Illu Illalu Pillalu Serial Today Episode నర్మద, ప్రేమలు ఇడ్లీ బాబాయ్ ఇంటికి వెళ్లి బాగుంది బాబాయ్ మాకు ఎవరికీ తెలీకుండా మీరు దాచిన మీ ఇళ్లు చాలా బాగుంది. బాగానే తప్పించుకున్నారు కానీ మేం మిమల్ని నీడలా వెంటాడుతున్న సంగతి మర్చిపోయారు అని అంటుంది నర్మద. భాగ్యం, ఆనంద్ రావు షాక్ అయిపోతారు.
ఆనంద్రావు నర్మదతో మేం ఎవరికీ తెలీకుండా వచ్చాం కదా ఎలా మా అడ్రస్ కనిపెట్టారమ్మా అని అడుగుతాడు. దానికి నర్మద ఫోన్ చూపిస్తూ నీతో ఫొటోలు తీసుకొని పంపించుకున్నప్పుడు మీ లైవ్ లొకేషన్ పంపించేసుకున్నా అని చెప్తుంది. మోసం మోసం అని ఇడ్లీ బాబాయ్ అరస్తే మోసం అనడానికి మీకు సిగ్గుగా లేదా అని నర్మద ఫైర్ అవుతుంది. పెద్ద పెద్ద కంపెనీలు బిజినెస్‌లు ఉన్నాయి, బిల్డింగ్‌లు ఉన్నాయని మామయాటలు చెప్తారా.. మామయ్యని మోసం చేసి చందు బావతో వల్లిని పెళ్లి చేస్తారా.. మీ పాపం పండింది ఇప్పుడే వెళ్లి మా మామయ్య గారిని తీసుకొస్తానని ఇద్దరూ వెళ్తారు. ఇడ్లీ బాబాయ్ ఎంత బతిమాలినా నర్మద, ప్రేమ ఆగరు.
ఆనంద్ రావు తల బాదుకొని ఏడుస్తాడు. ఆవిడ గారండీ మన పని అయిపోయిందని ఇక మన పని శంకరగిరి మాణ్యానికే అండీ అని ఏడుస్తాడు. మరోవైపు చందు పదిలక్షల గురించి ఆలోచిస్తూ టెన్షన్‌గా వాకిట్లో కూర్చొని ఉంటాడు. రామరాజు చూసి చిన్నోడు, నడిపోడిని పిలిచి పెద్దోడు ఏంట్రా ఈ మధ్య డల్‌గా ఉన్నాడు తీసుకురండిరా అని చెప్తాడు. చందుని సాగర్, ధీరజ్‌లు పిలుస్తారు. ఏమైంది అని అడిగితే ఏం లేదని చందు అంటాడు. మేం చూసుకుంటాం అని ధీరజ్, సాగర్ పక్కనే ఉన్న ఉయ్యాలలోకి తీసుకెళ్లి చందుని నవ్వించేస్తారు. అది చూసి వేదవతి చాలా హ్యాపీగా ఫీలవుతుంది.
రామరాజు వేదవతితో ఏంటి కొత్తగా చూస్తున్నావ్ అంటే నిన్నటి వరకు ఈ సంతోషంగా లేం కదండీ వరలక్ష్మీ వ్రతంతో దూరం అయిన అన్నీ సంతోషాలు తిరిగి వచ్చాయ్ ఇళ్లు ఇంతకు ముందులా మారిపోయింది. సంతోషాలు నిండిపోయావని అంటుంది. ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే శాశ్వతంగా ఉండాలని అంటుంది. నీ నవ్వులు చూడటం కంటే నాకు పండగ ఇంకేముంటుంది అని రామరాజు అంటాడు. ఇందుకే కదా పడిపోయంది అని వేదవతి అంటుంది. కొడుకులు తల్లీతండ్రుల సంతోషం చూసి హ్యాపీగా ఫీలవుతారు. కోడళ్లు ముగ్గరు సొంత అక్కాచెల్లెళ్లలా కలిసిపోయారు అని మురిసిపోతుంది.
నర్మద, ప్రేమ ఇంటికి వస్తారు. అత్తామామలు సంతోషంగా నవ్వుకోవడం చూసి ఒకర్ని ఒకరు చూసుకుంటారు. ఇద్దరూ వాళ్ల దగ్గరకు వెళ్తుంటే వల్లి అడ్డు వస్తుంది. మీతో మాట్లాడాలి అని అంటుంది. ముగ్గురు పక్కకి వెళ్తారు. వల్లి సైలెంట్‌గా ఉంటే ప్రేమ కోపంగా ఏదో మాట్లాడాలి అని పిలిచావు కదా ఎందుకు పురుగులు తిన్న బల్లిలా సైలెంట్‌గా ఉంటావ్ విషయం చెప్పు అంటుంది. దాంతో వల్లి నా విషయంలో జోక్యం చేసుకోవడానికి మీకు ఏం హక్కు ఉంది.. మా ఇంటికి వెళ్లడానికి మీరు ఎవరు అని ప్రశ్నిస్తుంది. మీ వాళ్లు మోసం చేయడం నీ విషయం అవుతుందా అని అడుగుతుంది. నా వ్యక్తిగత విషయాలు మీకు ఎందుకు అని వల్లి దబాయిస్తుంది. దాంతో ప్రేమ ఏంటి వ్యక్తిగతం వ్యక్తిగతం అని దబాయిస్తున్నావ్.. మీరు కోటీశ్వరులు అని నువ్వు చదువుల తల్లి సరస్వతివి అని మీ అంత గొప్ప కుటుంబం లేదని మోసాల మీద మోసాలు చేసి నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి మా చందు బావని మోసం చేసి పెళ్లి చేసుకున్నావ్ కదా అది మీ వ్యక్తిగత విషయం ఎలా అవుతుంది ఇది మా ఇంటి విషయం అని ప్రేమ అంటుంది.
వల్లి రివర్స్ అయిపోతూ నేను చేసింద మోసం అయితే మీరు చేసింది ఏంటి మోసం కాదా.. అని అడుగుతుంది. మేం ఏం మోసం చేశామని అడుగుతారు. మీ ఇద్దరూ పెద్దోళ్లకు చెప్పి పెళ్లి చేసుకున్నారా లేచిపోయి పెళ్లిళ్లు చేసుకున్నారు అది తప్పు కాదా.. మీరు ఘనకార్యం చేసినట్లు మాట్లాడుతున్నారు సిగ్గు లేదా అని తిడుతుంది. నోరు జాగ్రత్త అని ఇద్దరూ వల్లిని అంటారు. మేం ప్రేమించుకొని పెళ్లి చేసుకొని పెద్దల్ని ఒప్పించుకున్నాం కానీ నువ్వు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అబద్ధాలు చెప్తూనే ఉన్నావ్ నీ బతుకే ఒక అబద్ధం అని నర్మద అంటుంది. దానికి వల్లీ ఈ ఇంట్లోకి కోడలిగి నేను ఎలా అడుగుపెడితే నీకు ఎందుకు ఏమైనా ఉంటే అత్తామామలు చూసుకుంటారు. మధ్యలో నీ బోడి పెత్తనం ఏంటి నోరు మూసుకొని కూర్చొకుండా అని అరుస్తుంది. దానికి ప్రేమ ఏయ్ వయసులో పెద్ద దానివి అని ఊరుకున్నా లేదంటే నువ్వు మాట్లాడే మాటలకు నీకు మామూలుగా ఉండదు అని తిడుతుంది. దాంతో వల్లి భయపడుతుంది. నీ అంత ఉత్తమమైన కోడలు ఉండదని మామయ్య గారు అనుకున్నారు అందుకే నిన్ను నెత్తిన పెట్టుకున్నారు. నీ గురించి నిజం చెప్తే గుండె పగిలి చస్తారు అని అంటుంది. ఇదేదో పనికి వచ్చిన విషయం అని మీరు ఇప్పుడు చెప్పినా మామయ్య గారు గుండె పగిలి పోతుందని అంటుంది.
ప్రేమ మళ్లీ ఫైర్ అయిపోతుంది. ఎలా బ్లాక్ మెయిల్ చేస్తుందో చూడు అక్క పద అక్కా వెళ్లి ఇప్పుడే చెప్దాం అని అంటుంది. వల్లి ఆగమని చెప్పినా ఇద్దరూ ఆగరు లోపలికి వెళ్తారు. నా పరిస్థితి ఏంట్రా దేవుడా అని వల్లి కంగారు పడుతుంది. నర్మద, ప్రేమలు ఆవేశంగా రామరాజు, వేదవతిల దగ్గరకు వెళ్తారు. వల్లీ గురించి చెప్పాలని ప్రేమ అంటుంది. వల్లీ గురించి చెప్పడం మొదలు పెట్టే టైంకి రామరాజుకి ఫోన్ వస్తుంది. రైస్ మిల్లులో దొంగలు పడ్డారని 5 లక్షలు దొంగతనం జరిగిందని రామరాజు పరుగులు తీస్తాడు. వేదవతి వాళ్లు కూడా వెళ్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.