అంటే ఇప్పుడు భూమి అక్క నాకు సొంత అక్క లాగా కదా అందుకే అలా అన్నాను అంటూ తప్పించుకుంటాడు శివ. మరోవైపు బయటి నుంచి ఇంట్లోకి వెళ్తారు గగన్, భూమి. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చుని ఉంటారు. ఇద్దరి ముందు బిందె ఉంటుంది.
చెర్రి: ఈ బిందెలో ఉంగురాలు తీసే ఆట ఎందుకు ఆడిస్తారో తెలుసా..? అన్నయ్య..
గగన్: ఎందుకు..?
బిందు: ఈ బంగారపు ఉంగరం ఎవ్వరికి దొరుకుతుందో..? వాళ్లు జీవితాంతం వెండి ఉంగరం దొరికిన వాళ్లను డామినేషన్ చేస్తారన్నమాట
అంటూ చెర్రి చెప్పి బిందెలో ఉంగరాలు వేస్తాడు. వాటిని తీసుకోవడానికి గగన్, భూమి పోటీ పడుతుంటారు. పక్కనున్న వాళ్లు వాళ్లను కమాన్ అంటూ ప్రోత్సహిస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!