Madhuranagarilo July 3rd: గన్నవరం బ్యాచ్ పండుతో కలిసి క్రికెట్ ఆడుతూ ఉండగా బాలు వచ్చేసి శ్యామ్ గదిలో పడుతుంది. ఇక పండు శ్యామ్ గదికి వెళ్లి బాలు వెతికి తీసుకోగా అక్కడ రాధ, శ్యామ్ కలిసి ఉన్న ఫోటో చూసి మమ్మీ పక్కన డాడీ ఉండాలి కదా శ్యాం అంకుల్ ఉన్నాడు ఏంటి అని ఆ ఫోటో కిందికి తీసుకొని వెళ్తాడు. ఇక మధురకు బాలు దొరికిన విషయంతో పాటు ఫోటో దొరికిన విషయం కూడా చెబుతాడు.


ఇక ఆ ఫోటో ఎవరిది చూపించు అని మధుర అడగటంతో అప్పుడే అక్కడికి పండు వచ్చాడు అని రాధ వస్తుంది. ఇక పండు మమ్మీ ఫోటో ఉందని అనటంతో రాధకు అనుమానం వచ్చి వెంటనే ఆ ఫోటో తీసుకొని సర్ప్రైజ్ అంటూ మధురకు చెబుతుంది. ఇక పండు ఇది నేను చూశాను కదా అనడంతో అది నువ్వు చూడొచ్చు కానీ నాని చూడొద్దు అని చెప్పటంతో దానికి పండు సరే అని అంటాడు.


తర్వాత రాధ ఇంటికి వెళ్లి శ్యామ్ సర్ తనపై మీద ఉన్న ప్రేమతో ఫోటో ఎడిట్ చేసుకున్నాడని.. ఎలాగైనా తనను దూరం పెట్టాలి అని అనుకుంటుంది. ఇక గన్నవరం తన భార్యతో దయ్యం గా మారాను అని విషయం మొత్తం చెప్పటంతో గోపాల్ వాళ్ళు అసలు దయ్యం గన్నవరం అని తెలుసుకొని ఇంట్లోకి వెళ్లి తనను తన భార్య కొట్టిన వీడియో చూపిస్తూ వాళ్లను బెదిరించి గత రాత్రి తమ దగ్గర లాక్కున్న బంగారం, డబ్బులను వసూలు చేసుకుంటారు.


మరోవైపు మధుర రాధకు, సంయుక్తకు మధ్య ఏం గొడవ జరిగిందో సంయుక్త ద్వారా తెలుసుకోవాలని అనుకుంటుంది. అప్పుడే సంయుక్త అక్కడికి తన మమ్మీ నెక్లెస్ పంపింది అని చూపించడానికి వస్తుంది. ఆ తర్వాత మధుర నేరుగా విషయానికి వచ్చి రాధకు నీకు ఏం గొడవ జరిగింది అని అడుగుతుంది. దాంతో సంయుక్త మొత్తం నిజాన్ని బయటపెడుతుంది. శ్యామ్ రాధ ను ప్రేమిస్తున్నాడు అని.. గతంలో శ్యామ్ రాధకి చెప్పిన విషయాన్ని చెబుతుంది.


అంతేకాకుండా స్పెషల్ కార్డు వేయించాలన్న విషయాన్ని కూడా చెబుతుంది. అందుకే తనని ఇక్కడ్నుంచి పంపించాలని అనుకునేసరికి మీరు ఆపివేశారు అని చెబుతుంది. దాంతో ఆ మాటలు అన్ని విని షాక్ అయిన మధుర ఇప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాను అని అంటుంది. ఇంటి నుంచి పంపించేస్తారా పంపించేయండి ఆంటీ అని సంయుక్త అనటంతో.. కాదు రాధ ని శ్యామ్ కి ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటుంది.


దానితో సంయుక్త షాక్ అవుతుంది. అప్పుడే రాధ ఇంట్లోకి రావడంతో మధుర రాధ దగ్గరికి వెళ్లి నీకు శ్యామ్ తో పెళ్లి చేస్తాను అనటంతో రాధ ఆశ్చర్యపోతుంది. వెంటనే ఈ విషయం శ్యామ్ కి చెప్పాలి అని పిలుస్తూ ఉండగా సంయుక్త మధురను వద్దు అంటూ వాళ్లకెలా పెళ్లి చేస్తావు అని.. నా లైఫ్ పాడవుతుంది అంటుంది. కానీ మధుర శ్యామ్ కు ఇష్టం లేని పెళ్లి ఎలా చేయాలి అని.. ఈ విషయం ఇప్పుడే శ్యామ్ కి చెబుతాను అని బయలుదేరుతుండగా వెంటనే సంయుక్త మధుర చెయ్యి పట్టుకొని పక్కకు తోయటంతో మధుర తలకు గాయం అవుతుంది.


Also Read: Prema Entha Madhuram July 3rd: మాన్సీకి సరైన బుద్ది చెప్పిన అంజలి.. కొత్త ఉద్యోగంలో చేరిన అను?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial