Brahmamudi Serial Today Episode: కావ్య ప్రెగ్నెంట్‌ అని తెలుసుకున్న ధాన్యలక్ష్మీ బాధగా కావ్య రూంలోకి వెళ్తుంది. కావ్య పక్కన కూర్చుని ఎమోషనల్‌ అవుతుంది. తనను క్షమించమని అడుగుతుంది.

కావ్య: అయ్యో చిన్నత్తయ్యా మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి..?

ధాన్యలక్ష్మీ:  అయ్యో కావ్య నిన్ను నేను ఎన్నటికీ భరించలేని మాట అనేశాను. అయినా నన్ను ఎలా క్షమించగలుగుతున్నావు కావ్య.. ఇంత గొప్ప మనసు ఎలా వచ్చింది నీకు

కావ్య: చిన్నత్తయ్యా ఇంట్లో అందరూ మీలో కోపాన్ని చూశారు. కానీ నేను మీరు ఆ కోపంలో అప్పు మీద చూపిస్తున్న ప్రేమను చూశాను. ఒకప్పుడు అప్పనును మీరు ఈ ఇంటి కోడలిగా అసలు ఒప్పుకోలేదు. ఒక అత్తగా నా చెల్లెలి  కడుపులో పెరుగుతున్న మీ వారసుడిని మీరు పడుతున్న తపన ముందు ఆ కోపం ఏ పాటిది చెప్పండి.

ధాన్యం: అయితే నువ్వు కూడా తల్లివి కాబోతున్నావు కావ్య. ఒక బిడ్డను కడుపులో మోస్తున్నావు.. కానీ అప్పులాగా నువ్వు ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావు. ఏ ఆడది అయినా ముందుగా తన భర్తకు చెప్పుకుంటుంది. కానీ నువ్వు మాత్రం కళ్ల ముందు భర్త కనిపిస్తున్నా…? ఆ నిజాన్ని తనకు చెప్పుకోలేక నీలో నువ్వే బాధపడుతూ ఇన్ని రోజులుగా ఎంత నరకాన్ని అనుభవించావో నాకు అర్థం అవుతుంది.

కావ్య:  చిన్నత్తయ్యా ఆ దేవుడు నా తలరాతను అలా రాసి ఉంటే మీరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి అయినా తెలిసి చేస్తే పాపం అవుతుంది. మీకు నిజం తెలియక అలా మాట్లాడారు. ఇందులో మీ తప్పేం లేదు చిన్నత్తయ్యా.

ధాన్యం: కానీ నా మనసు ఒప్పుకోవడం లేదు కావ్య నేను చేసిన తప్పుకు నాకు శిక్ష పడాలి.

కావ్య: సరే మీరు కోరుకున్నట్టు గానే మీకు శిక్ష వేస్తాను.. అనుభవించడానికి మీరు సిద్దంగా ఉంటారా..?

ధాన్యం: సరే నువ్వు ఏ శిక్ష వేసినా  అనుభవించడానికి రెడీగా ఉంటాను కావ్య చెప్పు ఏం చేయమంటావు

కావ్య: చిన్నత్తయ్యా అప్పును చూసుకున్నట్టుగానే నన్ను కూడా చూసుకుంటారా..? అప్పు మీద చూపిస్తున్న ప్రేమని నా మీద కూడా చూపిస్తారా..?

రుద్రాణి:  వీళ్ల ఓవరాక్షన్‌ చూడలేకపోతున్నానురా..?

రాహుల్‌: మామ్ నువ్వు ఒకటి అనుకుంటే ఇంకోకటి జరిగింది. రాజ్ కు నిజం తెలిసేలా చేసి వాణ్ని దూరం చేద్దామనుకున్నావు.. ఇప్పుడు ఆ విషయం ఇంట్లో వాళ్లకు తెలిసి కావ్యను నెత్తిన పెట్టుకుని చూసేలా ఉన్నారు. నువ్వు ఎన్ని ప్లాన్స్‌ వేసినా.. ఎన్ని  ప్రమాదాలు సృష్టించినా చివరికి కావ్యకే మంచి జరుగుతుంది.

రుద్రాణి: ఇక జరగదురా..?

రాహుల్‌: ఇంట్లో అందరికీ తెలిసిపోయాక ఇంక నువ్వేం చేయగలవు మామ్‌

రుద్రాణి: లేదురా యామిని చేత రాజ్‌కు నిజం చెప్పిద్దాం.

అంటూ యామినికి వెంటనే ఫోన్‌ చేయాలి అంటూ పైకి రూంలోకి వెళ్లిపోతుంది. రాజ్‌ రూంలో ఆలోచిస్తూ ఉంటాడు. తాను అమెరికా వెళ్తున్నట్టు నాటకం ఆడి కావ్య మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటాడు. అనుకున్నట్టుగానే ఫ్రెండ్‌కు ఫోన్‌ చేసి అమెరికా టికెట్‌ బుక్‌ చేయమంటాడు. మరోవైపు రుద్రాణి, యామినికి కాల్ చేస్తుంది. విషయం చెప్పి రాజ్‌కు నిజం చెప్పమంటుంది. అలాగేనని యామిని రాజ్‌ దగ్గరకు వెళ్తుంటే మధ్యలో రాజ్ ఫోన్‌ చార్జింగ్‌ పెట్టి ఉంటాడు. అప్పుడే ఆ ఫోన్‌కు అమెరికా టికెట్‌ బుక్‌ అయినట్టు మెసేజ్‌ వస్తుంది. అది చూసి రాజ్‌ను అడుగుతుంది. రాజ్‌ తాను అమెరికా వెళ్తున్నట్టు చెప్తాడు. ఆ విషయం యామిని, రుద్రాణికి చెప్తుంది. రుద్రాణి దుగ్గిరాల ఇంట్లో అందరికీ చెప్తుంది. రాజ్‌ విషయం తెలిసి అందరూ షాక్‌ అవుతారు. అపర్ణ, ఇందిరాదేవి రాజ్‌ను ఎలాగైనా ఆపాలని వెళ్తారు. రాజ్‌ ఇంట్లోంచి లగేజీతో బయటకు వస్తుంటే వైదేహి కూడా ఆపాలని చూస్తుంది కానీ రాజ్‌ వినడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!