Madhuranagarilo August 9th: శ్యామ్ లెటర్ తీసుకొని తన తల్లి గదికి వెళ్ళగా ఆ లెటర్ లో ఏముందో రాధ కూడా శ్యామ్ ను ఫాలో అవుతుంది. ఇక గదిలో తన తల్లి లేకపోయేసరికి శ్యామ్ ఆ లెటర్ అక్కడ పెట్టి.. ఈ లెటర్ చదివి తన తల్లి అర్థం చేసుకుంటుంది అని అక్కడి నుంచి వెళ్తాడు. వెంటనే రాధ ఆ లెటర్ చూసి చదవటంతో అందులో తను సంయుక్తను ఇష్టంతో పెళ్లి చేసుకోవడం లేదని తను రాధ ని ప్రేమిస్తున్నాను అని ఉండటంతో అది చూసి రాధ షాక్ అవుతుంది.
ఆ లెటర్ ఎగురుకుంటూ ధనుంజయ కాళ్ళ దగ్గర పడుతుంది. ఇక ధనుంజయ దగ్గరికి వెళ్లి మెల్లగా ఆ లెటర్ తీసుకోవాలని చూస్తుండగా ఆ లెటర్ మళ్ళీ ఎగిరి వాసంతి వాళ్ళ దగ్గర పడుతుంది. ఇక అక్కడికి వెళ్లి తీసుకోవాలని చూస్తుండగా మళ్లీ ఎగిరి నేరుగా మధుర కాళ్ల దగ్గర పడుతుంది. మధుర లెటర్ తీస్తుండగా ఎక్కడ నిజం తెలుస్తుందో అని రాధ వెంటనే ఆ లెటర్ తీసుకుంటుంది.
అందులో ఏముంది అని మధుర అడగటంతో.. సరుకుల లీస్ట్ అని అబద్ధం చెప్పి ఆ లెటర్ ను డస్ట్ బిన్ లో పడేస్తుంది. ఆ తర్వాత అందరూ మెహందీ ఫంక్షన్ కి వెళ్లడానికి రెడీ అవుతూ ఉండగా.. మధుర చాలా సంతోషంగా కనిపిస్తుంది. ఇక శ్యామ్ తన తల్లిని చూసి ఇంత సంతోషంగా ఉంది ఏంటి.. లెటర్ చదివిందా లేదా అని అనుమానం పడతాడు.
తన తల్లి దగ్గరికి వెళ్లి లెటర్ గురించి మాట్లాడుతూ ఉండటంతో.. ఏం లెటర్ అని మధుర అడుగుతుంది. వెంటనే రాధ లెటర్ అంటే లేఖ కదా లేఖ అంటే శుభలేఖలు అని ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే పెళ్లి కార్డ్స్ పంచమని అక్కడ పెట్టాను అని అంటున్నాడు.. దాని గురించి అడుగుతున్నాడు అని వెంటనే శ్యామ్ కు రాధపై కోపం వస్తుంది.
అదే సమయంలో పండు వచ్చి ట్యాబ్ లో ఛార్జింగ్ లేదని అనటంతో వెంటనే శ్యామ్ నిన్న నువ్వే కదా ఛార్జింగ్ పెట్టావు అది ఎక్కడ ఉందో పండు కి వెతికి ఇవ్వు అని రాధ ని పైకి పంపిస్తాడు. ఇప్పుడే పని ఉందని చెప్పి శ్యామ్ కూడా రాధ దగ్గరికి వెళ్తాడు. ఆ లెటర్ ఎక్కడ వేశావు అని కోపంగా అడుగుతాడు. ఆ సంయుక్తను పెళ్లి చేసుకుంటే నాకు ఊపిరి ఆడదు అని.. నువ్వు ప్రేమించకున్నా సరే.. పెళ్లి ఆపాలనుకున్న నా ప్రయత్నానికి అడ్డుగా రాకూడదు అని.. మెహేంది ఫంక్షన్ అయిపోయేలోపు నిజం చెప్పేస్తాను అని తనపై కోపంగా అరిచి అక్కడ నుండి వెళ్తాడు.
ఇక రాధ చాలా బాధపడుతుంది. ఆ తర్వాత శ్యామ్ తన అమ్మ నాన్నలతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని అంటుండగా రాధ వచ్చి షాక్ అవుతుంది. ఇక విషయం చెప్పకుండా కాస్త ఊరిస్తూ ఉండటంతో మధుర ఇక నువ్వు చెప్పవులే అంటూ అక్కడి నుండి బయలుదేరుతుంది. ఇక నేను కూడా వస్తాను అని శ్యామ్ వాళ్లతో బయలుదేరుతాడు.
ఇక సంయుక్త వాళ్ళ ఇంటికి చేరుకోగా వారిని లోపలికి ఆహ్వానిస్తారు అపర్ణ వాళ్లు. ఇక అందరు ఇంట్లో కి రాగానే సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. కోడలి కోసం మధుర నగలు కూడా తీసుకొని వస్తుంది. తరువాయి భాగంలో సంయుక్త చెయ్యి మీద శ్యామ్ ఐ లవ్ యూ రాధ అని కోన్ తో రాయగా ఆ డిజైన్ చూడటానికి మధుర చెయ్యి చూపించమని అడుగుతుంది. ఇక శ్యామ్ బలవంతంగా చేయి చూపించడంతో వాళ్లంతా షాక్ అయినట్లు కనిపిస్తారు.
also read it : Prema Entha Madhuram August 8th: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: ఆర్య చేతుల మీదుగా పిల్లల అన్నప్రసన్న వేడుక, బయటపడ్డ మదన్ అసలు రూపం?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial