Lakshmi Nivasam Serial Today Episode Review: ఓ వైపు పెళ్లి వేదిక వద్ద తులసి గౌరీ పూజ చేస్తుండగా.. వేదిక వద్దకు వస్తున్న వరుడు శ్రీ, వసుంధర, ఖుషీ కారుకు భార్గవ ప్లాన్ ప్రకారం ప్రమాదం జరుగుతుంది. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలవుతాయి. సుపర్ణిక, భార్గవ్ అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తారు. మరోవైపు వీరి కారుని గుద్దేసిన సిద్ధు ఆందోళనతో ఉండగా.. బసవ అతన్ని వారించి నామినేషన్ వేసేందుకు తీసుకెళ్తాడు. ఈ రోజు ఎపిసోడ్ విషయానికొస్తే..
ఆస్పత్రిలో శ్రీ, వసుంధర, ఖుషీ..
శ్రీ, వసుంధర, ఖుషీ ఆస్పత్రిలో చేర్పించి సుపర్ణిక ఆందోళనలో ఉంటుంది. భార్గవ్ సుపర్ణిక పక్కనే ఉండి ఓదారాస్తాడు. తులసి పేరెంట్స్‌కు ఫోన్ చేసి చెప్పాలని భార్గవ్ చెప్తాడు. దీంతో సుపర్ణిక శ్రీనివాస్‌కు ఫోన్ చేస్తుంది. ఇంతలో పెళ్లి హడావుడిలో సౌండ్ వినిపించడం లేదని జానును పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడాలని శ్రీనివాస్ ఆమెకు ఫోన్ ఇస్తాడు.
షాక్‌లో జాను..
ఇంకా పెళ్లి వేదిక వద్దకు ఎందుకు రాలేదని సుపర్ణికను జాను అడుగుతుంది. రాలేని పరిస్థితి అని.. శ్రీకాంత్ అన్నయ్యకు ప్రమాదం జరిగిందని చెప్తుంది. దీంతో జాను అక్కడే షాక్‌తో కన్నీళ్లు పెట్టుకుని కూర్చుండిపోతుంది. గౌరీ పూజ పూర్తైందని.. వరుడి రావడమే ఆలస్యమని పూజారి చెప్పడంతో.. అంతా శ్రీ కోసం ఎదురు చూస్తుంటారు. విషయం తెలియక అందరూ సంతోషంతో ఫోటోలు దిగుతారు. ఫోటోల కోసం అంతా వచ్చారని జాను ఎక్కడని బామ్మ అడగ్గా.. దూరంగా ఉన్న జాను కన్నీళ్లతో అక్కడకు వస్తుంది. తులసి ఆమెను పక్కన కూర్చోబెట్టుకుని మరీ ఫోటోలు దిగుతుంది.
ఆస్పత్రికి తులసి కుటుంబం
శ్రీకి యాక్సిడెంట్ అయిన విషయాన్ని జాను, విశ్వకు చెబుతుండగా.. ఆమె అక్క విని.. లక్ష్మి, శ్రీనివాస్, తులసిలకు చెప్తుంది. దీంతో అంతా షాక్‌కు గురై ఆస్పత్రికి బయల్దేరుతారు. తులసి, జాను, శ్రీనివాస్, లక్ష్మి అంతా కంగారుగా ఆస్పత్రికి వెళ్తారు.
మరోవైపు, ఈలోపు బయట కార్ యాక్సిడెంట్ అయిన వారి గురించి తెలుసుకోవాలని సిద్ధు తన అనుచరులకు చెప్తాడు. ఆ తర్వాత సిద్ధును కార్పొరేషన్ ఎన్నికలో నామినేషన్ వేసేందుకు బసవ ఆఫీస్‌కు తీసుకెళ్తాడు. పేపర్స్‌పై సంతకం అనంతరం సిద్ధు బయటకొచ్చి శ్రీ వాళ్ల గురించి తెలుసుకుని ఆస్పత్రికి బయల్దేరుతాడు.
ఖుషీకి బ్లడ్ ఇచ్చిన సిద్ధు
ఆస్పత్రికి సిద్ధు వెళ్లి ఎంక్వైరీ చేయగా.. పేరు తెలియకపోవడంతో నర్స్ వివరాలు చెప్పలేకపోతుంది. అయితే, ఎమర్జెన్సీ వార్డులో చెక్ చేయాలని నర్స్ చెబుతుంది. దీంతో సిద్ధు అక్కడకు వెళ్తాడు. ఇదే టైంలో ఖుషీకి బ్లడ్ ఎక్కువగా పోయిందని.. 'A-' బ్లడ్ కావాలని డాక్టర్ చెప్పగా స్టాక్ లేదని నర్స్ చెప్పడంతో ఎలాగైనా బ్లడ్ కోసం ప్రయత్నించమని చెప్పగా నర్స్ బయటకు వెళ్లి 'ఏ నెగిటివ్' బ్లడ్ కావాలని చెప్తుంది. ఇది విన్న సిద్ధు తనది అదే బ్లడ్ గ్రూప్ అని.. తాను బ్లడ్ ఇస్తానని అంటాడు. దీంతో నర్స్ అతని నుంచి బ్లడ్ తీసుకుంటుంది.
మృత్యుకోరల్లో శ్రీకాంత్..
ఇదే సమయంలో తులసి, లక్ష్మి శ్రీనివాస్ కంగారుగా ఆస్పత్రికి వచ్చి శ్రీ కండీషన్ గురించి అడుగుతారు. ట్రీట్మెంట్‌కు రెస్పాండ్ అవుతున్నారని.. అయితే, పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్ చెబుతాడు. దీంతో తులసి కుటుంబం కన్నీళ్లు పెట్టుకుంటుంది. సుపర్ణిక సైతం కన్నీళ్లు పెడుతుండగా.. భార్గవ్ ఓదారుస్తాడు. ఏ దరిద్రం పట్టిందో ఇలా జరిగిందటూ తులసిని ఉద్దేశించి సుపర్ణిక అంటుంది. దీంతో తులసి మరింత వేదనకు గురవుతుంది. అసలు, శ్రీ మృత్యుకోరల నుంచి బయటపడతాడా.?, ఖుషి, వసుంధర పరిస్థితేంటి..?, తులసి జీవితం ఎలాంటి మలుపు తిరగబోతోంది..? అనే విషయాలు తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.