Krishna Mukunda Murari Today Episode  కృష్ణ, మురారిలు బైక్‌పై నుంచి పడిపోతారు. బైక్ టైరులో చిక్కుకున్న చీరని మురారి తీస్తుండగా.. ఎదురుగా కారులో ముకుంద నవ్వుకుంటూ వెళ్లినట్లు మురారి చూస్తాడు. ముకుంద కావాలనే మురారికి మాత్రమే కనిపించేలా అటూ ఇటూ తిరుగుతుంది. ఇక మురారి కృష్ణను దగ్గర ఉన్న టీ షాపు దగ్గరకు తీసుకెళ్లి నీళ్లు తాగిస్తాడు.


కృష్ణ: నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నేను చీరని బాగానే పట్టుకున్నా ఏసీపీ సార్ చీర టైర్‌లో ఎలా చిక్కుంది. 
మురారి: మనసులో.. నాకు అర్థమైంది కృష్ణ ముకుంద కనిపించడం మాట్లాడటం భ్రమకాదు నిజమే. తన ఆత్మ మన ఇంట్లోనే తిరుగుతుంది. మనల్ని విడదీయాలా అని చూస్తుంది. నిన్ను ఓపెనింగ్‌కు తీసుకెళ్లొద్దు అంది. అన్నట్లుగానే ప్రమాదం జరిగేలా చేసింది. ముకుందను చాలా తక్కువ అంచనా వేశాను. చచ్చి కూడా సాధిస్తుంది. 
కృష్ణ: వెళ్దామా ఏసీపీ సార్ వాళ్లు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
మురారి: మనం వెళ్లడం లేదు కృష్ణ. నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. ఇంటికి వెళ్లిపోదాం. 


ఇక మురారి తాము ఓపెనింగ్‌కు రామని చెప్పడానికి పరిమళ ఇచ్చిన నెంబరుకు కాల్ చేస్తాడు. ఆ ఫోన్‌ను ముకుంద ఎత్తుతుంది. మురారి హాస్పిటల్‌ ఓపెనింగ్‌కు రాము అని చెప్తే ముకుంద నవ్వుతుంది. అది చూసి ముకుంద అని గుర్తుపట్టి ముకుంద అని అంటాడు మురారి.


ముకుంద: ముకుందనే.. చిలక్కి చెప్పినట్లు చెప్పాను. కృష్ణని తీసుకెళ్లొద్దు తీసుకెళ్తే ఊరుకోను అన్నాను. రిజల్ట్ చూశావుగా.. నన్ను సీరియస్‌గా తీసుకో మురారి. నేను లేను కానీ ఉన్నాను. ప్రతిక్షణం నిన్ను కనిపెడుతూనే ఉంటాను. మళ్లీ చెప్తున్నా మురారి నువ్వు ఆ కృష్ణకి ఎంత దూరం ఉంటే అంత మంచిది తనకు. 
కృష్ణ: ఏసీపీ సార్ ఏంటి అలా ఉండిపోయారు  మాట్లాడారా..
మురారి: లేదు మళ్లీ చేస్తా.. ఈ నెంబరుకి కాల్ చేస్తే ముకుంద ఎలా మాట్లాడింది. ఇక మురారి మళ్లీ ఆ నెంబరుకి కాల్ చేస్తే ఓ వ్యక్త ఎత్తి మాట్లాడుతాడు. ఇంతకు ముందు మాట్లాడాను అని అంటే ఇప్పుడే ఫోన్ వచ్చింది ఇంతకు ముందు ఎవరూ చేయలేదు అంటాడు. దీంతో మురారి తల పట్టుకుంటాడు. ఇక ముకుంద నోట్ల కట్టతో అక్కడికి వచ్చి ఆ వ్యక్తిని కొనేస్తుంది.
ముకుంద: వాళ్లు రారు నాకు తెలుసు. నేను ఆత్మ అని మురారి పూర్తిగా నమ్మేశాడు. ఇక కృష్ణతో కలిసి ఉండడు. ప్లాన్ ఏ సక్సెస్. నేను ఇంటికి వెళ్లే సరికి వాళ్లిద్దరికి కాపాలా కాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్లాన్ బీ అమలు చేయాలి. వస్తున్నా మురారి. ఈసారి నన్ను ఆపడం ఎవరి వల్ల కాదు. 


రేవతి: అదేంట్రా ఏదో హాస్పిటల్ ఓపెనింగ్‌కు వెళ్తాం అన్నారు అప్పుడే వచ్చేశారు. 
మురారి: లేదమ్మ దారిలో బైక్ స్కిడ్ అయి కృష్ణ కింద పడిపోయింది. 
ఆదర్శ్‌: అలా చేసేవారికి ఇలానే దెబ్బలు తగులుతాయి. మనం ఒకరికి అన్యాయం చేస్తే ఆ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా. శిక్ష అనుభవించేలా చేస్తాడు. మంచిగా ఉండే వాడిని మీరందరూ కలిసి నన్ను ఇలా మార్చేశారు. అసలు ఇలాంటి వాళ్లతో ఇలా ఉండటమే కరెక్ట్. 
మధు: ఆదర్శ్ నీకు ఇదివరకే చెప్పా మళ్లీ మళ్లీ చెప్తున్నా కృష్ణని ఏమైనా అన్నావు అంటే..
కృష్ణ: మధు.. నువ్వు అనుకున్నట్లు నాకు దెబ్బలు ఏమీ తగల్దేదు ఆదర్శ్‌. 70, 80 స్పీడ్ మీద వెళ్తున్న బైక్ మీద నుంచి ఇద్దరం కింద పడిపోయాం. అయినా చూడు ఇద్దరికీ చిన్న గాయం కూడా అవ్వలేదు. అంటే మేం ఎలాంటి వాళ్లమో ఆ దేవుడికి తెలుసు. అందుకే క్షేమంగా బయట పడ్డాం. ఒక్కోసారి మనం కొందరిని తప్పుగా అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకోవడానికి ఏదో అడ్డు వస్తుంది. అది ఏంటో తెలుసుకో..


మరోవైపు ముకుంద డాక్టర్‌ని కలిసి తన ముఖం మార్చుకునేందుకు అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఇక మురారి ముకుంద మాటలు తలచుకుంటుంటాడు. ముకుంద లేకపోయినా ఆత్మ రూపంలో తనని వెంటాడు తుంది అని అనుకుంటాడు. ఏం చేయాలి.. కృష్ణని దూరంగా ఉంచాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నందూ ముకుంద దెయ్యంలా వచ్చింది అని కృష్ణతో చెప్తుంది. ఆదర్శ్‌ సెట్ అవ్వాలి అంటే భవాని రావాల్సిందే అని రేవతి అంటుంది. ఇక ఉదయం రేవతి శాంతి హోమం ఏర్పాట్లు చేయిస్తుంది. ఆదర్శ్‌ హోమం చేయను అంటాడు. ఇక ఆదర్శ్‌ ఇంటికి పట్టిన పీడ కృష్ణ అని అంటాడు. దీంతో మధు గొడవ పెట్టుకుంటాడు. 


ఆదర్శ్‌: ఎప్పుడైనా ఈ ఇంటి నుంచి ముకుంద వెళ్లేలా చేశారో. ముకుంద చావుకి కారణం అయ్యారో అప్పుడే ఈ ఇంటికి శాంతి మనస్శాంతి దూరం అయిపోయాయి. 
ఇక ముకుంద ఫొటో పెట్టి దానికి దండ వేసి పూజ ఏర్పాట్లు చేస్తారు. ముకుంద ఫోటోకి పూజ చేయమంటే ఆదర్శ్‌ నిరాకరిస్తాడు. 


కృష్ణ: ముకుంద చనిపోవడానికి కారణం మేమే అని మమల్ని ఇంత ద్వేషిస్తున్నావు కదా. మొన్నటి వరకు మమల్ని ఎంత గానో అభిమానించిన నువ్వు ఇంతలా ద్వేషిస్తున్నావు అంటే ముకుంద మీద నీకు చాలా ఇష్టం ఉండాలి. అది నిజమైతే హోమంలో కూర్చో. హోమం చేసేసి ఇంట్లో శాంతి కోసమే కాదు ముకుంద ఆత్మ శాంతి కోసం కూడా.. 
ఆదర్శ్‌: కన్నీళ్లు పెట్టుకుంటూ హోమంలో కూర్చొంటాడు. మరోవైపు ముకుంద సర్జరీ అయిపోతుంది. ఆదర్శ్‌ ముకుంద మాటల్ని తలచుకొని కోపంతో హోమం మధ్యలో లేచేస్తాడు. ఎవరు ఎంత చెప్పినా వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. హోమం ఆగిపోతుంది. 
కృష్ణ: పంతులుగారు నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. ఏమవుతుంది. 
పంతులు: ఏం కాదు అమ్మ హోమం దాదాపు పూర్తి అయిపోయింది. ఆయన చేయాల్సిన క్రతువు ఆయన పూర్తి చేసేశారు. ఏం పర్లేదు ఇక మీరు హోమంలో కూర్చోండి. ముకుంద తన కొత్త ముఖాని చూసి కనీళ్లు పెట్టుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.   


Also Read: పవన్‌కల్యాణ్: ఎన్నికల ప్రచారంలో 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' గ్లాస్‌ డైలాగ్‌తో వారికి పవన్ కౌంటర్ - పగిలేకొద్ది గాజు పదునెక్కుతుంది..