Meghasandesam Serial Today Episode: అపూర్వ ఇంటికి పోలీస్ ఎవిడెన్స్‌తో వెళ్తాడు. ఎవిడెన్స్ చూపిస్తూ నేను ముందే చెప్పాను కదా శరత్ చంద్ర గారు ఎస్సై మర్డర్ వెనక ఒక లేడీ ఉందని చెప్పాను కదా..? ఇదిగో మర్డర్ జరిగిన చోట ఒక గాజు దొరికింది అని చూపిస్తాడు. గాజు చూసిన అపూర్వ షాక్ అవుతుంది.
అపూర్వ: ( మనసులో అలా ఎలా వదిలేశావో రత్నం. నువ్వు చాలా పెద్ద ప్రొఫెషనల్ వి కదా..?) డీ ఎస్పీ గార ఆ గాజు ఎస్సైని మర్డర్ చేసిన ఆవిడదే అని అంత కన్ఫంగా ఎలా చెప్తున్నారు. ఆ గాజు డెడ్‌బాడీ దగ్గర దొరికిందా..?
డీఎస్పీ: లేదు అపూర్వ గారు కిచెన్‌లో దొరికింది.
అపూర్వ: కిచెన్‌లో దొరికింది అంటే మా వాచ్‌మెన్ వాళ్ల వైఫ్‌ది అయ్యుండొచ్చు కదా..?
శరత్: అపూర్వ ఏం మాట్లాడుతున్నావు.. మన వాచ్మెన్‌కు వైఫ్ లేదు కదా..?
అపూర్వ: అంటే ఇంతకముందు ఉన్న వాచ్‌మెన్ గురించి మాట్లాడుతున్నా..
శరత్: వాళ్లు వెళ్లిపోయి వన్ ఇయర్ అవుతుంది. ఈ సంవత్సరంలో దొరకనిది ఇప్పుడు దొరికింది అంటే కచ్చితంగా ఇది అ ఎస్సైని చంపిన మనిషిదే అయ్యుంటుంది.
అపూర్వ: కరెక్టే బావ కాకపోతే నేను కూడా అప్పుడప్పుడు గెస్ట్‌హౌస్ కు వెళ్లి వస్తుంటాను కదా అది నాది కూడా అయ్యుండొచ్చు కదా..?
డీఎస్సీ: అపూర్వ గారు చెప్పింది కూడా నిజమే.. మేడం మీరొకసారి ఈ గాజు వేసుకుని చూడండి.
అపూర్వ: అవునా ఎలా వేసుకోవాలి..? ఏవో టెస్టులు ఉంటాయి కదా..?
డీఎస్పీ: అన్ని టెస్టులు అయిపోయాయి ఇది ఇప్పుడొక మామూలు గాజు. వేసుకుని చూడండి.
అని ఇవ్వగానే అపూర్వ వేసుకోవాలని ట్రై చేస్తుంది. గాజు పట్టదు. దీంతో ఇది మీది కాదు లేండి..? అంటూ అది ప్రొఫెషనల్ కిల్లర్ ది అంటూ గాజు తీసుకుని డీఎస్పీ వెళ్లిపోతుంటే.. శరత్ చంద్ర ఆ గాజును అడిగి తీసుకుంటాడు. డీఎస్పీ గాజు ఇచ్చి వెళ్లిపోతాడు. తర్వాత శారదకు జరిగిన అవమానం తెలుసుకుని కోపంతో శరత్ చంద్ర ఇంటికి వెళ్తాడు గగన్. విషయం తెలిసి శరత్ చంద్ర కోపంగా గన్ తీసుకుని వచ్చి లోపలికి వస్తున్న గగన్‌ను కాల్చేస్తాడు. గగన్ తప్పించుకుని వచ్చి శరత చంద్ర చేతిలో ఉన్న గన్ లాక్కున్ని శరత్ చంద్రను ఎయిమ్ చేస్తాడు.
అపూర్వ: రేయ్ నా బావను చంపేస్తావా..? ఏంటి..?
గగన్: మా అమ్మకి అంత అవమానం జరగడానికి మూలం నువ్వే కదూ.. ముందు నువ్వు నీ వెనకే మీ ఆయన.
కేపీ: అరేయ్.. గగన్.. ఆగరా.
చెర్రి: అన్నయ్యా ఆగు అన్నయ్యా.. ఆగు..
అంటూ అడ్డు వెళితే దూరంగా నెట్టివేస్తాడు గగన్. సుజాతన పిలిచి శరత్ చంద్రను స్థంభానికి కట్టేస్తాడు గగన్.
గగన్: తీసేస్తే క్షణాలలో పోయే ప్రాణాలతో మా అమ్మకు జరిగిన అవమానం పూర్తిగా తీరిపోదు. ఆ రోజు మా అమ్మకు ఏం జరిగిందో ఈ రోజు అపూర్వకు కూడా జరగాలి
అని అపూర్వ చేత బొట్టు, గాజులు చెరిపేయిస్తాడు గగన్. శరత్ చంద్ర కోపంగా చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!