Brahmamudi Serial Today Episode: స్కూల్‌ లో ప్రిన్సిపాల్ దగ్గర కూర్చున్న రాజ్‌కు ఒక ఫోటో చూపించి ఇందులో నీకు ఎవరైనా గుర్తున్నారా..? చూడు అంటూ ఫోటో ఇస్తుంది. ఫోటో చూసిన రాజ్‌ ఎవ్వరూ గుర్తు రావడం లేదని చెప్తాడు.

యామిని: బావ ఇది నువ్వు… ఇది నేను.. ఇదేమో మన ఫ్రెండ్ లాస్య, ఇదిగో ఇది పూజిత వీడు లడ్డుగాడు.

కావ్య: ఆయనకు గతం గుర్తు లేదని నీకు నచ్చిన గతాన్ని గుర్తు చేస్తూ ఒక బొమ్మలా ఆడుకుంటున్నావు యామిని నిన్ను వదిలిపెట్టను.

రాజ్‌ :  సారీ యామిని నిజంగానే వీళ్లెవరూ నాకు గుర్తు రావడం లేదు.

యామిని:  పర్లేదులే బావ నువ్వు వీళ్లందరినీ గుర్తు పట్టమని ఫోర్స్‌ చేయడం లేదు. జస్ట్‌ నీకు ఓల్డ్‌ మెమెరీ గుర్తు రావడం కోసం ఇక్కడికి తీసుకువచ్చాను. ఇక మనం వెళ్దామా..?

రాజ్‌ : సరే వెళ్దాం పద..

యామిని: బావ నీకు ఇక్కడ ఇంకో సర్‌ఫ్రైజ్‌ ఉంది. ఇక్కడే మన కాలేజ్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారు. అందరూ నిన్ను కలవడానికే ఇక్కడికి వచ్చారు. అదిగో వాళ్లే..

 అంటూ వాళ్ల దగ్గరకు తీసుకెళ్లగానే వాళ్లు కూడా యామిని అరెంజ్‌ చేసిన ఫ్రెండ్స్‌ ఉంటారు. రాజ్‌ వాళ్లకు కూడా మీరెవ్వరూ నాకు గుర్తు రావడం లేదని చెప్తాడు. దీంతో యామిని రాజ్‌ను మీ అమ్మా నాన్నాల గురించి అడిగావు కదా అక్కడికి వెళ్దాం పద అని రాజ్‌ను ఇంకో చోటుకు తీసుకెళ్తుంది. కావ్య ఫాలో అవుతుంది.

రాజ్‌: ఇక్కడికి తీసుకొచ్చావేంటి..?

యామిని: బావ ఇది మన ఫాం హౌస్‌. ఇదిగో ఈ సమాధులను చూస్తుంటే నీకేమైనా గుర్తు వస్తుందా..? బావ

రాజ్: లేదు. ఏమీ గుర్తు  రావడం లేదు.

యామిని: నీకు చెప్పాను కదా మీ మామ్‌ డాడ్‌ ని పరియచం చేస్తానని అదిగో వీళ్లే.

కావ్య: మా అత్తయ్య మామయ్యలను నీ స్వార్థం కోసం చంపేస్తావా..?

యామిని: మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మీ అమ్మా నాన్నా యాక్సిడెంట్‌లో చనిపోయారు. మా అమ్మా నీకు సొంత మేనత్త అందుకే నిన్ను సొంత కొడుకులా పెంచింది.

రాజ్‌: మా అమ్మా నాన్నా చనిపోయారన్న ఆలోచన కానీ, దానికి సబంధించిన జ్ఞాపకాలు కానీ ఏవీ గుర్తు రావడం లేదు.

యామిని: ఇన్నేళ్లు కలిసి పెరిగిన నేనే నీకు గుర్తు రావడం లేదు. కానీ ఎప్పుడో చనిపోయిన మీ అమ్మా నాన్నాలు ఎలా గుర్తుకు వస్తారు బావ. నువ్వంటే మా మామ్‌ డాడ్‌కు చాలా ఇష్టం. మనిద్దరికి కూడా ఒక్కళ్లంటే ఒక్కరికి చాలా ఇష్టం పెరిగింది. ఆ ఇష్టంతోనే ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ ఆరు నెలల క్రితం జరిగిన యాక్సిడెంట్ వల్ల మళ్లీ నేను నీకు అన్ని కొత్తగా పరిచయం చేయాల్సి వస్తుంది.

కావ్య: ఆరు నెలల క్రితం యాక్సిడెంటా..? చిన్నప్పుడే అమ్మా నాన్నా చనిపోవడం ఏంటివన్ని.. ఆయన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావే..

రాజ్‌:  నాకు తల నొప్పిగా ఉంది వెళ్దాం పద

అనగానే సరే ఈ పూల మాల మీ అమ్మా నాన్నకు వేయ్‌ వెళ్దాం అంటుంది యామిని. రాజ్‌ పూల మాలలు తీసుకుని పక్కకు విసిరేసి అక్కడి నుంచి కారు దగ్గరకు వెళ్లిపోతాడు.  అక్కడి నుంచి రాజ్‌, యామిని వెళ్లిపోతారు. ఇంతలో కావ్యకు అప్పు ఫోన్‌ చేస్తుంది. జరిగిన విషయం చెప్పిన కావ్య.. ఇంటికి వచ్చేయ్‌ అన్ని వివరంగా చెప్తాను అంటుంది కావ్య. మరోవైపు రుద్రాణి పిచ్చాసుపత్రికి ఫోన్‌ చేసి కావ్య గురించి చెబితే పిచ్చాసుపత్రి వ్యాన్‌ వస్తుంది. ఇంట్లో అందరూ రుద్రాణిని తిడతారు. ఇంతలో ఇంటికి వచ్చిన కావ్యను రుద్రాణి నిలదీస్తుంది. రాజ్‌ ఎక్కడున్నాడని అడుగుతుంది. సరిగ్గా నెల రోజుల్లో రాజ్ ను ఇంటికి తీసుకొస్తానని చాలెంజ్‌ చేసి వెళ్లిపోతుంది కావ్య. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!